ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
31, ఆగస్టు 2026, సోమవారం
ఉచిత యూత్ ఎంపవర్ మెంట్ ఫెస్ట్ @పసాలా ఫౌండేషన్
25, ఆగస్టు 2026, మంగళవారం
ఫ్రీ ఫిజికల్ ట్రైనింగ్ .. కానిస్టేబుల్ అభ్యర్థులకు
ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు పోటీపడే ఆశావహ యువతి యువకులకు "ఉచిత శరీర దారుఢ్య/ ఫిజికల్ శిక్షణ " కార్యక్రమం సోమవారం ప్రారంభించారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాధిపతి డాక్టర్ అనిత ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థుల కోసం ఈ శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కళాశాల ప్రిన్సిపాల్ టి ప్రతాప్ సింగ్ గారు మాట్లాడుతూ పోలీసు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగ వేటలో విజయం సాధించాలని ఆకాంక్షించారు .ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.
22, ఆగస్టు 2026, శనివారం
వెల్డర్ కోర్సులో.. ఉచిత శిక్షణ
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పురంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ లో " మేధ చారిటబుల్ ట్రస్ట్ " ఆధ్వర్యంలో మూడు నెలల కాల వ్యవధి గల "వెల్డర్ కోర్సులో ఉచిత శిక్షణ" ఇస్తున్నట్లు సంస్థ ఛైర్మన్ ఎన్ కిశోర్ రెడ్డి తెలిపారు.
ఎస్సెస్సీ విద్యార్హతతో పాటు 18-25 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారు ఈ నెల 27 లోపు సంస్థ లో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో " ఉచిత హాస్టల్, ఉచిత భోజన సదుపాయం కూడా కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం తప్పని సరిగా ఉద్యోగం కూడా కల్పిస్తామని తెలిపారు
పూర్తి సమగ్ర వివరాలకు 9133908000,9948466111 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
21, ఆగస్టు 2026, శుక్రవారం
ఫ్రీ నీట్ కోచింగ్.. గిరిజన విద్యార్థులకు
తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన గురుకులాలు ప్రభుత్వ జూనియర్ కళాశాల ల నుండి 2026 లో ఇంటర్ బై పీసీ ఉత్తీర్ణులై , నీట్ పరీక్ష లో 200 కు పైగా మార్కులు పొందిన గిరిజన విద్యార్థులకు నీట్ లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు గిరిజన గురుకుల సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది.
అర్హులైన గిరిజన అభ్యర్థులు గిరిజన గురుకుల సొసైటీ ని సంప్రదించి దరఖాస్తులు సమర్పించాలని సొసైటీ అధికారులు తెలిపారు.
ఫ్రీ కోచింగ్ @కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్, మంచిర్యాల
ఎస్సై, కానిస్టేబుల్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న మంచిర్యాల జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు అన్నారు.
ఈ ఉచిత శిక్షణ 2 నెలల పాటు కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఆసక్తి గల వారు క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి లింక్ ఓపెన్ చేసి పేరు నమోదు చేసుకోవడం ద్వారా కోచింగ్ లో చేరవచ్చని తెలిపారు. నిపుణులైన 20 మంది ఫ్యాకల్టీ తో రెండు నెలల పాటు కోచింగ్ కొనసాగుతుందని ఆయన తెలిపారు.
ఈ శిక్షణ ను పోటీ పరీక్షలలో ఎంతో అనుభవం కలిగిన విన్నర్స్ ఐకాన్ స్టడీ సర్కిల్ , కెరియర్ మిత్ర నాగరాజ్ , అనుభవజ్ఞులైన హైదరాబాద్ ఫ్యాకల్టీ బృందంతో ఇప్పిస్తున్నామని తెలిపారు. శిక్షణ లో భాగంగా అర్థమెటిక్, రీజనింగ్ ,సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటి, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ ,ఇంగ్లీష్ ,ఎకానమీ, కరెంట్ అఫైర్స్ తెలంగాణ సంబంధ అంశాలు తదితర పోటీ పరీక్షలకు అవసరమైన ముఖ్యమైన అంశాల పై శిక్షణ ఇస్తారని తెలిపారు.
60 రోజుల శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఉచిత భోజనం, ఉచిత స్టడీ మెటీరియల్ అందజేస్తామని తెలిపారు. ప్రిలిమ్స్ అర్హత సాధించిన వారికి" ఫిజికల్ టెస్ట్ లో కూడా ఉచిత శిక్షణ ఇవ్వడం" జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని మంచిర్యాల జిల్లా నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఫ్రీ నీట్ కోచింగ్ @ఎస్సీ గురుకుల సొసైటీ
తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నీట్ 2027 లాంగ్ టర్మ్ ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ గురుకుల సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది. 2026-27 విద్యా సంవత్సరంలో హైదరాబాద్ చిలుకూరు సీ ఓ ఈ లో బాలురకు, మహేంద్ర హిల్స్ సిఓఈ లో బాలికలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ తెలిపింది. బాల బాలికలకు 200 సీట్లు ఉన్నాయని ఇందులో బాలురు బాలికలకు చెరో వంద సీట్లు కేటాయించామని తెలిపారు.
2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్ బై పీసీ పాస్ అయి నీట్ 2026 పరీక్షకు హాజరైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ,బీసీ, ఈడబ్ల్యూఎస్ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారాన్ని గురుకుల సొసైటీ అధికారిక వెబ్సైట్ నుంచి పొందాలని పూర్తి వివరాలతో అవసరమైన ధృవ పత్రాలను జత చేసి సంబంధిత జిల్లా కోఆర్డినేటర్ కు సమర్పించాలని తెలిపింది. దరఖాస్తు సమర్పణకు ఈనెల 22 చివరి తేదీ అని స్పష్టం చేసింది. దరఖాస్తు కు ఎలాంటి ఫీజు అవసరం లేదని స్పష్టం చేశారు.
https://tgswrcis.telangana.gov.in
కామారెడ్డి జిల్లా కో ఆర్డినేటర్.. ఉప్పల్వాయి..97045 50256.
20, ఆగస్టు 2026, గురువారం
ఉచిత శిక్షణ @అఖిల్ రాజ్ ఫౌండేషన్
పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతి యువకులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు అఖిల్ రాజ్ ఫౌండేషన్ ప్రతినిధి మిద్దె శాంత కుమార్ తెలిపారు.
ఈ మేరకు శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను భిక్కనూరు ఎస్సై అనిల్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిరుద్యోగులను వారు కోరారు.
పూర్తి సమగ్ర వివరాలకు 98490 51483 మొబైల్ నెంబర్ లో సంప్రదించాలని సూచించారు.
ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ @ ట్యూబ్ ఇంగ్లీష్
ట్యూబ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ లో ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నట్లు ప్రముఖ ఇంగ్లీష్ ట్రైనర్ శ్రీమతి భూక్యా గౌతమి గారు తెలిపారు. వీటిని 100% ఉచితంగా నిర్వహిస్తున్నట్లు ఆమె వివరించారు. ఒక తెలుగు మీడియం అభ్యర్థి ఇంగ్లీష్ మాట్లాడటంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కుంటారు అనేది తనకు అనుభవ పూర్వకంగా తెలుసు అని ఆ ఇబ్బందిని అధిగమించి ఇంగ్లీష్ లో ఎలా అనర్గళంగా మాట్లాడాలి అనేది ఈ వీడియో లలో సవివరంగా ఉంటుందని ఆమె వివరించారు.
ఈ ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ లో మొత్తం 5 వీడియోలు ఉంటాయని అవి 50 వీడియోలతో సమానమని , ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే ఔత్సాహికులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పూర్తి సమగ్ర వివరాలకు శ్రీమతి భూక్యా గౌతమి, స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్,79977 40367 నంబర్ లో సంప్రదించాలని సూచించారు.
ఉచిత శిక్షణ @ఆదిలాబాద్ పోలీస్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎస్సై కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతి యువకులకు ఉచితంగా శిక్షణ అందించనున్నామని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
ఆగస్టు 23న అర్హత పరీక్ష ఉంటుందని ఉచిత శిక్షణ లో పాల్గొన దలచిన వారు క్యూ ఆర్ కోడ్, ఆన్ లైన్ దరఖాస్తు లేదా సమీప పోలీస్ స్టేషన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఆగస్టు 23న ఆదిలాబాద్ DTC లో అర్హత పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.
పరీక్ష లో ప్రతిభ చూపించిన వారికి ఆగస్టు 24 నుంచి డిటిసి లో నిపుణులైన అధ్యాపకులచే ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
స్టడీ మెటీరియల్, శిక్షణ..
కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష కు అవసరమైన అన్ని అంశాలలో శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్, నిపుణుల మార్గదర్శకత్వం అందిస్తామని తెలిపారు. ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులై మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన వారికి ఉచిత వసతి,ఉచిత భోజన సదుపాయం తో శిక్షణ అందిస్తామని తెలిపారు.
పోలీస్ ఉద్యోగాలే లక్ష్యంగా ఉన్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు
ఉచిత శిక్షణ @కాకా ఫౌండేషన్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎస్సై కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతి యువకులకు కాకా వెంకట స్వామి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వాలని నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం పరిధిలో మందమర్రి, చెన్నూరు పట్టణాల్లో ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
చెన్నూరు మున్సిపాలిటీ లోని మహిళా భవన్, మందమర్రి లోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న భవనం/ షెడ్డు లో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కేంద్రాలను రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ బుధవారం ప్రారంభించారు. సుమారు 3 నెలల పాటు ఈ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు వారు తెలిపారు.
ఫ్రీ కరెంట్.. కరీంనగర్ గణేశ్ మండపాలకు
కరీంనగర్ లో వినాయక చవితి ఉత్సవాలకు ఏర్పాటు చేయబోయే గణేష్ మండపాలకు వినియోగిస్తున్న కరెంట్ కు బిల్లులు తాము చెల్లించి మండపాలకు" ఉచితంగా కరెంట్ " అందించాలని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడించారు.
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ప్రతి ఏడాది దాదాపు రెండు వేల గణేశ్ మండపాలను ఏర్పాటు చేస్తుండగా గత మూడేళ్లుగా ఈ మండపాలకు వినియోగిస్తున్న కరెంట్ ఛార్జీలను మొత్తం బండి సంజయ్ కుమార్ తన సొంత డబ్బులతో చెల్లిస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం కార్పొరేషన్ మేయర్ పదవి బీజేపీ ఆధీనంలో ఉండటంతో బిల్లులను కార్పొరేషన్ చెల్లిస్తుందని ప్రకటించారు.
ఉచిత శిక్షణ @ నిజామాబాద్ పోలీస్
తెలంగాణ పోలీస్ శాఖ లోని ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతి యువకులకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సీపీ సాయి చైతన్య గారు తెలిపారు.
నిజామాబాద్ , ఆర్మూర్, బోధన్ డివిజన్ ల పరిధిలోని అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులు సంబంధిత పోలీస్ స్టేషన్లలో అందించే గూగుల్ ఫాం లింక్ లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దరఖాస్తు చేసుకోవాలి అని సూచించారు.
ఈ నెల 23 తేదీన ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. పరీక్ష 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానం లో ఉంటుంది.
నిజామాబాద్ డివిజన్ అభ్యర్థులకు మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో, బోధన్ డివిజన్ అభ్యర్థులకు జూనియర్ ఇంటర్ డిగ్రీ కాలేజ్ లో, ఆర్మూర్ డివిజన్ అభ్యర్థులకు క్షత్రియ ఇంజినీరింగ్ కాలేజీలో పరీక్ష నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్ష లో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 1 తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు" ఉచిత శిక్షణ తరగతులు" నిర్వహిస్తారు.
ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు శిక్షణ కొనసాగుతుంది. రెండు నెలల శిక్షణ కాలంలో 10 గ్రాండ్ టెస్టులు నిర్వహించడంతో పాటు అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందజేస్తామని తెలిపారు.
ఈ శిక్షణ పూర్తిగా ఉచితమని, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు సీపీ సాయి చైతన్య గారు స్పష్టం చేశారు.
దరఖాస్తు తదితర పూర్తి సమగ్ర వివరాలకు క్రాంతి 99519 43656, 87125 33273 నంబర్ లలో సంప్రదించాలని సూచించారు. .
బేసిక్ కంప్యూటర్ డేటా ఎంట్రీ కోర్స్ లో ఉచిత శిక్షణ
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని జలాల్ పురంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా " 2 నెలల కాల వ్యవధి గల బేసిక్ కంప్యూటర్ డేటా ఎంట్రీ కోర్స్ లో ఉచిత శిక్షణ" ఇవ్వనున్నట్లు సంస్థ చైర్మన్ ఎన్ కిశోర్ రెడ్డి తెలిపారు.
ఇంటర్ విద్యార్హత తో పాటు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు గల అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు ఆధార్ కార్డు కుల ధృవీకరణ పత్రం రెండు ఫోటోలను జత చేసి ఆగస్టు 24 తేదీ లోపు సంస్థ లో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఎంపికైన వారికి ఉచిత భోజనం తో కూడిన హాస్టల్ వసతి కల్పిస్తామని తెలిపారు. అంతే కాకుండా శిక్షణ పూర్తయిన తర్వాత ఉద్యోగం కూడా కల్పిస్తామన్నారు.
పూర్తి సమగ్ర వివరాలకు 91339 08000,91339 08111 నంబర్ లలో సంప్రదించాలని సూచించారు.
15, జనవరి 2024, సోమవారం
5, ఏప్రిల్ 2023, బుధవారం
13, మే 2022, శుక్రవారం
6, మార్చి 2022, ఆదివారం
మహిళలకు ఉచితంగా కంటి పరీక్షలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ కంటి దవాఖనాల నెట్వర్క్ Dr అగర్వాల్ ఐ
హాస్పిటల్ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఈ నెల 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ అ దవాఖానాల్లో మహిళలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. రిజిస్ట్రేషన్ల కొరకు 9619334129 నంబర్ పై సంప్రదించాలని సూచించారు.
9, ఫిబ్రవరి 2022, బుధవారం
6, ఫిబ్రవరి 2022, ఆదివారం
ఫ్రీ కంప్యూటర్ శిక్షణ, ఏకల్ గ్రామోత్తన్ ఫౌండేషన్
ఏకల్ గ్రామోత్తన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సంస్థ సభ్యులు సూచించారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ముత్యాలమ్మ ఆలయంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ కు సంబంధించిన సంచార వాహనాన్ని వారు ప్రారంభించారు.వాహనంలో 3 కంప్యూటర్లు ఉంటాయని ,ఒక్కో కంప్యూటరు ను ఇద్దరు చొప్పున శిక్షణ తీసుకోవచ్చని వారు తెలిపారు.
రెండు గంటల పాటు శిక్షణ ఇస్తారని, రోజూ మూడు గ్రూపులకు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
ఒకే కాలనీలో 18 మంది విద్యార్థులు ఉంటే వారు ఉండే స్థలానికి వెళ్లి అక్కడే శిక్షణ ఇస్తామని వారు తెలిపారు.కార్యక్రమంలో ఫౌండేషన్ జిల్లా కార్యదర్శి ఈశ్వర్ గౌడ్,ఉపాధ్యక్షుడు నవీన్, ఎల్లారెడ్డి అధ్యక్షుడు కిరణ్ , తులసిమంచిర్యాల విద్యా సాగర్ , పండరి, నటరాజ్,జిల్లా కార్యాలయ ప్రముఖ్ బాలమణి, అంచల్ ప్రశిక్షణ ప్రముఖ్ అంజప్ప తదితరులు పాల్గొన్నారు.


