సెకండ్ ఒపీనియన్ కోరే వారి కోసం ప్రారంభించిన ఆంకాలజిస్టుల టీం ఉచితంగా వైద్యుల కన్సల్టేషన్
క్యాన్సర్ రోగుల కోసం కొంతమంది అహంకాలజిస్టులతో కూడిన బృందం సెకండ్ ఒపీనియన్ హెల్ప్ లైన్ నెంబర్ను ప్రారంభించింది తమ క్యాన్సర్ సమస్యపై రెండో అభిప్రాయం కోరుకునే రోగులు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య 9355520202 నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు ఈ నెంబర్కు కాల్ చేసి క్యాన్సర్ రోగులు డైరెక్ట్ గా నిపుణులైన ఆంకాలజిస్ట్ తో ఉచితంగా మాట్లాడవచ్చు చికిత్స పై చర్చించేందుకు వీడియో కాల్ చేసేందుకు కూడా అవకాశం ఉన్నది క్యాన్సర్ మొత్తం భారత్ క్యాంపెయిన్ లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు క్యాంపెయిన్ హెడ్ డాక్టర్ ఆశిష్ గుప్తా తెలిపారు ప్రాణాంతకమైన క్యాన్సర్ బారిన పడిన రోగులందరికీ సెకండ్ ఒపీనియన్ ను సిఫారసు చేస్తున్నామన్నారు క్యాన్సర్ చికిత్సకు సంబంధించి వివిధ దవాఖానాల్లో వేరువేరుగా ఖర్చవుతుంది అని ఇది కూడా సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి మరో కారణమని ఆశిష్ గుప్తా అన్నారు క్యాన్సర్ కు సంబంధించి భయంకరమైన సవాళ్లను ఎదుర్కొంటున్న వారికి తమ హెల్ప్ లైన్ ఒక విలువైన వనరుగా ఉపయోగపడుతుందని ఖచ్చితమైన సమాచారం అందిస్తుందని పేర్కొన్నారు దేశంలో భారీగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు ఎందుకు సరిపడా సంఖ్యలో ఆరోగ్య సదుపాయాలు వైద్యులు లేని దృష్ట్యా ఈ హెల్ప్ లైన్ నంబర్ ను ఏర్పాటు చేశామని తెలిపారు నీటి కాలంలో క్యాన్సర్ చికిత్సలో నిత్యం కొత్త ఔషధాలు సరికొత్త థెరపీలు వస్తున్నాయని ఇలాంటి సమయంలో వైద్యుల నుంచి సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం అమూల్యమైనదని గుప్తాభిప్రాయపడ్డారు
No comments:
Post a Comment