ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
31, ఆగస్టు 2026, సోమవారం
ఉచిత యూత్ ఎంపవర్ మెంట్ ఫెస్ట్ @పసాలా ఫౌండేషన్
29, ఆగస్టు 2026, శనివారం
కిడ్స్ వరల్డ్, కామారెడ్డి.
కిడ్స్ వరల్డ్,
యూనియన్ బ్యాంక్ పక్కన,
పాత ఎస్బిఐ బ్యాంక్ ఎదురుగా,
సిరిసిల్ల రోడ్,
కామారెడ్డి-503111
తెలంగాణ రాష్ట్రం..
96668 07356,95151 93141
25, ఆగస్టు 2026, మంగళవారం
ఫ్రీ ఫిజికల్ ట్రైనింగ్ .. కానిస్టేబుల్ అభ్యర్థులకు
ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు పోటీపడే ఆశావహ యువతి యువకులకు "ఉచిత శరీర దారుఢ్య/ ఫిజికల్ శిక్షణ " కార్యక్రమం సోమవారం ప్రారంభించారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాధిపతి డాక్టర్ అనిత ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థుల కోసం ఈ శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కళాశాల ప్రిన్సిపాల్ టి ప్రతాప్ సింగ్ గారు మాట్లాడుతూ పోలీసు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగ వేటలో విజయం సాధించాలని ఆకాంక్షించారు .ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.
22, ఆగస్టు 2026, శనివారం
వెల్డర్ కోర్సులో.. ఉచిత శిక్షణ
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పురంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ లో " మేధ చారిటబుల్ ట్రస్ట్ " ఆధ్వర్యంలో మూడు నెలల కాల వ్యవధి గల "వెల్డర్ కోర్సులో ఉచిత శిక్షణ" ఇస్తున్నట్లు సంస్థ ఛైర్మన్ ఎన్ కిశోర్ రెడ్డి తెలిపారు.
ఎస్సెస్సీ విద్యార్హతతో పాటు 18-25 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారు ఈ నెల 27 లోపు సంస్థ లో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో " ఉచిత హాస్టల్, ఉచిత భోజన సదుపాయం కూడా కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం తప్పని సరిగా ఉద్యోగం కూడా కల్పిస్తామని తెలిపారు
పూర్తి సమగ్ర వివరాలకు 9133908000,9948466111 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
21, ఆగస్టు 2026, శుక్రవారం
ఫ్రీ నీట్ కోచింగ్.. గిరిజన విద్యార్థులకు
తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన గురుకులాలు ప్రభుత్వ జూనియర్ కళాశాల ల నుండి 2026 లో ఇంటర్ బై పీసీ ఉత్తీర్ణులై , నీట్ పరీక్ష లో 200 కు పైగా మార్కులు పొందిన గిరిజన విద్యార్థులకు నీట్ లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు గిరిజన గురుకుల సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది.
అర్హులైన గిరిజన అభ్యర్థులు గిరిజన గురుకుల సొసైటీ ని సంప్రదించి దరఖాస్తులు సమర్పించాలని సొసైటీ అధికారులు తెలిపారు.
తిరుగు ప్రయాణం టికెట్ బుక్ చేస్తే.. 10% రాయితీ
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టికెట్ల పై రాయితీ ప్రకటించింది. ప్రయాణికులు తాము వెళ్లవలసిన గమ్య స్థానం, తిరుగు ప్రయాణం టికెట్లు ఒకే సారి బుక్ చేసుకుంటే రిటర్న్ జర్నీ టికెట్ ధర లో 10% రాయితీ కల్పిస్తామని తెలిపింది. ఒక బుకింగ్, రెండు ప్రయాణాలు, ఎక్కువ మిగులు నినాదంతో RTC ఈ విధానం అందుబాటులోకి తెచ్చింది. కాగా అన్ని రకాల బస్సులలో ఈ రాయితీ సౌకర్యం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.
ఫ్రీ కోచింగ్ @కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్, మంచిర్యాల
ఎస్సై, కానిస్టేబుల్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న మంచిర్యాల జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు అన్నారు.
ఈ ఉచిత శిక్షణ 2 నెలల పాటు కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఆసక్తి గల వారు క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి లింక్ ఓపెన్ చేసి పేరు నమోదు చేసుకోవడం ద్వారా కోచింగ్ లో చేరవచ్చని తెలిపారు. నిపుణులైన 20 మంది ఫ్యాకల్టీ తో రెండు నెలల పాటు కోచింగ్ కొనసాగుతుందని ఆయన తెలిపారు.
ఈ శిక్షణ ను పోటీ పరీక్షలలో ఎంతో అనుభవం కలిగిన విన్నర్స్ ఐకాన్ స్టడీ సర్కిల్ , కెరియర్ మిత్ర నాగరాజ్ , అనుభవజ్ఞులైన హైదరాబాద్ ఫ్యాకల్టీ బృందంతో ఇప్పిస్తున్నామని తెలిపారు. శిక్షణ లో భాగంగా అర్థమెటిక్, రీజనింగ్ ,సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటి, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ ,ఇంగ్లీష్ ,ఎకానమీ, కరెంట్ అఫైర్స్ తెలంగాణ సంబంధ అంశాలు తదితర పోటీ పరీక్షలకు అవసరమైన ముఖ్యమైన అంశాల పై శిక్షణ ఇస్తారని తెలిపారు.
60 రోజుల శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఉచిత భోజనం, ఉచిత స్టడీ మెటీరియల్ అందజేస్తామని తెలిపారు. ప్రిలిమ్స్ అర్హత సాధించిన వారికి" ఫిజికల్ టెస్ట్ లో కూడా ఉచిత శిక్షణ ఇవ్వడం" జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని మంచిర్యాల జిల్లా నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఫ్రీ నీట్ కోచింగ్ @ఎస్సీ గురుకుల సొసైటీ
తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నీట్ 2027 లాంగ్ టర్మ్ ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ గురుకుల సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది. 2026-27 విద్యా సంవత్సరంలో హైదరాబాద్ చిలుకూరు సీ ఓ ఈ లో బాలురకు, మహేంద్ర హిల్స్ సిఓఈ లో బాలికలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ తెలిపింది. బాల బాలికలకు 200 సీట్లు ఉన్నాయని ఇందులో బాలురు బాలికలకు చెరో వంద సీట్లు కేటాయించామని తెలిపారు.
2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్ బై పీసీ పాస్ అయి నీట్ 2026 పరీక్షకు హాజరైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ,బీసీ, ఈడబ్ల్యూఎస్ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారాన్ని గురుకుల సొసైటీ అధికారిక వెబ్సైట్ నుంచి పొందాలని పూర్తి వివరాలతో అవసరమైన ధృవ పత్రాలను జత చేసి సంబంధిత జిల్లా కోఆర్డినేటర్ కు సమర్పించాలని తెలిపింది. దరఖాస్తు సమర్పణకు ఈనెల 22 చివరి తేదీ అని స్పష్టం చేసింది. దరఖాస్తు కు ఎలాంటి ఫీజు అవసరం లేదని స్పష్టం చేశారు.
https://tgswrcis.telangana.gov.in
కామారెడ్డి జిల్లా కో ఆర్డినేటర్.. ఉప్పల్వాయి..97045 50256.
20, ఆగస్టు 2026, గురువారం
ఉచిత శిక్షణ @అఖిల్ రాజ్ ఫౌండేషన్
పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతి యువకులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు అఖిల్ రాజ్ ఫౌండేషన్ ప్రతినిధి మిద్దె శాంత కుమార్ తెలిపారు.
ఈ మేరకు శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను భిక్కనూరు ఎస్సై అనిల్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిరుద్యోగులను వారు కోరారు.
పూర్తి సమగ్ర వివరాలకు 98490 51483 మొబైల్ నెంబర్ లో సంప్రదించాలని సూచించారు.
ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ @ ట్యూబ్ ఇంగ్లీష్
ట్యూబ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ లో ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నట్లు ప్రముఖ ఇంగ్లీష్ ట్రైనర్ శ్రీమతి భూక్యా గౌతమి గారు తెలిపారు. వీటిని 100% ఉచితంగా నిర్వహిస్తున్నట్లు ఆమె వివరించారు. ఒక తెలుగు మీడియం అభ్యర్థి ఇంగ్లీష్ మాట్లాడటంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కుంటారు అనేది తనకు అనుభవ పూర్వకంగా తెలుసు అని ఆ ఇబ్బందిని అధిగమించి ఇంగ్లీష్ లో ఎలా అనర్గళంగా మాట్లాడాలి అనేది ఈ వీడియో లలో సవివరంగా ఉంటుందని ఆమె వివరించారు.
ఈ ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ లో మొత్తం 5 వీడియోలు ఉంటాయని అవి 50 వీడియోలతో సమానమని , ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే ఔత్సాహికులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పూర్తి సమగ్ర వివరాలకు శ్రీమతి భూక్యా గౌతమి, స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్,79977 40367 నంబర్ లో సంప్రదించాలని సూచించారు.
ఉచిత శిక్షణ @ఆదిలాబాద్ పోలీస్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎస్సై కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతి యువకులకు ఉచితంగా శిక్షణ అందించనున్నామని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
ఆగస్టు 23న అర్హత పరీక్ష ఉంటుందని ఉచిత శిక్షణ లో పాల్గొన దలచిన వారు క్యూ ఆర్ కోడ్, ఆన్ లైన్ దరఖాస్తు లేదా సమీప పోలీస్ స్టేషన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఆగస్టు 23న ఆదిలాబాద్ DTC లో అర్హత పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.
పరీక్ష లో ప్రతిభ చూపించిన వారికి ఆగస్టు 24 నుంచి డిటిసి లో నిపుణులైన అధ్యాపకులచే ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
స్టడీ మెటీరియల్, శిక్షణ..
కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష కు అవసరమైన అన్ని అంశాలలో శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్, నిపుణుల మార్గదర్శకత్వం అందిస్తామని తెలిపారు. ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులై మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన వారికి ఉచిత వసతి,ఉచిత భోజన సదుపాయం తో శిక్షణ అందిస్తామని తెలిపారు.
పోలీస్ ఉద్యోగాలే లక్ష్యంగా ఉన్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు
ఉచిత శిక్షణ @కాకా ఫౌండేషన్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎస్సై కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతి యువకులకు కాకా వెంకట స్వామి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వాలని నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం పరిధిలో మందమర్రి, చెన్నూరు పట్టణాల్లో ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
చెన్నూరు మున్సిపాలిటీ లోని మహిళా భవన్, మందమర్రి లోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న భవనం/ షెడ్డు లో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కేంద్రాలను రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ బుధవారం ప్రారంభించారు. సుమారు 3 నెలల పాటు ఈ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు వారు తెలిపారు.
ఫ్రీ కరెంట్.. కరీంనగర్ గణేశ్ మండపాలకు
కరీంనగర్ లో వినాయక చవితి ఉత్సవాలకు ఏర్పాటు చేయబోయే గణేష్ మండపాలకు వినియోగిస్తున్న కరెంట్ కు బిల్లులు తాము చెల్లించి మండపాలకు" ఉచితంగా కరెంట్ " అందించాలని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడించారు.
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ప్రతి ఏడాది దాదాపు రెండు వేల గణేశ్ మండపాలను ఏర్పాటు చేస్తుండగా గత మూడేళ్లుగా ఈ మండపాలకు వినియోగిస్తున్న కరెంట్ ఛార్జీలను మొత్తం బండి సంజయ్ కుమార్ తన సొంత డబ్బులతో చెల్లిస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం కార్పొరేషన్ మేయర్ పదవి బీజేపీ ఆధీనంలో ఉండటంతో బిల్లులను కార్పొరేషన్ చెల్లిస్తుందని ప్రకటించారు.
ఉచిత శిక్షణ @ నిజామాబాద్ పోలీస్
తెలంగాణ పోలీస్ శాఖ లోని ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతి యువకులకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సీపీ సాయి చైతన్య గారు తెలిపారు.
నిజామాబాద్ , ఆర్మూర్, బోధన్ డివిజన్ ల పరిధిలోని అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులు సంబంధిత పోలీస్ స్టేషన్లలో అందించే గూగుల్ ఫాం లింక్ లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దరఖాస్తు చేసుకోవాలి అని సూచించారు.
ఈ నెల 23 తేదీన ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. పరీక్ష 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానం లో ఉంటుంది.
నిజామాబాద్ డివిజన్ అభ్యర్థులకు మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో, బోధన్ డివిజన్ అభ్యర్థులకు జూనియర్ ఇంటర్ డిగ్రీ కాలేజ్ లో, ఆర్మూర్ డివిజన్ అభ్యర్థులకు క్షత్రియ ఇంజినీరింగ్ కాలేజీలో పరీక్ష నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్ష లో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 1 తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు" ఉచిత శిక్షణ తరగతులు" నిర్వహిస్తారు.
ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు శిక్షణ కొనసాగుతుంది. రెండు నెలల శిక్షణ కాలంలో 10 గ్రాండ్ టెస్టులు నిర్వహించడంతో పాటు అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందజేస్తామని తెలిపారు.
ఈ శిక్షణ పూర్తిగా ఉచితమని, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు సీపీ సాయి చైతన్య గారు స్పష్టం చేశారు.
దరఖాస్తు తదితర పూర్తి సమగ్ర వివరాలకు క్రాంతి 99519 43656, 87125 33273 నంబర్ లలో సంప్రదించాలని సూచించారు. .
బేసిక్ కంప్యూటర్ డేటా ఎంట్రీ కోర్స్ లో ఉచిత శిక్షణ
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని జలాల్ పురంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా " 2 నెలల కాల వ్యవధి గల బేసిక్ కంప్యూటర్ డేటా ఎంట్రీ కోర్స్ లో ఉచిత శిక్షణ" ఇవ్వనున్నట్లు సంస్థ చైర్మన్ ఎన్ కిశోర్ రెడ్డి తెలిపారు.
ఇంటర్ విద్యార్హత తో పాటు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు గల అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు ఆధార్ కార్డు కుల ధృవీకరణ పత్రం రెండు ఫోటోలను జత చేసి ఆగస్టు 24 తేదీ లోపు సంస్థ లో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఎంపికైన వారికి ఉచిత భోజనం తో కూడిన హాస్టల్ వసతి కల్పిస్తామని తెలిపారు. అంతే కాకుండా శిక్షణ పూర్తయిన తర్వాత ఉద్యోగం కూడా కల్పిస్తామన్నారు.
పూర్తి సమగ్ర వివరాలకు 91339 08000,91339 08111 నంబర్ లలో సంప్రదించాలని సూచించారు.
15, మే 2026, శుక్రవారం
కామారెడ్డి బస్టాండ్ లో విచారణకు కొత్త నెంబర్
కామారెడ్డి బస్టాండ్ లో బస్సుల వివరాలు విచారణకు కొత్త నెంబర్ను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ పి దినేష్ కుమార్ గురువారం ఒక ప్రకటనలు తెలిపారు .7382844 080 ఈ నెంబర్కు ఫోన్ చేసి కామారెడ్డి పట్టణ పరిసర ప్రాంతాల ప్రయాణికులు బస్సుల వివరాలను తెలుసుకోవాలని కోరారు.
4, మే 2026, సోమవారం
ఆప్టికల్ హబ్, కామారెడ్డి
ఆప్టికల్ హబ్,
ద హోల్ సేల్ స్టోర్,
హనీ బేకరి పక్కన,
నిజాంసాగర్ రోడ్,
కామారెడ్డి,
తెలంగాణ.
లైఫ్ టైం ఫ్రీ సర్వీస్,10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆప్టోమెట్రిస్ట్, ఫ్రీ హోం డెలివరీ,30 మినిట్స్ డెలివరీ,ప్రొడక్ట్ అందుబాటులో ..
రే బాన్, వోగ్, ఫాస్ట్ ట్రాక్,IDEE,CRIZAL,1000 మోడల్స్,ఫ్రేమ్స్..
కాంటాక్ట్..9391977499
1, మే 2026, శుక్రవారం
రాజంపేట హిందూ సమ్మేళన సమితి కార్యవర్గం
రాజంపేట హిందూ సమ్మేళనా సమితి నూతన కార్యవర్గం 2026
అధ్యక్షులు ఇట్టం చిన్న సిద్ధరాములు,
గౌరవ అధ్యక్షులు ..
బల్ల ఆంజనేయులు, అనిల్, ఇట్టం పెద్ద సిద్ధ రాములు ,
ప్రధాన కార్యదర్శి.. గుర్రాల రమేష్,
ఉపాధ్యక్షులు..
పిట్ల శ్రీను, సుమన్ చారి, కొత్తిమీర కార్ వంశీ ,వినయ్, కొప్పుల నరేష్, గుర్రాల ప్రణయ్,
కోశాధికారి.. దగ్గరి నరేష్,
కార్యదర్శులు..
గొల్ల రమేష్, గంగిరెడ్డి ప్రభాకర్, అన్వేష్, కుమ్మరి శేఖర్ ,జింక భాస్కర్, జోగిపేట రాంరెడ్డి,
కార్యవర్గ సభ్యులు ..
గడ్డమీద స్వామి, గట్టు నవీన్, పొగాకు సాయి కృష్ణ, కొప్పుల వినయ్.
రెజిన్ ఆర్ట్ తో జ్ఞాపకాలు పదిలం..
మధుర స్మృతులను పదిలపరుచుకునేందుకు ఫోటోలు, పెయింటింగ్ లను ఆశ్రయిస్తున్న అవి కొన్నాళ్లకే పాడైపోతున్నాయి. దీనికి పరిష్కారంగా రెజీనార్ట్ ట్రేండింగ్ లోకి వచ్చింది. జిగురు లాంటి ఎపోక్సీ రెజిన్ ,హార్డినర్ కలిపి ఈ ఆర్ట్ ను రూపొందిస్తారు. కాకినాడకు చెందిన దివ్య మౌనిక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే ఈ కళలో రాణిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు పెళ్లి ఫోటోలు రెజిన్ తో తయారు చేసి ఆయనకు బహుమతిగానూ ఇచ్చారు. ఆన్లైన్లో ఈ కళను నేర్చుకున్నాను, నెలకు 50 వేల రూపాయల వరకు ఆదాయం పొందుతున్నాను అని మౌనిక వివరించారు.
మహిళా సంఘాల కు సేవింగ్స్ అకౌంట్
దేశవ్యాప్తంగా ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాల కోసం కేంద్ర తపాలా శాఖ ఆధ్వర్యంలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆర్థిక సాధికారత కల్పించడానికి ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ఎండి సీఈఓ విశ్వేశ్వరన్ ప్రకటించారు. ఈ ఖాతాలలో కనీస ప్రాథమిక డిపాజిట్ అవసరం లేదు. నెలవారి సగటు బ్యాలెన్స్ కూడా నిర్వహించాల్సిన అవసరం ఉండదు. గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు బ్యాలెన్స్ ఉంచుకోవచ్చు. ఆ మొత్తానికి అమల్లో ఉన్న సేవింగ్స్ రేట్స్ ప్రకారం మూడు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తారు. నగదు డిపాజిట్, ఉపసంహరణకు ఎలాంటి చార్జీలు ఉండవు.
నిజామాబాద్ TNGO అసోసియేషన్ 2026
నిజామాబాద్ జిల్లా TNGO S అసోసియేషన్ నూతన కార్యవర్గం 2026.
అధ్యక్షులు.. సుమన్ కుమార్,
ప్రధాన కార్యదర్శి.. నేతి కుంట శేఖర్,
కోశాధికారి.. నిరంజన్ గౌడ్,
30, ఏప్రిల్ 2026, గురువారం
హాలీవుడ్ షూస్, కామారెడ్డి
హాలీవుడ్ షూస్,
మున్సిపల్ ఆఫీస్ దగ్గర,
న్యూ బస్టాండ్ రోడ్,
కామారెడ్డి.503111
కాంటాక్ట్..99123 80103,9246497229.
హాలీవుడ్ షూస్ సకుటుంబ పాదరక్షల నిలయం.
కామారెడ్డి పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు హాలీవుడ్ షూస్ వారి గొప్ప శుభవార్త.
మన హాలీవుడ్ షూస్ వారు 13 వసంతాలు పూర్తిచేసుకుని 14వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భముగా ప్రతి కొనుగోలుపై 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ ఈ అవకాశం కేవలం రెండు రోజులు మాత్రమే అనగా తేదీ రెండు మే 2026 నుండి 3 మే 2026 ఆదివారం వరకు మాత్రమే .త్వరపడండి.
మా వద్ద ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వుడ్ ల్యాండ్, లీ కూపర్ ఐడి ,పెరికార్డియన్ మొదలగు కంపెనీల ఫుట్వేర్ లభించును.
మరియు లీడింగ్ ఇండియన్ బ్రాండ్స్ అయిన ఏరోవాక్, హుస్ అబ్రోస్ క్యాంపస్ మేడి సాఫ్ట్, మేడి ఫిట్ , జాయ్ బీన్, గార్మెంట్, ఎలిమెంట్స్, అడ్డా, లాన్సర్, డాక్టర్ ఛాయిస్ మొదలగు కంపెనీల ఫుట్వేర్ లభించును.
పిల్లలకు సంబంధించిన స్కూల్ షూస్ స్కూల్ బ్యాగ్స్ మరియు బాడీ స్ప్రేలు, బెల్ట్స్ ,వ్యాలెట్స, లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ ,ఎం సి ఆర్ చెప్పల్స్ లభించును.
స్పెషల్ సైజులైన 11 12 13 లలో కూడా లభించును.
1, ఏప్రిల్ 2026, బుధవారం
అపోలో ఆసుపత్రి వారి పల్మనాలజీ క్లినిక్
ప్రతినెలా మొదటి బుధవారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు.
జయ మల్టీస్పెషల్టి హాస్పిటల్ ,
హైదరాబాద్ రోడ్,
కామారెడ్డి .
ఈ క్రింది సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే డాక్టర్ గారిని సంప్రదించండి
దీర్ఘకాలిక దగ్గు ,శ్వాసలో గురక, శ్వాస తీసుకోవడంలో కష్టం ,ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తుల క్యాన్సర్ క్షయ ,ఆస్తమా, అలర్జీ సిఓపిడి
డాక్టర్ కిషన్ శ్రీకాంత్ జువ్వ
సీనియర్ కన్సల్టెంట్ , క్లినికల్ అండ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ
అపాయింట్మెంట్ కొరకు కాల్ చేయండి 9908 737170
శ్రీ ఆముదాల పల్లి ఆంజనేయ స్వామి వార్షికోత్సవం 2026
తేదీ 2-4-2026 గురు వారం రోజున
భక్త మహాశయులకు తెలియజేయునది ఏమనగా దోమకొండ గ్రామంలో గల శ్రీ ఆముదాలపల్లి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో స్వామి వారి జన్మదిన మహోత్సవము ఏప్రిల్ 2వ తేదీ 2026 గురువారం రోజున వేద బ్రాహ్మణోత్తములచే విశేష పూజా కార్యక్రమంలో జరుపబడును కావున భక్తులు ఎల్లరు ఇట్టి దైవ కార్యములు పాల్గొని శ్రీ వీరాంజనేయ స్వామి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము.
కార్యక్రమ వివరాలు
ఉదయం 5:15 నిమిషములకు సుప్రభాత సేవ ఉదయం 8:15 నిమిషములకు గణపతి పూజ పుణ్యాహవాచనము అఖండ దీపారాధన ఉదయం 9:15 నిమిషములకు స్వామివారికి పంచామృత ఫలాభిషేకములు , ధ్వ జారోహణం చందనోత్సవం పుష్ప ఉత్సవము
ఉదయం 10 15 నిమిషాలకు స్వామివారికి నివేదన సమర్పణ హారతి మంత్రపుష్పం వేదాశీర్వచనము
మధ్యాహ్నము ఒంటిగంట 15 నిమిషాలకు అన్నదాన కార్యక్రమము కలదు
సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాలకు స్వామివారి బ్రహ్మాండమైన ఊరేగింపు కార్యక్రమం .
ఇట్లు శ్రీ ఆముదాల పల్లి ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ మరియు శ్రీ హనుమాన్ సేవా సమితి గ్రామము మరియు మండలము దోమకొండ జిల్లా కామారెడ్డి.
శ్రీ ఆముదాలపల్లి ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ..
గౌరవ అధ్యక్షులు.. సాహెబ్ గారి నర్సింలు అధ్యక్షులు బుర్రోళ్ళ కొండల్ రెడ్డి ఉపాధ్యక్షులు తేళ్ల శేఖర్ పన్యాల సుధాకర్ రెడ్డి కార్యదర్శులు బద్దం రామ్ రెడ్డి కారంగుల చంద్రశేఖర రావు కోశాధికారి బోర్రోళ్ల అంజలి రెడ్డి నాయని కాశిరెడ్డి
గౌరవ సలహాదారులు శ్రీ పన్యాల బాల్రెడ్డి శ్రీ పనియాల శ్రీనివాస్ రెడ్డి శ్రీ కుర్రి శంకర్ నాయని లింగారెడ్డి శ్రీ బుర్రోల్ల మోహన్ రెడ్డి శ్రీ కుర్రి రాజయ్య శ్రీ కామేంద్ర రాజు శ్రీ ఉగ్రవాయి నరసింహులు శ్రీ పంతులుగారు అంజయ్య శ్రీ కామిండ్ల లింగం తేళ్ల జగన్
హనుమాన్ సేవా సమితి మాలదారుల కార్యవర్గం
అధ్యక్షులు సాహెబ్ గారు నరసింహులు ఉపాధ్యక్షులు మెంతం పోచయ్య కార్యదర్శి బద్దం రామిరెడ్డి కోశాధికారి నాయిని కాశిరెడ్డి
25, మార్చి 2026, బుధవారం
శ్రీ సీతారామచంద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాలు
శ్రీ సీతారామచంద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాలు
శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు
రథాల రామారెడ్డి గ్రామంలో ,
రామారెడ్డి మండలం,
కామారెడ్డి జిల్లా..
10-3-2026 నుండి 4-4-2026 వరకు..
విశాల షాపింగ్ మాల్, కామారెడ్డి
విశాల షాపింగ్ మాల్,
విమెన్, మెన్ అండ్ కిడ్స్ వేర్,
నిజాంసాగర్ చౌరస్తా,
కామారెడ్డి -503111,
కామారెడ్డి జిల్లా.
కాంటాక్ట్.. 76600 11771
22, మార్చి 2026, ఆదివారం
కేసీ పుల్లయ్య ఫౌండేషన్, హైద్రాబాద్
కేసీ పుల్లయ్య ఫౌండేషన్,
గగన్ మహల్,
హైద్రాబాద్.
ఫౌండర్ ట్రస్టీ వ్యవస్థాపకులు.. అనిల్ కుమార్ కామిశెట్టి
సభ్యులు.. సుశీల్ కుమార్ కామిశెట్టి
కార్య నిర్వాహక. సభ్యులు.. వాసు దేవ రావు పరిం,
సీఈఓ.. సుధా చల్ల
గౌరవ చైర్ పర్సన్ .. కే. కృష్ణ వేనమ్మ..
LPG కి ప్రత్యామ్నాయం.. డైమిథైల్ ఈథర్
ప్రస్తుతం LPG కి డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో.. బిట్స్ పిలాని, హైద్రాబాద్ శాస్త్రవేత్తలు శుభ వార్త చెప్పారు.. LPG కి బదులుగా డైమిథైల్ ఈథర్ వినియోగం సాధ్యమని వెల్లడించారు..రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ విభాగాధిపతి సౌనక్ రాయ్ నాయకత్వం లో సత్య పాల్ సింగ్,రిటైర్డ్ ప్రొఫెసర్ బి ఎం రెడ్డి తదితరులు కలిసి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి వెలువడే ప్లూ గ్యాస్ ను ప్రయోగ శాలలో సృష్టించారు. దీనిని బై ఫంక్షనల్ పదార్థాల సహాయంతో నీటి ఎలక్ట్రాలసిస్ ద్వారా ఉత్పత్తి చేసిన హైడ్రోజన్ తో కలిపి డైమిథైల్ ఈథర్ గా మార్చే టెక్నాలజీ ను అభివృద్ధి చేశారు.. LPG తో పోలిస్తే DME కాలుష్య కారకాలు తక్కువగా విడుదల చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు..
మామిడిపల్లి విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం
ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి విశ్వబ్రాహ్మణ కార్యవర్గాన్ని ఆదివారం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఏక గ్రీవ్రంగా ఎన్నుకున్నారు .
2026 సంవత్సరానికి గాను
అధ్యక్షుడిగా ..ముప్పారం శివకుమార్
కార్యదర్శిగా.. కత్రాజీ చిన్న గంగాధర్,
గ్రామ అభివృద్ధి కమిటీకి.. శృంగారం మోహన్ లను ఎన్నుకొని సన్మానించారు.
కొన్నేళ్లుగా ఆలయ నిర్మాణం కోసం పాటు పడిన ప్రణీత్, విశాల్ లను సైతం సన్మానించారు.కార్యక్రమంలో గౌరవ సలహా దారుడు చిన్నారెడ్డి,తిరుపతి, సాయి రామ్,శ్రీనివాస్ తిరుమలేశ్,సాగర్, మనీష్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు..
శివం ఉడ్ ఫర్నిచర్ వర్క్స్,కామారెడ్డి
శివం ఉడ్ ఫర్నిచర్ వర్క్స్
శ్రీనివాస ఫంక్షన్ హాల్ దగ్గర,
దేవుని పల్లి,
కామారెడ్డి
పీవీసీ డోర్స్,అల్యూమినియం డోర్స్, గ్లాస్ డోర్స్,గ్లాస్ వర్క్స్
మా వద్ద అన్ని రకాల కప్ బోర్డులు, చౌకోట్లు,దర్వాజలు, కిటికీలు,మంచాలు ,డ్రెస్సింగ్ టేబుల్స్ తదితర అన్ని రకాల ఫర్నిచర్ వస్తువులు తయారు చేయబడును..
కాంటాక్ట్..ఆంజనేయులు చారి..
94917 50549,79891 36507
15, మార్చి 2026, ఆదివారం
శ్రీ వేద జనని పూజా సామాగ్రి షాప్, దోమకొండ
శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో
దోమకొండ మండల మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు శుభవార్త.
అదిత్రీ గ్రూప్స్ వారి సరికొత్త పూజా మరియు వస్త్రాలయం
శ్రీ వేద జనని పూజా మరియు జనరల్ స్టోర్స్
తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ప్రక్కన
బిబిపేట రోడ్
దోమకొండ
జిల్లా నిజామాబాద్
మా వద్ద సమస్త పూజా సామాగ్రి ,యాగ్నిక సామాగ్రి, నోములు, వ్రతాలు, హోమాలు, అన్ని దేవత వస్త్రాలు, దీక్ష వస్త్రాలు ,9*5 ధోవతులు ,శాలువాలు లభించును. మరియు సకల శుభకార్యములకు కావలసిన వస్తువులు లభించును .
అదిత్రీ లేడీస్ వేర్ మరియు కిడ్స్ వేర్ మెన్స్ వేర్
అదిత్రీ ఫ్యాన్స్ స్టోర్ మరియు గిఫ్ట్ ఆర్టికల్స్, బుక్స్ అండ్ స్టేషనరీ
13, మార్చి 2026, శుక్రవారం
ప్రణతి కోచింగ్ సెంటర్,కామారెడ్డి
ప్రణతి కోచింగ్ సెంటర్,
జయ హాస్పిటల్ ఎదురుగా,
కామారెడ్డి..
డైరెక్టర్.. తుమ్మ ఉదయ్ కిరణ్
కాంటాక్ట్..9440011131
4, ఫిబ్రవరి 2026, బుధవారం
పర్ఫెక్ట్ క్యాటరింగ్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, కామారెడ్డి
పర్ఫెక్ట్ క్యాటరింగ్ సర్వీసెస్,
హౌసింగ్ బోర్డ్ కాలనీ,
కామారెడ్డి..
అన్ని రకాల పండుగలకు ,ఫంక్షన్లకు ,పెళ్లిళ్లకు రుచికరమైన ఆహారం సప్లై చేయబడును.
100 నుండి 5వేల మంది వరకు సభ్యులు పాల్గొని కార్యక్రమాలకు కూడా మేము సప్లై చేయగలము.
కాంటాక్ట్..9666287828,9346877277
వ్యాపారుల కోసం బిల్డ్..బోయింగ్ ఆఫర్..
అప్లికేషన్లు కోరిన బోయింగ్..
విమానాల తయారీ సంస్థ బోయింగ్ తన యూనివర్సిటీ ఇన్నోవేషన్ లీడర్షిప్ డెవలప్మెంట్ /బిల్డ్ ప్రోగ్రాం 5 ఎడిషన్ కొరకు అప్లికేషన్లను ఆహ్వానిస్తోంది.
భారత విద్యార్థులు మరియు వర్ధమాన పారిశ్రామికవేత్తల వినూత్న ఆలోచనలను వ్యాపారంగా మార్చడమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం.
2019లో ప్రారంభమైన బిల్డ్ ప్రోగ్రామ్ ద్వారా ఇప్పటికే వేలాదిమంది గ్రాడ్యుయేట్లు , స్టార్ట్ అప్ లు ప్రయోజనం పొందాయి..
అర్హత..
ఏరో స్పేస్ ,టెక్నాలజీ, డిఫెన్స్ ,సస్టెనేబిలిటీ, సోషల్ ఇంపాక్ట్ రంగాలలో వినూత్న ఆలోచన లు ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు.
ప్రయోజనం ఏమిటి?
ఎంపికైన వారికి శిక్షణ ఇస్తారు .విజేతలకు తమ ఆలోచనలను అభివృద్ధి చేసుకోవడానికి పది లక్షల రూపాయల గ్రాంట్ అందజేస్తారని బోయింగ్ తెలిపింది. ఔత్సాహిక అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని ప్రయోజనం పొందాలని కోరింది.
3, ఫిబ్రవరి 2026, మంగళవారం
అత్యంత ఖరీదైన నం.ప్లేట్ DDC0001
దేశంలో అత్యంత ఖరీదైన నెంబర్ ప్లేట్ గా గుర్తింపు.
బి బి టి వేలంలో తగ్గించుకున్న గుంటూరుకు చెందిన వ్యాపారవేత్త. ఫ్యాన్సీ నెంబర్ కోసం ఎంతైనా వెచ్చించడానికి కొందరు ఆసక్తి చూపుతుంటారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ క చెందిన వ్యక్తి ఫ్యాన్సీ నెంబర్ కొరకు వేలంలో రెండు కోట్ల ఎనిమిది లక్షలు బిడ్ వేసి దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు.
లగ్జరీ ప్రముఖులు వాడిన వస్తువులు వాహనాలు ఫ్యాన్సీ నంబర్లకు వేలం నిర్వహించే బిగ్ బాయ్స్ టాయిడ్ యాప్..DDC 0001 అనే ఫ్యాన్సీ కార్ నంబర్ ను వేలం వేస్తే, గుంటూరు కు చెందిన కిరణ్ కోల్పాకుల అనే వ్యక్తి రూ 2.08 కోట్లకు బిడ్ వేసి దానిని చేజిక్కించుకున్నారు. తన మారుతి సుజుకి ఇగ్నిస్ వాహనం కోసం దీన్ని తీసుకున్నాడు. ఒక కారు నంబర్ కు ఇంత పలకడం ఇదే మొదటి సారి. దేశంలో అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్ కలిగిన వ్యక్తిగా కిరణ్ కోల్పాకుల రికార్డు సృష్టించారు
గతంలో ఈ సంస్థ HR 88 B 8888 అనే ఫ్యాన్సీ నెంబర్ ను వేలం వేస్తే హర్యానా వ్యక్తి 1.17 కోట్లకు బిడ్ వేశాడు. అయితే ఆ వ్యక్తి డబ్బులు చెల్లించడంలో విఫలం కావడంతో దాని మరోసారి వేలం వేస్తే అది 26 లక్షల 70000 మాత్రమే ధర పలకడం గమనార్హం.
తెలంగాణ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ డీలర్ల సంఘం 2026
తెలంగాణ ఫెర్టిలైజర్స్ ,పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ,
2026 నూతన కార్యవర్గం ,
అధ్యక్షులు.. నాగుర్ల వెంకటేశ్వర్లు,
ప్రధాన కార్యదర్శి.. రామడుగు మనోహర్,
కోశాధికారి ..సిద్ధి నాగరాజు.
బోధన్ కమ్మ సంఘం 2026 నూతన కార్యవర్గం
బోధన్ కమ్మ సంఘం ,
2026 నూతన కార్యవర్గం ,
జిల్లా నిజామాబాద్ ,
తెలంగాణ .
అధ్యక్షులు .. పల్లెంపాటి శివన్నారాయణ ,
ఉపాధ్యక్షులు .. డాక్టర్ వెనిగళ్ళ సునీల్ కుమార్ చౌదరి, ఆది నారాయణ, వెలగ తిలక్,
ప్రధాన కార్యదర్శి.. హరినాథ్ బాబు,
కోశాధికారి.. పల్లెం పాటి శ్రీధర్,
సంయుక్త కార్యదర్శి..ఎలవర్తి రవీంద్ర బాబు, వెంకటేశ్వర్ రావు, శ్రీనివాసరావు.
కరడ్ పల్లి రెడ్డి సంఘం 2026 కార్యవర్గం
కరడ్ పల్లి రెడ్డి సంఘం ,
నూతన కార్యవర్గం 2026 ,
తాడ్వాయి మండలం ,
జిల్లా కామారెడ్డి ,తెలంగాణ.
అధ్యక్షుడు.. కొమ్ముల రాజిరెడ్డి,
కార్యదర్శి..నల్లవెల్లి మోహన్ రెడ్డి,
కోశాధికారి..Lic రాజిరెడ్డి.
2, ఫిబ్రవరి 2026, సోమవారం
బీర్కూర్ మున్నూరు కాపు సంఘం 2026
బీర్కూర్ మున్నూరు కాపు సంఘం ,
2026 నూతన కార్యవర్గం,
జిల్లా కామారెడ్డి,
తెలంగాణ.
అధ్యక్షులు.. పోతుల వెంకటేష్,
ఉపాధ్యక్షులు ..బసెట్టి ,
క్యాషియర్ ..శ్రీనివాస్ ,
సంయుక్త కార్యదర్శి ..గంగాధర్ ,
కార్యదర్శి ..అనిల్.
దస్తూరాబాద్ మండల సర్పంచ్ ల ఫోరం 2026
అధ్యక్షులు ..మున్యాల్ సర్పంచ్ కట్కూరి లలితా రాజేష్,
ఉపాధ్యక్షులు ..మెస్రం సురేందర్ , ఎండపెల్లి గంగన్న,
ప్రధాన కార్యదర్శి ..కోలా మహేష్,
గౌరవ అధ్యక్షులు.. గుండా నరేష్,
సలహా దారులు..పద్మ కళ్యాణ్ ,నరేశ్.. సర్పంచ్ లు రాజేష్, అజ్మీరా బురాన్, వార్దెళ్లి గోపాల్, జాడి మాధవి శంకర్ పాల్గొన్నారు.
సారంగాపూర్ మండల్ కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్
సారంగాపూర్ మండల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్,
జిల్లా నిర్మల్ ,తెలంగాణ.
2026 నూతన కార్యవర్గం
అధ్యక్షులు .. కొత్తపల్లి గంగాధర్
ఉపాధ్యక్షులు ..దాసరి మల్లేష్
గౌరవ అధ్యక్షులు ..దండు సాయన్న
ప్రధాన కార్యదర్శి.. కొత్తపల్లి విలాజి
కోశాధికారి.. పాల్ది గణేష్
సంయుక్త కార్యదర్శి ..కామోజీ రాజేంద్రప్రసాద్
కార్యవర్గ సభ్యులు ..ఎం సత్యనారాయణ, రాజ వర్ధన్ రెడ్డి, చంద్రశేఖర్, శ్రీరామోజీ సాయన్న
29, జనవరి 2026, గురువారం
రాకేష్ కూల్ డ్రింక్స్ అండ్ బేకరీ దోమకొండ
రాకేష్ కూల్ డ్రింక్స్ అండ్ బేకరి,
సంగమేశ్వర్ రోడ్,
దోమకొండ..
జిల్లా కామారెడ్డి
మా వద్ద బర్త్ డే కేక్స్ ఆర్డర్ పై తయారు చేయబడును .బర్త్ డే జరుపుకొనుటకు అన్ని రకముల సౌకర్యము కలదు.
ప్రొప్రైటర్ ..ఊరే రాకేష్ ..సెల్ నంబర్..9553584882































