Friday, 29 March 2024

గృహాల్లో ఉపయోగించే రసాయనాలు ఎలా తయారు చేసుకోవాలి

 ఆర్ట్స్ కళాశాలలో వర్క్ షాప్

నిత్యం గృహాలలో ఉపయోగించే డిటర్జెంట్ పౌడర్ లిక్విడ్ సోప్ ఫ్లోర్ క్లీనర్స్ ఫినాయిల్ హెర్బల్ పౌడర్ నొప్పి నివారణ మందులను తయారు చేసుకోవడం ద్వారా విద్యార్థులు స్వయం ఉపాధి పొందవచ్చని సోర్స్ పర్సన్ ఎం జయంతి అన్నారు కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ఆధ్వర్యంలో ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు హాజరైన జయంతి విద్యార్థులు బహుముఖ నైపుణ్యాలు కలిగి ఉండాలన్నారు ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ మాట్లాడుతూ కెమిస్ట్రీ విద్యార్థులకు రసాయనాలపై అవగాహన ఉన్నందున గృహాల్లో నిత్యం ఉపయోగించే వివిధ ఉత్పత్తులను తయారు చేసి స్థానికంగా మార్కెటింగ్ చేయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చన్నారు కళాశాల తరఫున పూర్తి సహకారం అందిస్తామన్నారు వర్క్ షాప్ లో వైస్ ప్రిన్సిపాల్ కిష్టయ్య కెమిస్ట్రీ అధ్యాపకులు శారద సమన్వయకర్తలు చంద్రకాంత్ శంకరయ్య శ్రీనివాస్ శ్రీలత జుబేరియా రామస్వామి శ్రీనివాసరావు రాజేందర్ స్వాతి సుచరణ్ మానస మరకలు మహిళా గురుకుల డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు మీనా విద్యార్థులు పాల్గొన్నారు



No comments:

Post a Comment