16, మే 2026, శనివారం

విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

 కామారెడ్డి జిల్లా యాదవ ఎంప్లాయిస్ సొసైటీ ఆధ్వర్యంలో 2025 26 విద్యాసంవత్సరానికి పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలలో 80 శాతానికి పైగా మార్కులు సాధించిన యాదవ గొల్ల కురుమ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు జిల్లా అధ్యక్షుడు సాయన్న తెలిపారు శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఈనెల 29న జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో అవార్డులను ప్రధానం చేయనున్నట్లు తెలిపారు అర్హులైన విద్యార్థులు తమ వివరాలను ఈ నెల 28 లోగా సాయన్న యాదవ్ 9505200165 మరియు జె శ్రీనివాస్ యాదవ్ 9441046994 లను సంప్రదించి నమోదు చేసుకోవాలని కోరారు ప్రతినిధులు కుంభాల రవి యాదవ్ శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.



15, మే 2026, శుక్రవారం

కామారెడ్డి బస్టాండ్ లో విచారణకు కొత్త నెంబర్

 కామారెడ్డి బస్టాండ్ లో బస్సుల వివరాలు విచారణకు కొత్త నెంబర్ను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ పి దినేష్ కుమార్ గురువారం ఒక ప్రకటనలు తెలిపారు .7382844 080 ఈ నెంబర్కు ఫోన్ చేసి కామారెడ్డి పట్టణ పరిసర ప్రాంతాల ప్రయాణికులు బస్సుల వివరాలను తెలుసుకోవాలని కోరారు.

4, మే 2026, సోమవారం

ఆప్టికల్ హబ్, కామారెడ్డి

 ఆప్టికల్ హబ్,

ద హోల్ సేల్ స్టోర్,

హనీ బేకరి పక్కన,

నిజాంసాగర్ రోడ్,

కామారెడ్డి,

తెలంగాణ.


లైఫ్ టైం ఫ్రీ సర్వీస్,10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆప్టోమెట్రిస్ట్, ఫ్రీ హోం డెలివరీ,30 మినిట్స్ డెలివరీ,ప్రొడక్ట్ అందుబాటులో ..

రే బాన్, వోగ్, ఫాస్ట్ ట్రాక్,IDEE,CRIZAL,1000 మోడల్స్,ఫ్రేమ్స్..

కాంటాక్ట్..9391977499




1, మే 2026, శుక్రవారం

రాజంపేట హిందూ సమ్మేళన సమితి కార్యవర్గం

 రాజంపేట హిందూ సమ్మేళనా సమితి నూతన కార్యవర్గం 2026 

అధ్యక్షులు ఇట్టం చిన్న సిద్ధరాములు,

గౌరవ అధ్యక్షులు ..

బల్ల ఆంజనేయులు, అనిల్, ఇట్టం పెద్ద సిద్ధ రాములు ,

ప్రధాన కార్యదర్శి.. గుర్రాల రమేష్,

 ఉపాధ్యక్షులు.. 

పిట్ల శ్రీను, సుమన్ చారి, కొత్తిమీర కార్ వంశీ ,వినయ్, కొప్పుల నరేష్, గుర్రాల ప్రణయ్,

 కోశాధికారి.. దగ్గరి నరేష్,

కార్యదర్శులు.. 

గొల్ల రమేష్, గంగిరెడ్డి ప్రభాకర్, అన్వేష్, కుమ్మరి శేఖర్ ,జింక భాస్కర్, జోగిపేట రాంరెడ్డి,

 కార్యవర్గ సభ్యులు ..

గడ్డమీద స్వామి, గట్టు నవీన్, పొగాకు సాయి కృష్ణ, కొప్పుల వినయ్.

రెజిన్ ఆర్ట్ తో జ్ఞాపకాలు పదిలం..

 మధుర స్మృతులను పదిలపరుచుకునేందుకు ఫోటోలు, పెయింటింగ్ లను ఆశ్రయిస్తున్న అవి కొన్నాళ్లకే పాడైపోతున్నాయి. దీనికి పరిష్కారంగా రెజీనార్ట్ ట్రేండింగ్ లోకి వచ్చింది. జిగురు లాంటి ఎపోక్సీ రెజిన్ ,హార్డినర్ కలిపి ఈ ఆర్ట్ ను రూపొందిస్తారు. కాకినాడకు చెందిన దివ్య మౌనిక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే ఈ కళలో రాణిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు పెళ్లి ఫోటోలు రెజిన్ తో  తయారు చేసి ఆయనకు బహుమతిగానూ ఇచ్చారు. ఆన్లైన్లో ఈ కళను నేర్చుకున్నాను, నెలకు 50 వేల రూపాయల వరకు ఆదాయం పొందుతున్నాను అని మౌనిక వివరించారు.



మహిళా సంఘాల కు సేవింగ్స్ అకౌంట్

 దేశవ్యాప్తంగా ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాల కోసం కేంద్ర తపాలా శాఖ ఆధ్వర్యంలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆర్థిక సాధికారత కల్పించడానికి ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ఎండి సీఈఓ విశ్వేశ్వరన్ ప్రకటించారు. ఈ ఖాతాలలో కనీస ప్రాథమిక డిపాజిట్ అవసరం లేదు. నెలవారి సగటు బ్యాలెన్స్ కూడా నిర్వహించాల్సిన అవసరం ఉండదు. గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు బ్యాలెన్స్ ఉంచుకోవచ్చు. ఆ మొత్తానికి అమల్లో ఉన్న సేవింగ్స్ రేట్స్ ప్రకారం మూడు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తారు. నగదు డిపాజిట్, ఉపసంహరణకు ఎలాంటి చార్జీలు ఉండవు.

నిజామాబాద్ TNGO అసోసియేషన్ 2026

 నిజామాబాద్ జిల్లా TNGO S అసోసియేషన్ నూతన కార్యవర్గం 2026.

అధ్యక్షులు.. సుమన్ కుమార్,

ప్రధాన కార్యదర్శి.. నేతి కుంట శేఖర్,

కోశాధికారి.. నిరంజన్ గౌడ్,