21, ఆగస్టు 2026, శుక్రవారం

ఫ్రీ కోచింగ్ @కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్, మంచిర్యాల

 ఎస్సై, కానిస్టేబుల్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న మంచిర్యాల జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు అన్నారు. 

ఈ ఉచిత శిక్షణ 2 నెలల పాటు కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఆసక్తి గల వారు క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి లింక్ ఓపెన్ చేసి పేరు నమోదు చేసుకోవడం ద్వారా కోచింగ్ లో చేరవచ్చని తెలిపారు. నిపుణులైన 20 మంది ఫ్యాకల్టీ తో రెండు నెలల పాటు కోచింగ్ కొనసాగుతుందని ఆయన తెలిపారు. 

ఈ శిక్షణ ను పోటీ పరీక్షలలో ఎంతో అనుభవం కలిగిన విన్నర్స్ ఐకాన్ స్టడీ సర్కిల్ , కెరియర్ మిత్ర నాగరాజ్ , అనుభవజ్ఞులైన హైదరాబాద్ ఫ్యాకల్టీ బృందంతో  ఇప్పిస్తున్నామని తెలిపారు. శిక్షణ లో భాగంగా అర్థమెటిక్, రీజనింగ్ ,సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటి, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ ,ఇంగ్లీష్ ,ఎకానమీ, కరెంట్ అఫైర్స్ తెలంగాణ సంబంధ అంశాలు తదితర పోటీ పరీక్షలకు అవసరమైన ముఖ్యమైన అంశాల పై శిక్షణ ఇస్తారని తెలిపారు. 

60 రోజుల శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఉచిత భోజనం, ఉచిత స్టడీ మెటీరియల్ అందజేస్తామని తెలిపారు. ప్రిలిమ్స్ అర్హత సాధించిన వారికి" ఫిజికల్ టెస్ట్ లో కూడా ఉచిత శిక్షణ ఇవ్వడం" జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని మంచిర్యాల జిల్లా నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి