భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఏప్రిల్ 17న జరగనున్న రామయ్య కళ్యాణం శ్రీరామనవమి 18న స్వామివారి మహా పట్టాభిషేకం కార్యక్రమాలకు సెక్టార్ టికెట్లను ఆన్లైన్ ద్వారా భక్తులు పొందే అవకాశం కల్పించినట్లు ఈవో రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు కళ్యాణ మహోత్సవానికి 7500 దంపతులు 2500 2000 1000 300 150 పట్టాభిషేకం టికెట్లు 1500 500 రూపాయలుగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు
భక్తులు భద్రాద్రి దేవస్థానం వెబ్ సైట్ https://bhadradritemple.Telangana.gov.in ద్వారా సోమవారం నుంచి బుక్ చేసుకోవచ్చని వివరించారు దేవస్థానంలో నేరుగా టికెట్లు పొందాలని భక్తులకు ఆలయం వద్ద తాళించా కళ్యాణ మండపం బ్రిడ్జి పాయింట్ సి ఆర్ వో కార్యాలయం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు భక్తులు గుర్తింపు కార్డు సిబ్బందికి చూపించి టికెట్లు పొందవచ్చు అని ఈవో సూచించారు
No comments:
Post a Comment