పీడీ చట్టం కింద నిర్బంధాలకు గుడ్డిగా ఆమోదముద్ర వేయకూడదు సుప్రీంకోర్టు తీర్పు నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరినీ విడుదల చేయాలని ఆదేశం
దోపిడీలు దొంగతనాలకు పాల్పడుతున్నారన్న పేరుతో నల్గొండ జిల్లాకు చెందిన నేనాబాద్ బుజ్జి మునావత్ చందులను ప్రవేశన్ ఆఫ్ డేంజరస్ ఆక్టివిటీస్ ఆక్ట్ కింద రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మాడుగుల పోలీసులు నిర్బంధించడం సరికాదని సుప్రీంకోర్టు గురువారం తీర్పు చెప్పింది పీడీ యాక్ట్ కింద చేపట్టే నిర్బంధాలకు ఆమోదం తెలిపిన సలహా మండలి అడ్వైజరి బోర్డ్ పనితీరును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివైస్ న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్టీ వాళ్ళ జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది బుజ్జి చందుల నిర్బంధానికి అనుకూలంగా తెలంగాణ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం తోసిపిచ్చింది సలహా మండలి అన్నది పోలీసులు చేసే ముందస్తు నిర్బంధాలకు ఆమోదముద్ర వేసే రబ్బర్ స్టాంప్ కాదు ఇలాంటి నిర్బంధ ఉత్తర్వులు సమీక్ష కోసం సలహా మండలి ముందుకు వచ్చినప్పుడు క్రియాశీల పాత్ర పోషించి ఆ నిర్బంధమైనది చట్టస్పూర్తికి గాని కోర్టులు నిర్దేశించిన న్యాయ సూత్రాలకు గాని వ్యతిరేకంగా ఉందా లేదా అన్నది చూడాలి ఒకవేళ అలా ఉంటే నిర్బంధ ఉత్తర్వులు చెల్లవని స్పష్టంగా చెప్పాలి. ముందస్తు నిర్బంధం అన్నది క్రూరమైన చర్య అధికారాలను ఇష్టానుసారంగా ఉపయోగించుకొని నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసే విధానాన్ని మొక్కలోనే తుంచి వేయాలి కేవలం అధికారుల కోణంలో కాకుండా చట్ట పరంగా అలాంటి నిర్బంధమ అవసరమా అన్నది పరిశీలించాలి నిర్బంధ ఉత్తర్వులను కోర్టుల తరహాలో సూక్ష్మంగా పరిశీలించడానికి సలహా మండలి సభ్యులకు హైకోర్టు జడ్జిగా నియమూర్తులు కావడానికి ఉండే అర్హతలు ఉండాలని చెప్పారు అందువల్ల బోర్డు ముందు ఎప్పుడు ముందస్తు నిర్బంధ ఉత్తర్వులు ఉంచిన అందులోని ప్రతి కోణాన్ని పరీక్షించాలి డి టెన్షన్ ఉత్తర్వులు జారీ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల గురించి పట్టించుకోకుండా నిర్బంధానికి తగిన కారణం ఉందని చెబితే సరిపోదు నిర్బంధ ఉత్తరువు కోర్టు విచారణలో పిలుస్తుందా లేదా అన్నది చూడాలి నిందితులను నిర్బంధించే అధికారుల సంతృప్తిని మాత్రమే పరికాండలోకి తీసుకోవడానికి పరిమితమైతే సలహామండలిలో హైకోర్టు న్యాయమూర్తులు వారికి సమాన అర్హతలు ఉన్న సభ్యులు ఉండి ఏం ప్రయోజనం అర్థం కావడం లేదు. సలహా మండలి ఏర్పాటు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏ వ్యక్తిని యాంత్రికంగా చట్ట వ్యతిరేకంగా నిర్బంధించకూడదు అన్నది రాజ్యాంగబద్ధమైన రక్షణ సంస్థ అయిన బోర్డు క్రియాశీల పాత్ర పోషించాలి నిర్బంధించే అధికారులు ప్రభుత్వం నిర్బంధితుల హక్కుల మధ్య అది రక్షణ కవాటంలా పని చేయాలి. నిర్బంధ ఉత్తరువులను యాంత్రికంగా ఆమోదించడం కాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 4లో పేర్కొన్న విషయాలను మనసులో పెట్టుకొని పని చేయాలి. అందువల్ల ప్రివెంటివ్ డి టెన్షన్ చట్టం కింద ఏర్పాటైన సలహా బోర్డులు తమ పరిశీలన కోసం వచ్చిన డి టెన్షన్ ఉత్తర్వులపై నిర్దిష్టమైన అభిప్రాయం చెప్పే ముందు వాటిని అన్ని కోణాలలో లోతుగా సమీక్షించాలి అని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేస్తూ ఇద్దరు అప్పీల్దారులను విడుదల చేయాలని ఆదేశించింది
No comments:
Post a Comment