Monday, 25 March 2024

పోక్సో ఈ బాక్స్ తో బాధితులకు భరోసా

 మైనర్లు మహిళలపై దాడులు వేధింపుల ఘటనలు ప్రతిరోజు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి పలు కారణాలతో చాలా ఘటనలు బయటకు రాకుండా రాజులతో ముగిసిపోతున్నాయి వీటిపై ఫిర్యాదు చేసేందుకు ప్రజలు భయపడుతున్నారు ఇలాంటి వాటికి చెక్ పెడుతూ ఫిర్యాదుదారుల వివరాలు పోలీసులకు సైతం తెలియకుండా రహస్యంగా ఉంచి బాధ్యతలు బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల సరికొత్త యాప్ అందుబాటులోకి తెచ్చింది ఆన్లైన్ వేదికగా ఫోక్సో ఈ బాక్స్ పేరిట యాప్ ను రూపొందించింది కళ్ళ ముందు వేధింపులు అఘాయిత్యాలు జరిగితే ధైర్యంగా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు



కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ యాప్ లో వచ్చే ఫిర్యాదులను ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తుంది. యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి రాష్ట్ర జిల్లా కార్యాలయానికి ఒకేసారి సమాచారం ఇస్తారు బాలల సంరక్షణ అధికారి సిబ్బంది విచారణ చేపడతారు 100% పారదర్శకతతో కేసు నమోదు అవుతుంది ఫిర్యాదుదారులకు రక్షణ ఉండేలా నేరానికి పాల్పడిన వారికి శిక్షపడేలా యంత్రాంగం తోడ్పాటునందిస్తుంది. యాప్ పై అధికారులు గ్రామీణ స్థాయి నుంచి అవగాహన కల్పిస్తే చాలా వరకు వేధింపుల కేసులకు అడ్డుకట్ట వేయవచ్చు అని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది

కాలికలు మహిళల సంరక్షణను సామాజిక బాధ్యతగా భావించే ప్రతి ఒక్కరు స్మార్ట్ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఫోక్సో ఈ బాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలు తెలిస్తే ఈ యాప్ ఓపెన్ చేసి ఈ బాక్స్ పై క్లిక్ చేయాలి చిన్నారులకు ఎదురయ్యే ఆరు రకాల హింసలకు సంబంధించిన చిత్రాలు ఇందులో కనిపిస్తాయి ఘటనకు సంబంధించిన హింస స్వభావాన్ని గమనించి చిత్రంపై క్లిక్ చేయాలి అనంతరం ఫిర్యాదు పత్రంలో బాధితులకు జరిగిన ఘటన వివరాలు పొందుపరిచి సమర్పించాలి

No comments:

Post a Comment