Friday, 29 March 2024

షుగర్ ముప్పును పక్కాగా గుర్తించవచ్చు

 వన్ అవర్ ప్లాస్మా గ్లూకోజ్ పరీక్షతో నిర్ధారణ అంతర్జాతీయ డయాబెటిస్ ఫెడరేషన్ సిఫారసు

మారిన జీవనశైలి ఆహార పలవాట్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా మధుమేహ బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది ఒక అధ్యయనం ప్రకారం మన దేశ జనాభాలో 11.4% అంటే 10.1 కోట్ల మంది మధుమేహ బాధితులు ఉన్నారు దేశ జనాభాలో 15.3% అంటే 13.6 కోట్ల మంది ఫ్రీ డయాబెటిక్ దశలో ఉన్నారు. ఫ్రీ డయాబెటిక్ దశలో ఉన్నవారికి మధుమేహం ముప్పు ఎక్కువగా ఉంటుంది వెంటనే అప్రమత్తమై జీవనశైలి ఆహారంలో మార్పులు చేసుకోకపోతే మధుమేహం బారిన పడతారని లెక్క అయితే ఫ్రీ డయాబెటిక్ స్టేజిలో ఉన్న వారిని కచ్చితంగా గుర్తించడం ముఖ్యం ఇన్దుకుగా ను వన్ అవర్ ప్లాస్మా గ్లూకోజ్ పరీక్ష 1 hpg ను ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ సిఫారసు చేసింది ఈ పరీక్ష ద్వారా అత్యంత ఖచ్చితత్వంతో ఎవరికి మధుమేహం ముప్పు ఉందో గుర్తించవచ్చు అని చెబుతోంది ఐ డి ఎఫ్ అనేది ప్రపంచవ్యాప్తంగా 240 కి పైగా మధుమేహ సంఘాలతో కూడిన సంస్థ ఇది మధుమేహానికి సంబంధించి వివిధ మార్గదర్శకాలను జారీ చేస్తుంటుంది సాధారణంగా ఫ్రీ డయాబెటిక్ దశను 75 గ్రాముల నోటి గ్లూకోజు టాలరెన్స్ లో రెండు గంటల ప్లాస్మా గ్లూకోజ్ పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు కానీ ఖచ్చితమైన ఫలితం కోసం మధుమేహం ముప్పు ఉన్నవారు రాత్రిపూట ఉపవాసం ఉన్న తర్వాత 75 గ్రాముల వన్ అవర్ ప్లాస్మా గ్లూకోజ్ పరీక్ష చేయించుకోవాలని ఐడిఎఫ్ చెబుతోంది వన్ అవర్ ప్లాస్మా గ్లూకోజ్ విలువ 155 mg/dl కంటే ఎక్కువ ఉంటే ప్రీ డయాబెటిస్ దశలో ఉన్నట్లు పరిగణిస్తారు.209mg/dl లేదా అంత కంటే ఎక్కువ ఉంటే టైప్ 2 మధుమేహం ఉన్నట్లు లెక్క..

No comments:

Post a Comment