LEGAL NEWS లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
LEGAL NEWS లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, మార్చి 2024, గురువారం

హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ 2024 తెలంగాణ

 హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ తెలంగాణ 2024 ఎన్నికలలో అధ్యక్షుడిగా అయ్యాడ రవీందర్ రెడ్డి విజయం సాధించారు అధ్యక్షుడు ఎన్నిక కోసం అయ్యాడపు రవీందర్ రెడ్డి మణికొండ విజయ్ కుమార్ చిక్కుడు ప్రభాకర్ ఏ జగన్ నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారం సాగించారు గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్ద ఎత్తున న్యాయవాదులు హక్కు వినియోగించుకున్నారు ఓటింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టారు అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలు జగన్ పై రవీందర్ రెడ్డి 33 ఓట్ల తేడాతో విజయం సాధించారు ఉపాధ్యక్షురాలుగా ఏ దీప్తి జనరల్ సెక్రటరీలుగా ఉప్పల శాంతి భూషణ్ రావు జిల్లెల్ల సంజీవరెడ్డి జాయింట్ సెక్రెటరీగా వాసిరెడ్డి నవీన్ కుమార్ ట్రెజరర్ గా కట్ట శ్రావ్య స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా ఎస్ అభిలాష్ విజయం సాధించారు హైకోర్టుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల బార్ అసోసియేషన్ లకు ఒకేసారి ఎన్నికలు జరగడం ఫలితాలు ప్రకటించడం విశేషం యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రవీందర్ రెడ్డి 1987లో నాటి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవా దిగా ఎన్రోల్ అయ్యారు. గతంలో రైల్వే స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారు 2021 లో సీనియర్ న్యాయవాదిగా పదోన్నతి పొందారు



22, మార్చి 2024, శుక్రవారం

సలహా మండలి రబ్బర్ స్టాంపుల వ్యవహరించకూడదు

 పీడీ చట్టం కింద నిర్బంధాలకు గుడ్డిగా ఆమోదముద్ర వేయకూడదు సుప్రీంకోర్టు తీర్పు నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరినీ విడుదల చేయాలని ఆదేశం

దోపిడీలు దొంగతనాలకు పాల్పడుతున్నారన్న పేరుతో నల్గొండ జిల్లాకు చెందిన నేనాబాద్ బుజ్జి మునావత్ చందులను ప్రవేశన్ ఆఫ్ డేంజరస్ ఆక్టివిటీస్ ఆక్ట్ కింద రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మాడుగుల పోలీసులు నిర్బంధించడం సరికాదని సుప్రీంకోర్టు గురువారం తీర్పు చెప్పింది పీడీ యాక్ట్ కింద చేపట్టే నిర్బంధాలకు ఆమోదం తెలిపిన సలహా మండలి అడ్వైజరి బోర్డ్ పనితీరును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివైస్ న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్టీ వాళ్ళ జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది బుజ్జి చందుల నిర్బంధానికి అనుకూలంగా తెలంగాణ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం తోసిపిచ్చింది సలహా మండలి అన్నది పోలీసులు చేసే ముందస్తు నిర్బంధాలకు ఆమోదముద్ర వేసే రబ్బర్ స్టాంప్ కాదు ఇలాంటి నిర్బంధ ఉత్తర్వులు సమీక్ష కోసం సలహా మండలి ముందుకు వచ్చినప్పుడు క్రియాశీల పాత్ర పోషించి ఆ నిర్బంధమైనది చట్టస్పూర్తికి గాని కోర్టులు నిర్దేశించిన న్యాయ సూత్రాలకు గాని వ్యతిరేకంగా ఉందా లేదా అన్నది చూడాలి ఒకవేళ అలా ఉంటే నిర్బంధ ఉత్తర్వులు చెల్లవని స్పష్టంగా చెప్పాలి. ముందస్తు నిర్బంధం అన్నది క్రూరమైన చర్య అధికారాలను ఇష్టానుసారంగా ఉపయోగించుకొని నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసే విధానాన్ని మొక్కలోనే తుంచి వేయాలి కేవలం అధికారుల కోణంలో కాకుండా చట్ట పరంగా అలాంటి నిర్బంధమ అవసరమా అన్నది పరిశీలించాలి నిర్బంధ ఉత్తర్వులను కోర్టుల తరహాలో సూక్ష్మంగా పరిశీలించడానికి సలహా మండలి సభ్యులకు హైకోర్టు జడ్జిగా నియమూర్తులు కావడానికి ఉండే అర్హతలు ఉండాలని చెప్పారు అందువల్ల బోర్డు ముందు ఎప్పుడు ముందస్తు నిర్బంధ ఉత్తర్వులు ఉంచిన అందులోని ప్రతి కోణాన్ని పరీక్షించాలి డి టెన్షన్ ఉత్తర్వులు జారీ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల గురించి పట్టించుకోకుండా నిర్బంధానికి తగిన కారణం ఉందని చెబితే సరిపోదు నిర్బంధ ఉత్తరువు కోర్టు విచారణలో పిలుస్తుందా లేదా అన్నది చూడాలి నిందితులను నిర్బంధించే అధికారుల సంతృప్తిని మాత్రమే పరికాండలోకి తీసుకోవడానికి పరిమితమైతే సలహామండలిలో హైకోర్టు న్యాయమూర్తులు వారికి సమాన అర్హతలు ఉన్న సభ్యులు ఉండి ఏం ప్రయోజనం అర్థం కావడం లేదు. సలహా మండలి ఏర్పాటు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏ వ్యక్తిని యాంత్రికంగా చట్ట వ్యతిరేకంగా నిర్బంధించకూడదు అన్నది రాజ్యాంగబద్ధమైన రక్షణ సంస్థ అయిన బోర్డు క్రియాశీల పాత్ర పోషించాలి నిర్బంధించే అధికారులు ప్రభుత్వం నిర్బంధితుల హక్కుల మధ్య అది రక్షణ కవాటంలా పని చేయాలి. నిర్బంధ ఉత్తరువులను యాంత్రికంగా ఆమోదించడం కాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 4లో పేర్కొన్న విషయాలను మనసులో పెట్టుకొని పని చేయాలి. అందువల్ల ప్రివెంటివ్ డి టెన్షన్ చట్టం కింద ఏర్పాటైన సలహా బోర్డులు తమ పరిశీలన కోసం వచ్చిన డి టెన్షన్ ఉత్తర్వులపై నిర్దిష్టమైన అభిప్రాయం చెప్పే ముందు వాటిని అన్ని కోణాలలో లోతుగా సమీక్షించాలి అని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేస్తూ ఇద్దరు అప్పీల్దారులను విడుదల చేయాలని ఆదేశించింది

15, మార్చి 2024, శుక్రవారం

మొబైల్ లోక్ అదాలత్ ప్రారంభం

 జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొబైల్ లోక్ అదాలకు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయమూర్తి ఎస్ఎన్ శ్రీదేవి పేర్కొన్నారు జిల్లా కోర్టు ఆవరణలో మొబైల్ లోక్ అదాలత్ వాహనాన్ని గురువారం ప్రారంభించిన ఆమె మాట్లాడారు మొబైల్ లోక్ అదాలకు జిల్లా ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి శివరాత్రి ప్రతాపను పెసైడింగ్ అధికారిగా నియమించారు వాహనం గురువారం ఎల్లారెడ్డిలో ఈనెల 15న బాన్సువాడలో పర్యటిస్తుందని అన్నారు ప్రజలు వినియోగించుకోవాలని అన్నారు అదనపు జిల్లా న్యాయమూర్తి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ సీనియర్ సివిల్ జడ్జి టి నాగరాణి ప్రథమ శ్రేణి న్యాయమూర్తి కే సుధాకర్ అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి దీక్ష పి పి రాజగోపాల్ గౌడ్ న్యాయవాదులు రమేష్ తదితరులు పాల్గొన్నార

14, మార్చి 2024, గురువారం

సుప్రీమ్ ప్రశంస

 వంట మనిషి కుమార్తెకు సుప్రీంకోర్టు జడ్జిల్లా సత్కారం

హృదయాలను కదిలించే అరుదైన ఘట్టం సుప్రీంకోర్టులో చోటుచేసుకుంది కోర్టులో వంట మనిషిగా పనిచేస్తున్న అజయ్ కుమార్ సమాల్ అనే వ్యక్తి కుమార్తె యువ న్యాయవాది ప్రగ్యా కు అమెరికాలోని కాలిఫోర్నియా మిర్చి గాని యూనివర్సిటీలలో ఉపకార వేతనంతో న్యాయ శాస్త్రంలో మాస్టర్స్ చేసే అవకాశం వచ్చింది దీనితో బుధవారం ఉదయం కోర్టు ప్రారంభమయ్యే ముందు జడ్జీల లాంజీలు సిజెఐ జస్టిస్ డివైస్ సహా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అందరూ సమావేశమై కరతాల ధ్వనులతో ప్రజ్ఞాను అభినందించారు ఆమె తల్లిదండ్రులను సన్మానించారు ఈ సందర్భంగా జస్టిస్ డివై చంద్ర చూడు మాట్లాడుతూ దేశానికి సేవలందించేందుకు ప్రగ్యా మళ్ళీ భారత్కు తిరిగి వస్తుందని విశ్వసిస్తున్నామన్నారు రాజ్యాంగం పై రాసిన మూడు పుస్తకాల పైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అందరూ సంతకాలు చేసే ఆమెకు బహుకరించారు



13, మార్చి 2024, బుధవారం

వయసు నిర్ధారణకు ప్రామాణికం స్కూల్ సర్టిఫికెట్లు

 వయసు నిర్ధారణకు ప్రామాణికంగా స్కూల్ సర్టిఫికెట్లని పరిగణించాలని సుప్రీంకోర్టు తెలిపింది అవి లేనప్పుడే వైద్య పరీక్షలు నిర్వహించాలని అన్నది వయసు నిర్ధారణకు పాఠశాలలు ఇచ్చే ధ్రువపత్రాలని ప్రామాణికంగా తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అది ఇచ్చే జనన ధృవపత్రాలకి విలువ ఎక్కువ అని తెలిపింది. అవేవీ లేనప్పుడు మాత్రమే చివరి అవకాశం గా వైద్యులు ఇచ్చే పాత్రలను పరిశీలించాల్సి ఉంటుందని తెలిపింది 1982లో జరిగిన హత్య కేసులోని ముద్దాయి పెట్టుకున్న దరఖాస్తుపై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు తీర్పు విలువరించింది పాఠశాలలు మున్సిపాలిటీలు గ్రామపంచాయతీలు ఇచ్చే డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ను ప్రామాణికమైనవిగా చూడాలని అది అందుబాటులో లేనప్పుడు వైద్యులు ఇచ్చే అసిసిఫికేషన్ పరిశీలించాలని తెలిపింది 1982 సెప్టెంబర్ 10న జరిగిన హత్య సంఘటనలు ప్రస్తుత కేసు పిటిషనర్ వినోద్ కటారా తో పాటు మరో ముగ్గురికి ట్రైల్ కోర్టు 1986లో యావ జీవ కరాగార శిక్ష విధించింది సుప్రీంకోర్టు కూడా ఈ శిక్ష సమర్ధించింది ప్రస్తుతం వారు మదురై శిక్ష అనుభవిస్తున్నారు మరోవైపు శిక్షలు పడిన ముద్దాయిల్లో కొందరు నేరం జరిగిన సమయంలో మైనర్లుగా ఉన్నారేమో పరిశీలించాలని అలహాబాద్ హైకోర్టులో పిల్లా కలయింది 2021లో దోషులను పరీక్షించిన మధుర జైలు మెడికల్ బోర్డు వినోద్ కటార వయసు 2021 డిసెంబర్ 10 నాటికి 56 ఏళ్ళు ఉంటుందని నిర్ధారించింది 1986 సెప్టెంబర్ 10 నాటికి తన వయసు సుమారుగా 15 ఏళ్ళు ఉంటుందని అందువల్ల ఇంత శిక్ష విధించడం తగదని వినోద్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు వినోద్ వయసు పై నివేదిక ఇవ్వాలని జిల్లా కోర్టు జడ్జిని 2022 సెప్టెంబర్ 12న ఆదేశించింది స్కూల్ సర్టిఫికెట్లతో పాటు పత్రాలను పరిశీలించిన జడ్జి నేరం జరిగినప్పుడు వినోద్ మేజర్ అనీ తేల్చారు సుప్రీంకోర్టు కూడా దీనిని సమర్పించింది

6, మార్చి 2024, బుధవారం

యూఎస్ సదస్సుకు తెలంగాణ యువతి ఎంపిక

 రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామానికి చెందిన సోషల్ వర్కర్ చందన యూఎస్ జ్యుడీషియల్ విధానం అనే అంశంపై అమెరికాలో నిర్వహించనున్న ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంపికయ్యారు మొత్తం 22 దేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ కార్యక్రమంలో మన దేశం తరఫున తెలంగాణ నుంచి చెందిన ఎంపిక కావడం విశేషం చైల్డ్ ప్రొటెక్షన్ అండ్ వుమన్ రైట్స్ అనే అంశంపై ఆమె పోరాటాన్ని గుర్తించిన యుఎస్ ప్రతినిధులు చందనను ఆహ్వానించారు ప్రస్తుతం బచావో ఆందోళన్ లో స్టేట్ కోఆర్డినేటర్ గా ఆమె చురుగ్గా పనిచేస్తున్నారు. చిన్న పిల్లలు మహిళల కోసం యూఎస్ న్యాయవ్యవస్థలో ఉన్న అంశాలతో పాటు వివిధ దేశాల్లోని న్యాయవ్యవస్థలోను ఏ విధంగా ఉన్నాయన్న అంశాల పైన ప్రతినిధులకు నిర్వహించే పలు కార్యక్రమాల్లో తాను పాల్గొని చర్చించనున్నట్లు చందన తెలిపారు అమెరికాలో ఏప్రిల్ 6 నుంచి 27 వరకు జరిగే ఆయా కార్యక్రమాల్లో తాను పాల్గొంటారని తెలిపారు

5, మార్చి 2024, మంగళవారం

మోయలేని భారంగా విద్య బాంబే హైకోర్టు

 భారతీయ సంస్కృతిలో విద్యను పవిత్రమైనదిగా దైవ సంబంధమైనదిగా పరిగణిస్తామని అయితే నేడు అది భరించలేనిదిగా మారిందని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది నాణ్యమైన విద్యను ప్రతి ఒక్కరికి చేరువ చేయడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పింది పూణేలో విద్యాసంస్థల ఏర్పాటు చేసేందుకు రెండు ఆర్గనైజేషన్లకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేయడానికి తిరస్కరించింది సంబంధం లేని కారణాలతో తమ దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించిందని జాగృతి ఫౌండేషన్ సంజయ్ మోతక్ ఎడ్యుకేషన్ సొసైటీ పిటిషన్ హైకోర్టు ఫిబ్రవరి 21న తీర్పు చెబుతూ విద్యాసంస్థలు ఏర్పాటు చేయడం కోసం భూమి స్వభావం ఆర్థిక వనరుల లభ్యత మౌలిక సదుపాయాలు వంటి వాటిని పరిశీలించవలసి ఉంటుందని తెలిపింది దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించడం నిరంకుశత్వం అన్యాయం అని చెప్పలేమని వివరించంది 

3, మార్చి 2024, ఆదివారం

బ్రేకప్ తర్వాత ప్రియుడి ఆత్మహత్యకు లవర్ ను తప్పు పట్టలేము

 ప్రియునికి ప్రియురాలు బ్రేకప్ చెప్పిన తర్వాత మానసిక ఆవేదనతో ఆ ప్రియుడా ఆత్మహత్యకు పాల్పడితే ఆ ప్రియురాలు అతనిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పరిగణించలేమని ముంబై కోర్టు చెప్పింది అయితే ఇష్టానుసారం ప్రేమికులను మార్చడం నైతికంగా సరికాదని తెలిపింది ఆమె తిరస్కరణను ఎదుర్కొన్న బాధితునికి చట్టపరమైన ఉపశమనం ఏది లేదని వివరించింది కేసు వివరాలు ఏమిటంటే నితిన్ కేని మనీషా చూడా సామా ప్రేమించుకున్నారు కొన్నాళ్ల తర్వాత బ్రేకప్ చెప్పింది ఆ తర్వాత ఆమెకు రాజేష్ పనివారితో నిశ్చితార్థం జరిగింది దీనితో 2016 జనవరి 15న నితిన్ తన ఇంట్లో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నారు మనీషా బ్రేకప్ చెప్పడంతో నితిన్ మానసికంగా కృంగిపోయినట్లు కనిపిస్తున్నదని అదనపు సషన్స్ జడ్జి ఎంపీ మెహతా వ్యాఖ్యానించారు ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కేసు వెల్లడి కావాలంటే బాధి తుడిని అందుకు పురుగునట్లు లేదా సలహా ఇచ్చినట్లు స్పష్టం అవ్వాలని తెలిపారు

అపరిచిత మహిళను డార్లింగ్ అనడం లైంగిక వేధింపు

 ఒక అపరిచిత మహిళను డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపుల కిందికి వస్తుందని చట్టప్రకారం నిందితుడు శిక్షార్హుడేనని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది శిక్షణ సమర్థించింది లేకపోయినా అతడు శిక్షార్హుడేనని కలకత్తా హైకోర్టు సింగిల్ జడ్జి జే సేనుగుప్త పేర్కొన్నారు కేసు వివరాల్లోకి వెళితే కోల్కతాలో దుర్గా పూజ సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న ఒక మహిళా కానిస్టేబుల్ తాగి అల్లరి చేస్తున్న జానకిరామ్ అనే వ్యక్తిని అదుపు చేయడానికి ప్రయత్నించగా హాయ్ డార్లింగ్ నాకు శిక్ష వేయడానికి వచ్చావా అని అసభ్యంగా మాట్లాడాడు దీనిపై మాయ బండారు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కేసు విచారించిన నార్త్ మెడికల్ అండమాన్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నిందితునికి మూడు నెలల జైలు శిక్షతోపాటు జరిమానా విధించారు ఆ తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు అడిషనల్ సెషన్స్ కోర్టును ఆపై హైకోర్టును ఆశ్రయించాడు

తాంత్రికలు బాబాలపై నమ్మిక విచారకరం

 బొంబాయి హైకోర్టు తీవ్ర ఆందోళన

కాలం ఎంతో పురోగమిస్తోందని అనుకుంటూ ఉన్న ఇప్పటికే ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి తాంత్రికలు బాల తలుపు తడుతున్నారు ఇది దురదృష్టకరం విచారకరం అని బొంబాయి హైకోర్టు తెలిపింది గత నెలలో వెలువరించిన సంబంధిత తీర్పు ఇప్పుడు హైకోర్టు వెబ్సైట్ ద్వారా తెలుగులోకి వచ్చింది ప్రజలు వెర్రిగా తాంత్రికలను నమ్ముతున్నారు ఈ క్రమంలో వారు చెప్పుడు మాటలకు నమ్మి మోసపోతున్నారని పేర్కొంది మానసిక ఎదుగుదల లేని ఆరుగురు బాలికలపై తాంత్రికూడా అనే పేరిట చలామణిలో ఉన్న వ్యక్తి లైంగిక అత్యాచారాలకు దిగడం ఈ వ్యక్తికి పడిన జీవిత ఖైదు శిక్షను సమర్థిస్తూ హైకోర్టు సామాజిక కోణంలో కీలక వ్యాఖ్యలు వెలువరించింది అంద విశ్వాసాల అరాచకానికి బాలికలపై జరిగిన లైంగిక చర్య పరాకాష్ట అయిందని న్యాయమూర్తులు రేవతి మోహితుదేరే మంజూష దేశ్ పాండే తో కూడిన ధర్మాసనం తెలిపింది బాలికలను నయం చేస్తానని చెప్పి తాంత్రికడు వారి జీవితాలను పాడు చేశాడు

ఆర్టికల్ 21 తో ఆషామాషీలు వద్దు

 బొంబాయి హైకోర్టుకు సుప్రీం చురకలు

పౌరుల స్వేచ్ఛ అత్యంత కీలక శిరోధార్యం 21 వ అధికరణ రాజ్యాంగానికి ఆత్మ అత్యంత ప్రాధాన్యం దీనిని ఎవరూ కాధన రాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది సంబంధిత అంశాల వ్యాజ్యాలను హైకోర్టు సరిత గతిన విచారణకు తీసుకోకపోవడం తప్పని పేర్కొంది ఇది వ్యక్తులను వారికుండే ఈ అత్యంత విలువైన హక్కుకు దూరం చేయడం అవుతుందని న్యాయమూర్తులు బిఆర్ గవాయి సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ఇటీవల తమ తీర్పులో స్పందించింది మహారాష్ట్రలో కార్పొరేటర్ హత్యోదంతంలో ప్రధాన నిందితుడికి నిందితుడికి బెయిల్ మంజూరు విషయంలో బొంబాయి హైకోర్టు కేసులోని ఉచిత ఉచితలను పక్కకు పెట్టి బెయిల్ పై దాచారం చేసిందని ఎందుకు పలు సాకులు తెలిపిందని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఆర్టికల్ 21 మేరకు వ్యక్తుల స్వేచ్ఛ సంబంధిత వ్యవహారాలపై త్వరితగతి నిర్ణయాలను బొంబాయి హైకోర్టు తీసుకోలేకపోతుందని ధర్మాసనం తప్పు పట్టింది పౌరులకు ఉండే హక్కును ఏ విధంగా కాదంటారని నిలదీశారు

అత్యాశకు పోతే ఉన్నది పోయింది

 అమెరికాలో ఐదుగురు గుజరాతి సోదరుల వ్యాపార వివాదం హస్తగతం చేసుకొని మిగిలిన వారిని వెళ్లగొట్టిన హరీష్ జోగాని తప్పుబట్టిన కోర్టు సోదరులకు 20వేల కోట్లు చెల్లించాలని తీర్పు

ఐదుగురు అన్నదమ్ములు వేలకోట్ల వజ్రాల వ్యాపారం దానికి తోడు రియల్ ఎస్టేట్ కంపెనీ అందరూ కలిసికట్టుగా నిర్మించుకున్న వ్యాపార సామ్రాజ్యాన్ని ఒక్కడే సొంతం చేసుకోవాలని భావించాడు మిగిలిన వారు కోర్టుకెక్కరు 21 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు అన్నదమ్ములకు వాటాలు పంచి ఇచ్చింది సోదరులను మోసగించినందుకు 20వేల కోట్ల రూపాయల పరిహారం వారికి చెల్లించాలని ఆ ఒక్కడికి షాక్ ఇచ్చే తీర్పునిచ్చింది గుజరాత్కు చెందిన శశికాంత్ జుగాని 22 ఏళ్ళ వయసులో 1969లో అమెరికాలోని కాలిఫోర్నియాకు వచ్చి వజ్రాల వ్యాపారం ప్రారంభించాడు తర్వాత కాలంలో తన నలుగురు సోదరులు హరీష్ రాజేష్ చేతన్లను గుజరాత్ నుంచి తీసుకొచ్చి వ్యాపారంలో భాగస్వామ్యం ఇచ్చాడు వ్యాపారం అమెరికాతో పాటు యూరప్ ఆఫ్రికా మధ్యప్రత్యానికి విస్త రించింది అయితే తర్వాత సోదరుల మధ్య ఆస్తి వివాదాలు పెరిగాయి వ్యాపారం మొత్తాన్ని హరీష్ జోగాని హస్తగతం చేసుకున్నాడు శశికాంత్ తో పాటు మిగిలిన ముగ్గురిని కంపెనీ నుంచి తొలగించాడు దీనిపై 2003లో న్యాయపోరాటం మొదలైనది 21 ఏళ్లలో ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. అప్పెళ్ళ మీద అప్పిళ్లు దాఖలయ్యాయి మొత్తం మీద లాస్ ఏంజెల్స్ సుపీరియర్ కోర్టు దీనిపై తాజాగా తీర్పునిస్తూ అన్నదమ్ముల మధ్య వ్యాపార భాగస్వామ్యం యజమాని నిర్ధారిస్తూ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు గాను నలుగురు సోదరులకు హరీష్ జోగాని 20050 కోట్ల డాలర్లు దాదాపు 20వేల కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది రియల్ ఎస్టేట్ కంపెనీలో సగం వాటా శశికాంత్ దేనిని మిగిలిన సగంలో హరీష్ కు 24 శాతం రాజేష్కు పది శాతం స్టైలిష్కు 9.5% చేతన్కు 6.5% వాటా ఉంటుందని తీర్పు చెప్పింది


కాపురంలో చీర చిచ్చు

 నాకు నచ్చిన చీరలే నా భార్య కట్టుకోవాలని ఆ భర్త పంతం నాకు కూడా నచ్చాలి కదా నచ్చని చీరలు ఎలా కట్టుకుంటాను అనేది భార్య ప్రశ్న ఈ చీరల లొల్లి కోర్టుకెక్కింది విడాకుల దాకా వెళ్ళింది ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రాకు చెందిన దీపక్ అనే వ్యక్తికి హత్రాస్కు చెందిన యువతితో ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగింది. పెండ్లైన తర్వాత భార్య కోసం దీపక్ చాలా చీరలు కొని తెచ్చాడు అయితే ఈ చీరలు ఆమెకు నచ్చలేదు కానీ దీపక్ మాత్రం ఇవే చర్యలు కట్టుకోవాలని భార్యపై ఒత్తిడి తెచ్చాడు నాకు నచ్చని చీరలు నేనెందుకు కట్టుకుంటా అని భార్య మొండికేసింది దీనితో ఇద్దరు మధ్య గొడవలు మొదలయ్యాయి వీరు కుటుంబాల పెద్దలు కలగజేసుకొని నచ్చచెప్పిన లాభం లేకపోయింది పైగా పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు చేసుకునే వరకు వెళ్ళింది దీనితో భార్యాభర్తలిద్దరిని కౌన్సెలింగ్కు తీసుకెళ్లారు అయినా వీరి మధ్య గొడవలు సద్దుమనగలు దేనితో దంపతులిద్దరూ విడాకులు కోరుతూ ఆగ్రా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ త్వరలో విచారణకు రానున్నది

జిల్లా కోర్టులో ఉచిత న్యాయ సహాయం

 విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా కోర్టులో ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధి రమేష్ చందు అన్నారు మండలంలోని కుప్రియల్ గ్రామ శివారులో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే బాలికల పాఠశాలలో విద్యార్థులకు ఇన్స్పైర్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సంస్థ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు బాల్య వివాహాలు మానవక్రమ రవాణా సామాజిక మాధ్యమాలతో ఎదురవుతున్న సమస్యలు మాదకద్రవ్యాల వినియోగము విద్య హక్కు గృహహింస నిరోధక ఫోక్సో చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు విద్యార్థులకు సమస్యలు ఉంటే జిల్లా కోర్టులో ఉచిత న్యాయ సలహాలు అందిస్తామని తెలిపారు అత్యవసర సమయంలో టోల్ ఫ్రీ నెంబర్లు 19301098181 కు కాల్ చేయాలని అన్నారు సమావేశంలో ప్రిన్సిపాల్ రా గిణి ఐ ఎస్ ఆర్ డి సంస్థ ప్రతినిధి అమృత రాజేందర్ రావు అర్ల విట్టల్ రావు సంతోష్ అధ్యాపకులు పుష్పలత శ్రావణి మాధురి కవిత సింధుశ్రీ స్వప్న సుజాత తదితరులు పాల్గొన్నారు



29, ఫిబ్రవరి 2024, గురువారం

ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటే నో గవర్నమెంట్ జాబ్

 


రాజస్థాన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాబోదని వెల్లడి

రాజస్థాన్లో ఇద్దరు కంటే ఎక్కువ మంది సంతానం ఉన్న వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులంటూ సర్కారు విధించిన నిబంధనను సుప్రీంకోర్టు సమర్ధించింది ఈ నిబంధన వివక్షకు దారి తీయదని రాజ్యాంగాన్ని ఉల్లంఘించదని తెలిపింది రాజస్థాన్కు చెందిన రాంజీలాల్ జాట్ గతంలో సైన్యంలో పనిచేసి 2017 లో రిటైర్ అయ్యారు  కానిస్టేబుల్ ఉద్యోగానికి 2018 లో దరఖాస్తు చేసుకున్నారు అయితే రాంజీకి ఇద్దరు కంటే ఎక్కువ మంది సంతానం ఉండడంతో దరఖాస్తుల అధికారులు తిరస్కరించారు ఆయన హైకోర్టును ఆశ్రయించగా ఇది విధాన పరమైన నిర్ణయం అని జోక్యం చేసుకోమని హైకోర్టు ఆపిటిషన్ కొట్టేసింది దీంతో రాంజీలాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు నిబంధనలను సమర్థించింది ఈరోజు రాజ్యాంగాన్ని ఉల్లంఘించాడు కుటుంబ నియంత్రణను ప్రోత్సహించడమే దీని లక్ష్యం అని చెప్పింది రాజస్థాన్ పోలీస్ సబార్డినేట్ సర్వీసు రూల్స 1989 ప్రకారం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు ఆ తర్వాత ఈ నిబంధనను రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలు అన్నింటికీ అమలు చేస్తూ రాజస్థాన్ వేరియస్ సర్వీస్ రూల్స్ చట్టానికి 2001లో సవరణలు చేశారు

దోషినరం దొరకక మరణశిక్ష నిలిపివేత

 50 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదీకి ప్రాణాంతక సుదిమందు ఇచ్చి చంపడంలో వైద్య సిబ్బంది విఫలమయ్యారు శరీరంలో చెడు రక్త ప్రవాహం జరిగే సిరకు సంబంధించిన నరాన్ని కనిపెట్టలేకపోవడమే ఇన్దుకు కారణం? ఈ కారణంగా అతడి మరణశిక్షను అమెరికాలోని విడాకు రాష్ట్రం తాత్కాలికంగా నిలిపివేసింది క్రేజ్ 73 సంవత్సరాల ఐదుగురిని హత్య చేసిన కేసులో దోషి బుధవారం భారీ భద్రత మధ్య మూడు వైద్య బృందాలు 8 సార్లు ప్రాణాంతక ఇంజక్షన్ ఇవ్వడానికి అతని శరీరంలోని వివిధ భాగాలను పరిశీలించారు సూది మంది ఇవ్వడానికి సరైన నరం దొరకక ఇచ్చేశారు అయితే దోషిక మరణశిక్ష అమలు చేయడానికి వేరే పద్ధతులను ప్రయత్నిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు దీనిపై క్రియేట్ న్యాయవాది కోర్టును ఆశ్రయించారు దీనిపై స్పందించిన న్యాయస్థానం డెత్ వారం సమయం పూర్తయ్యలోపు మన శిక్ష అమలుకు మరో పద్ధతి అమలు చేయకూడదని స్టే ఇచ్చింది మరణాన్ని శిక్ష అమలుకు మరో వారంట్ తెచ్చుకోవాలని చెప్పింద

స్టే ఆర్డర్ ఆటోమేటిక్గా రద్దు కాదు

 సివిల్ లేదా క్రిమినల్ కేసులలో కింది కోర్టులు లేదా హైకోర్టులు మంజూరు చేసి స్టే ఉత్తర్వులు ఆరు నెలలు ముగిసిన వెంటనే వాటంతా అదే రద్దు కాబోవని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది రాజ్యాంగ న్యాయస్థానాలు సుప్రీంకోర్టు హైకోర్టులు సాధారణంగా కింది కోర్టులో కేసుల విచారణకు సమయాన్ని నిర్ణయించడానికి దూరంగా ఉండాలని తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ డివైచంద్ర చూడు నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది అసాధారణ కేసుల్లో మాత్రమే విచారణలను ముగించడానికి గడువును కింది కోర్టులకు ఉన్నత న్యాయస్థానాలు నిర్ణయించవచ్చునని తెలిపింది కేసుల విచారణకు ప్రాధాన్యం ఇచ్చే విషయాన్ని ఆ కేసులు ఏ కోర్టులో పెండింగ్లో ఉన్నాయో అదే కోర్టు విచక్షణకు వదిలిపెట్టడం ఉత్తమం అని వివరించింది 2018 లో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఒక కేసులో ఇచ్చిన తీర్పును తాజా తీర్పు కొట్టి వేసింది కింది కోర్టులు లేదా హైకోర్టులు మంజూరు చేసిన స్టేట్ ఉత్తర్వులు ప్రత్యేకంగా పొడిగించకపోతే వాటి అంతటావే రద్దు అవుతాయని త్రిసభ్య ధర్మసనం అప్పట్లో తీర్పు చెప్పింది స్టే ఆర్డర్ మంజూరైన తర్వాత ఆరు నెలలు ముగిసిన అనంతరం విచారణ లేదా ప్రొసీడింగ్స్ నిలిచిపోవాలని తెలిపింది అయితే సుప్రీంకోర్టు ఇచ్చే స్టే ఆర్డర్ కు ఇది వర్తించదని వివరించండి ఈ తీర్పుతో ఏకీభవించేది లేదని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది

11, ఆగస్టు 2022, గురువారం