అధిక బరువును తగ్గించుకోవడం కోసం తెలిసిన దారులన్నీ అనుసరిస్తూ ఉంటాము కానీ కొన్ని తేలికపాటి చిట్కాలతో బరువును తగ్గించుకోవచ్చని ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషన్ లిస్ట్ రజిత దివేకర్ అంటుంది ఆ చిట్కా ఏమిటంటే
ఆహారం లోకల్ సీజనల్ ట్రెడిషనల్ తినే ఆహారం పరంగా ఈ మూడు నియమాలు పాటించాలి తాజా ఫుడ్ ట్రెండును గుడ్డిగా అనుసరించకుండా స్థానికంగా పండిన ఉత్పత్తులు కాలానుగుణమైన సంప్రదాయ పదార్థాలని తినాలి
ప్రాసెస్డ్ ఫుడ్ ప్యాకేజ్ ఫుడ్ ను పూర్తిగా మానేయాలి ఒకవేళ తినాలనిపిస్తే వీలైనంత పరిమితంగా తీసుకోవాలి
మైండ్ ఫుల్ గా భోజనం చేసే సమయంలో మనసు ఆలోచనలు భోజనం మీదే కేంద్రీకరించాలి టీవీ మొబైల్ ఫోన్ చూస్తూ తినకూడదు ఇంద్రియాలు అన్నింటిని నియంత్రణలో ఉంచుకొని రోజు భోజనానికి ఒకే చోట కూర్చుంటూ ఆహారంలోని రుచులను కమ్మదనాన్ని ఆస్వాదించాల
వ్యాయామం వారంలో వ్యాయామం 150 నిమిషాలకు తగ్గకూడదు ఎముకలు, కండరాలు ఆరోగ్యంగా ఉండడం కోసం వ్యాయామం చేయడం అవసరం కాబట్టి రోజుకు కనీస 30 నిమిషాల పాటు అయినా వ్యాయామం చేయాలి. అలాగే ఎక్కువ గంటలు కూర్చుని పనిచేసే వాళ్లు ప్రతి 30 నిమిషాలకు లేచి కనీస మూడు నిమిషాల పాటు అయినా లేచి నిలబడుతూ ఉండాలి
No comments:
Post a Comment