Monday 25 March 2024

పిడుగు ఎప్పుడు పడుతుంది

 చెప్పడం కష్టం కదా భారత వాతావరణ విభాగం మాత్రం మరీ అంత కష్టం కాదని చెబుతోంది మీ తల వెనకాల మెడకు పై భాగంలో వెంట్రుకలు కాస్త నిక్కబడుచున్నట్లు పైకి లేచినట్టు అయిందంటే మీకు అతి  దగ్గరలో పిడుగు పడే అవకాశం చాన్స్ ఉందని అర్థమట అలాగే వాన రాకడ ప్రాణం పోకడ కూడా ఎవరికీ తెలియదనేది సామెత అయితే ఉరుములు మెరుపులతో జడివాన కురిసే పరిస్థితిని కొన్ని అంశాలతో ముందే గుర్తించవచ్చని ఐఎండి పేర్కొంది ఈ మేరకు ఎక్స్ లో సూచనలు చేసింది ఈ సమయంలో ఆకాశంలో బాగా ఎత్తుగా కాలీఫ్లవర్ వంటి ఆకృతిలోని దట్టమైన నల్లటి మేఘాలు అలాగే నిలువుగా మేఘాలు కమ్ముకుంటాయట అప్పటికప్పుడు చల్లటి గాలివీయడం మొదలవుతుందని ఐఎండి తెలిపింది



No comments:

Post a Comment