KITCHEN TIPS లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
KITCHEN TIPS లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, మార్చి 2024, శుక్రవారం

గరం రుచి కోసం

 కూరల్లో గరం మసాలా పొడులు మోతాదు మించితే కూర రుచి మారిపోతుంది చేదు వస్తుంది అలా చేయదు వచ్చినప్పుడు కూరల్లో అరాకప్పు చీకటి పాలు లేదా టేబుల్ స్పూన్ మీగడ కలపాలి పాలు పాల ఉత్పత్తులు ఇష్టపడని వాళ్ళు జీడిపప్పు పొడి లేదా వేరుశనగపప్పు పొడి కూడా కలుపుకోవచ్చు ఇలా చేస్తే చేదు తగ్గడంతో పాటు కూర రుచి ఇనుమడిస్తుంది కూడా

మార్కెట్లో కొన్న మసాలా పొడుల్లో ప్యాకెట్ సీలు విప్పినప్పుడు ఉన్నంత సువాసన ఆ తర్వాత ఉండదు కాబట్టి చిన్న చిన్న ప్యాకెట్లు కొనుక్కొని తెరిచిన వెంటనే మొత్తం వాడేయడం ఒక పద్ధతి పెద్ద ప్యాకెట్ కున్నప్పుడు కొద్దిగా వాడిన తర్వాత ప్యాకెట్ లోకి గాలి దూరకుండా క్లిప్ పెట్టాలి

గరం మసాల పొడిలను ఇంట్లోనే ఎక్కువ మోతాదులో చేసి నిల్వ ఉంచుకోవాలనుకుంటే పొడి నీ తేమలేని సీసాలో పోసి గాలి చురకుండా మూత పెట్టి ఫ్రిజ్లో పెట్టాలి ఇలా చేసినప్పుడు ఏడాదంతా నిల్వ ఉంచిన తాజాతనం తగ్గదు

14, మార్చి 2024, గురువారం

మురికిని ఇలా వదిలించండి

 వాటర్ బాటిల్లో సగం వరకు నీళ్లు పోయాలి మిగతా సగంలో నిమ్మకాయ ముక్కలు ఉప్పు ఐస్ ముక్కలను వేసి బాగా షేక్ చేయాలి ఇలా పది నిమిషాలు చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి ఈ విధానంలో బాటిల్ కడగడం వలన బాటిల్లో సూక్ష్మజీవులు పూర్తిగా పోతాయి

టీ స్పూన్ వంటసోడా రెండు టీ స్పూన్ల వెనిగర్ ను బాటిల్లో వేసి మూత పెట్టాలి 20 నిమిషాల తర్వాత బాటిల్ ని బాగా షేర్ చేసి కడగాలి ఇలా కడిగిన బాటిల్ మూత తీసి పూర్తిగా ఆరిన తర్వాత వాడుకోవాలి

వంట సోడా వెనిగర్ ను సమపాళ్లలో తీసుకొని కలపాలి ఈ మిశ్రమాన్ని బాగా మాడిన గిన్నె ఫ్రై పాన్ పై రాసి 20 నిమిషాలు నానబెట్టాలి తర్వాత డిష్ వాషర్ తో రుద్ది కడిగితే మురికి మొత్తం తొలగిపోతుంది

గోరువెచ్చని పాలలో రెండు టీ స్పూన్ల పెరుగు వేసి కలపాలి పాలలో ఈ మిశ్రమం వేసి వడలను వేసి ఐదారు గంటలు నానబెడితే పెరుగు చక్కగా తోడుకుంటుంది ఇప్పుడు ఈ వడలకు తాలింపు వేసి తింటే పెరుగు వడలు చాలా రుచిగా ఉంటాయి పెరుగు లేనప్పుడు ఇలా చేస్తే పెరుగు పులపకుండా పెరుగు వడలు రుచిగా వస్తాయి

వేడినీళ్లలో బేకింగ్ సోడా కొద్దిగా నిమ్మరసం వేసి కలపాలి ఈ నీటిలో టూత్ బ్రష్ ను మునిగేలా వేసి 20 నిమిషాలు నానబెట్టాలి తర్వాత సాధారణ నీటిలో కడిగితే బ్రష్ లో ఉన్న మురికి బ్యాక్టీరియా పోతుంది పది రోజులకు ఒకసారి బ్రష్ లని ఇలా శుభ్రం చేసుకుంటే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి

రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్ల బియ్యం కలపాలి ఈ మిశ్రమంలో ముంచిన టిక్కాను తర్వాత గుడ్ల సునలో ముంచి డీప్ ఫ్రై చేస్తే టిక్కా క్రిస్పీగా మరింత రుచిగా వస్తుంది

13, మార్చి 2024, బుధవారం

కిచెన్ టిప్స్ 13 మార్చి 2024

 రెండు స్పూన్ల నీటిలో స్పూన్ పాలు పోసి చక్కగా కలపాలి ఈ పాల మిశ్రమాన్ని వంకాయ ముక్కలపై చిలకరిస్తే ముక్కలు చేదుగా మారవు

టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసిన నీటిలో తరిగిన వంకాయ ముక్కలు వేస్తే ఖన్నరెక్కవు

వంకాయ ముక్కలు లేదా కూరగాయ ముక్కలు వేసే నీటిలో టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి కలపాలి అప్పుడు కూరగాయ ముక్కలు రంగు మారకుండా ఉంటాయి

10, మార్చి 2024, ఆదివారం

ఈ పొడితో క్షణాల్లో బిర్యాని

 బిర్యానీ పేరు వింటే చాలు నోట్లో నీళ్లురుతాయి కానీ అందులో వేసే దినుసులన్నీ అప్పటికప్పుడు నూరాలి అంటే కాస్త పెద్ద ప్రహసానమే. అదే బిర్యాని మసాలా పౌడర్ సిద్ధంగా ఉందనుకోండి ఉప్మా అంతా సులువు అయిపోతుంది ఈ పౌడర్ చేసేందుకు ఒక జాజికాయ రెండు అంగుళాలు దాల్చిన చెక్క 12 లవంగాలు పది యాలకులు మూడు నల్ల యాలకులు రెండు చెంచాల మిరియాలు పావు కప్పు ధనియాలు చెంచా చొప్పున సోంపు జీలకర్ర నల్ల జీలకర్ర కొద్దిగా జాపత్రి 7 8 బిర్యానీ ఆకులు అర చెంచా పసుపు నాలుగు ఎండుమిర్చి రెండు చెంచాల డ్రైవ్ జింజర్ పౌడర్ ఇంతకీ దీన్ని ఎలా చేయాలంటే కడాయిలో బిర్యాని ఆకులు ఎండుమిర్చి వేయించి పళ్లెంలోకి తీయాలి తర్వాత ధనియాలు జీలకర్ర నల్ల జీలకర్ర సోంపు మంచి సువాసన వచ్చే వరకు వేయించి తీయాలి ఆ తర్వాత జాజికాయ దాల్చిన చెక్క బ్లాక్ కారడమం మిరియాలు యాలకులు లవంగాలు, జాపత్రి కూడా వేయించాలి అన్ని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పసుపు డ్రై జింజర్ పౌడర్ జత చేస్తే సరి గుమగుమలాడే బిర్యాని మసాలా పౌడర్ తయారైనట్లే దీనిని తడి లేని గాలి చొరబడని సీసాలో భద్రం చేసుకుంటే తినాలనిపించినప్పుడల్లా క్షణాల్లో బిర్యాని చేసుకోవచ్చు

6, మార్చి 2024, బుధవారం

శుభ్రతలో కింగ్ బేకింగ్ సోడా

 


బేకింగ్ సోడా చాలా ఇళ్లలో ఉండేది మైసూర్ బజ్జీలు పొంగడానికి బిస్కెట్ల తయారీలో ఎక్కువగా వాడే ఈ బేకింగ్ సోడాతో చాలా ఉపయోగాలు ఉన్నాయి 

ఫ్లవర్ వాజ్లో నీరు పోసి ఒకటే స్పూన్ బేకింగ్ సోడా వేసి అందులో పూలను కాడలతో ఉంచితే అవి తాజాగా ఉంటాయి నీటి నుంచి నిలువ వాసన కూడా రాదు. 

వంట పాత్రల్లో వేడినీరు పోసి అందులో ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసి కాసేపు నానబెట్టి కడిగితే పాత్రలు మురికి పోయి తల తలలాడతాయి 

పాత్రలకు ఉళ్లి వెల్లుల్లి లాంటి పదార్థాల వాసన పోవాలంటే బేకింగ్ సోడాతో రుద్దితే సరి 

బేకింగ్ సోడాను తడిచేసి ఆ పేస్టు తో ఫ్రిడ్జ్ ని తుడిస్తే లోపల ఉన్న దుర్వాసన పోతుంది ఒక చిన్న గిన్నెలో ఈ పేస్టును ఫ్రిజ్లో ఉంచితే చెడు వాసన ఏర్పడదు 

బేకింగ్ సోడా కలిపిన నీటితో పనులు కూరగాయలను కడిగితే వాటి మీద ఉండే రసాయనాలు మురికి పోతాయి

3, మార్చి 2024, ఆదివారం

గరం మసాలా ఎలా చేయాలి

 పనీర్ టమాటో బంగాళదుంప లాంటి శాఖాహారాలు చికెన్ మటన్ లాంటి మాంసాహారాలు బిర్యానీ ఫ్రైడ్ రైస్ ఇలా ఏవైనా సరే స్పైసీగా ఉండాలంటే గరం మసాలా జోడి చేస్తాము ఒక్క చెంచా వేస్తే చాలు అద్భుతమైన రుచి వచ్చేస్తుంది ఇంత ముఖ్యమైన గరం మసాలా కొనకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు ఎలాగంటే కడాయిలో అరకప్పు జీలకర్రను వేయించి ఒక పళ్లెంలోకి తీయాలి సగం జాజికాయ మిరియాలు లవంగాలు యాలకులు రెండు చెంచాలు చొప్పున నాలుగు బిర్యానీ ఆకులు అంగుళామంతా దాల్చిన చెక్కలు మూడు చాపత్రికి కొద్దిగా స్టార్ మొగ్గలు బ్లాక్ కారడమములు మూడు చొప్పున తీసుకొని వీటిని కూడా వేయించి మంచి వాసన వస్తున్నప్పుడు జీలకర్ర ఉన్న పళ్లెంలోకి తీయాలి అదే కడాయిలో అరకప్పు ధనియాలు నాలుగు ఎండుమిర్చిలను వేయించాలి వాటిని కూడా తీసి రెండు చెంచాలు సోంపు వేయించాలి అన్ని వేయించడం అయ్యాక చల్లారనిచ్చే గ్రైండ్ చేయాలి అంతే గుమగుమలాడే గరం మసాలా తయారైపోతుంది దీనిని తడి లేని గాలి చొరబడని సీసాలో భద్రం చేస్తే చాలా నాళ్ళు నిల్వ ఉంటుంది



29, ఫిబ్రవరి 2024, గురువారం

పులగం ఎలా చేయాలి

 బియ్యం ఒక కప్పు పెసరపప్పు అరకప్పు ఉల్లిగడ్డ ఒకటి పచ్చిమిర్చి ఆరు మిరియాలు అర టీ స్పూన్ ఆవాలు జీలకర్ర ఒక టీ స్పూన్ చొప్పున పసుపు పావు టీ స్పూన్ నూనె రెండు టేబుల్ స్పూన్లు కరివేపాకు రెండు రెబ్బలు ఉప్పు తగినంత

బియ్యం పెసరపప్పు కడిగి విడివిడిగా గంటసేపు నానబెట్టుకోవాలి కుక్కర్లో నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు జీలకర్ర మిరియాలు తరిగిన ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు వేయాలి బాగా వేగాక పసుపు కలపాలి నానబెట్టిన పెసరపప్పు బియ్యం తగినంత ఉప్పు జోడించి రెండు నిమిషాలు బాగా కలిపి మూడు కప్పుల నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికిస్తే నోరూరించే పులగం సిద్ధమవుతుంది

15, ఫిబ్రవరి 2024, గురువారం

కిచెన్ టిప్స్ 15 ఫిబ్రవరి 2024

 గులాబ్ జామున్లు గట్టిగా అయితే పంచదార పాకంతో సహా వాటిని ప్రెషర్ కుక్కర్ లో పెట్టి సన్నటి మంట మీద ఐదు నిమిషాలు ఉడికిస్తే మృదువుగా మారుతాయి

పనీర్ వంటకం చేసేటప్పుడు నీళ్లకు బదులుగా పాలు వాడితే గ్రేవీ మెత్తగా ఉంటుంది

టేబుల్ స్పూన్ ఫ్రూట్ జామ్ ను ఒక గ్లాసు చల్లటి పాలలో వేసి మిక్సీలో బ్లెండ్ చేస్తే క్షణాల్లో రుచికరమైన ఫ్రూట్ షేక్ రెడీ అయిపోతుంది




7, ఫిబ్రవరి 2024, బుధవారం

కిచెన్ టిప్స్ 7-2-2024

 తేనె కొంతకాలం వాడకుండా ఉంచేస్తే సీసా అడుగున గడ్డకట్టుకు పోతుంటుంది అలాంటప్పుడు తేనెను కరిగించడానికి ఓ అరగంట పాటు తేనె సీసాను ఎండలో ఉంచాలి. దీనిని ఎప్పుడూ నేరుగా వేడి చేయకూడదు ఎండ లేకుండా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఒక పాత్రలో నీటిని వేడి చేసి అందులో తేనె సీసాను ఉంచాలి నీటి వేడి తో ఐదు పది నిమిషాల్లో తేనె కలుగుతుంది

పాల ప్యాకెట్లు ఫ్రిజ్లో పెట్టుకునేటప్పుడు ఆ ప్యాకెట్లను నేరుగా పెట్టకూడదు ప్యాకెట్ మన వాకిటి ముందుకు వచ్చేలోపు రకరకాల ప్రదేశాలను తాకి ఉంటుంది కాబట్టి ప్యాకెట్ ని నీటితో కడిగి ఫ్రిజ్లో పెట్టడం మంచిది

వెల్లుల్లి రేఖలు పోటు సులువుగా వదలాలంటే వెల్లుల్లి రేఖను కటింగ్ బోర్డు మీద పెట్టి చాకు వెనుకవైపు మందంగా ఉండే వైపు ఈ స్థితిలో చాకు పదును ఉన్న వైపు పైకి ఉంటుంది తిప్పి వెల్లుల్లి రేక చివర గట్టిగా నొక్కితే వెల్లుల్లి రేఖ తేలిగ్గా విడిబడుతుంది

పైనాపిల్ కట్ చేయడానికి పెద్ద చాకులను వాడాలి ముందుగా కలయ పైభాగాన్ని కింది భాగాన్ని తొలగించాలి ఎప్పుడు కాయను నిలువుగా పెట్టి చెక్కును పైనుంచి కిందకు తొలగించాలి ఆ తర్వాత మీడియం సైజ్ చాకుతో కాయను చక్రాలుగా తరగాలి

బటర్ను వంట మొదలుపెట్టడానికి ఓ అరగంట లేదా గంట ముందు ఫ్రిజ్లో నుంచి తీసి బయట పెట్టుకోవాలి. ఒకవేళ మర్చిపోతే వేడి పాల గిన్నెమూత మీద లేదా ఉడుకుతున్న వంట పాత్ర మూత మీద పెడితే పది నిమిషాల్లో మెత్తబడుతుంది అలా కుదరకపోతే స్టవ్ మీద బర్నర్ల మధ్య ఉండే ఖాళీ ప్రదేశంలో ఉంచాలి

ఐస్ క్రీమ్ సర్వింగ్ స్పూన్లు ఇంట్లో ఉండవు పెద్ద ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు దానిని పలుచగా కట్ చేయాలంటే చాకును మరుగుతున్న వేడి నీటిలో ముంచి తీయాలి ఒక స్లైస్ కట్ చేయగానే చాకు చల్లబడిపోతుంది కాబట్టి ప్రతి స్లైస్ కు ఓసారి వేడి నీటిలో ముంచాలి




రెస్టారెంట్లో ఎలా ఉండాలి?

 రెస్టారెంట్ లో ఎలా ఉండాలి?

ఫాన్సీ రెస్టారెంట్ కి వెళ్లాలంటే డైనింగ్ నియమాలు తెలిసి ఉండడం అవసరం ఆ నియమాలు ఏమిటంటే

టేబుల్ పైన ఫోన్ తాళాలు పర్సు లాంటివి ఉంచకూడదు. ఆతిథ్యం ఇస్తున్నది మీరైతే ఒక అడుగు ముందే బిల్ చెల్లించాలి.

 ఆర్డర్ చేసే అవకాశం అతిథికే ఇవ్వాలి.

 అందంగా తయారవడం ముఖ్యమే.

 వెయిటర్ మీద కోప్పడడం లాంటివి చేయకూడదు.

 సంభాషణ మృదువుగా సాగాలి.

 కలిసి వచ్చిన వ్యక్తి భోజనాన్ని రుచి చూడడం కోసం చేతులను టేబుల్ అవతలి వైపుకు చాపి పదార్థాలను అందుకోకూడదు .

కంపానియన్ ఆర్డర్ చేసిన వాటికంటే ఎక్కువ కోర్సులు ఆర్డర్ చేయకూడదు. 

సరిగా ఉడకని పదార్థాలను తిప్పి వెనక్కి పంపవచ్చు.

 న్యాప్ కిన్ ఒళ్లో  ఉంచుకోవాలి..

ప్రతిసారి సాల్ట్ , పెప్పర్లు రెండింటిని కలిపి అందించాలి.



2, ఫిబ్రవరి 2024, శుక్రవారం

వంటింట్లో గోరు కత్తి

 వంటింట్లో చేతితో పూర్తి చేయాల్సిన పనులే కాదు గోళ్ళతో చెక్క పెట్టాల్సిన వ్యవహారాలను చాలానే ఉంటాయి ముఖ్యంగా గోంగూర తెంపడం గోరుచిక్కుళ్ళు వెల్లుల్లిపాయలు వలవడం లాంటి వాటికి పదునైన గోల్లు చాలా అవసరం అయితే ఎక్కువ మొత్తంలో తెంపాల్సి వచ్చినప్పుడు గోరు సరిగ్గా లేకపోతే వేగం మందగిస్తుంది ఆ పనిని సులభతరం చేసేలా మార్కెట్లోకి వచ్చింది సిలికాన్ తంబ్ నైఫ్సెట్ ఇందులో సిలికాన్ తో చేసిన బొటనవేలు గొడుగుకు పదునైన గోరు లాంటి స్టీలు అమరికా ఉంటుంది చూపుడువేలుకు తొడుగు వస్తుంది గోరు ఎలా పనిచేస్తుందో అలానే దీంతో పనులు చేసుకోవచ్చు వేగంగా తక్కువ శ్రమతో పూర్తి చేయొచ్చు..



2, జూన్ 2022, గురువారం

వంటింటి చిట్కాలు

 మన బామ్మల కాలం నుండి నేటి వరకు ,మారుతున్న కాలానికి అనుగుణంగా వంట గది లో ఎన్నో రకాల మార్పులు వచ్చాయి.రక రకాల ప్రాంతాల నుండి ఎన్నో రకాల చిట్కాలు పాటిస్తున్నారు.




14, మార్చి 2022, సోమవారం

స్క్రబ్బర్ లు, స్పాంజ్ ల శుభ్రత

 వేడి నీళ్లలో కాస్తంత వెనిగర్ వేసి పాత్రలు తోమే స్క్రబ్బర్లు,స్పాంజ్ లను రాత్రంతా నానబెట్టిన చో మురికి పోయి,సూక్ష్మ జీవులు చనిపోయి శుభ్రము అవుతవి.