కోటగిరి మండల కేంద్రంలోని అమ్మ అనాధాశ్రమం విద్యార్థినికి అభయ హస్తం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పెళ్లి కానుకలు అందజేశారు ఈ సందర్భంగా సభ్యుడు బర్ల మధుకర్ మాట్లాడుతూ 2009లో ప్రారంభించిన అమ్మ అనాధాశ్రమం అనాధలకు వికలాంగులకు వారికి పెళ్లి చేయడం ఎంతో గొప్ప విషయం అన్నారు 2009లో పావని వికలాంగురాలు అధైర్య పడకుండా అమ్మ వెంకట రమణమ్మకు తోడుగా చేసుకుని ఆశ్రమాన్ని ప్రారంభించి ఎందరినో అనాధాలను వికలాంగులను చదివించి మంచి ర్యాంకులతో పాటు మెజారిటీలు సాధించి ఆర్మీలో ఉద్యోగాలు సంపాదించడం ఎంతో ఆనందదాయకమన్నారు నేడు పావని స్వర్గస్తులైనా కూడా ఆమె ఆశ్రమం ఆగిపోకుండా వారికి పెళ్లిళ్లు చేయడం బాధ్యత తీసుకోవడం మర్చిపోలేని అనుభూతి అన్నారు ఈ ఆశ్రమంలో విద్యార్థినికి ఇటీవల పెండ్లి కుదరడంతో పెండ్లికి కానుకగా అమ్మాయికి సంబంధించిన నూతన వస్త్రాలను ఇతర కానుకలను అభయహస్తం ఫౌండేషన్ వారి సహకారంతో అందజేయడం జరిగిందన్నారు వారికి ఎల్లవేళలా సహకారం ఉంటుందని బర్ల మధుకర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సభ్యులు బాలసాయి చిత్తర నరేందర్ శ్రీకాంత్ కూర్చారు ఇందూరు సాయి గంగాధర్ రాజు ఆశ్రమం లక్ష్మణ్ బర్ల శ్రీధర్ ఉన్నారు

No comments:
Post a Comment