యువతలో విద్య,నైపుణ్యాభివృద్ధి , ఉపాధి అవకాశాలు, నాయకత్వ లక్షణాలు , సామాజిక బాధ్యత పెంపొందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.
ఉచితంగా నిర్వహించనున్న ఎంపవర్ మెంట్ ఫెస్ట్ లో విద్యార్థులు , యువత, విద్యా వేత్తలు , నిపుణులు, స్వచ్ఛంద సంస్థలు, కమ్యూనిటీ ప్రతినిధులను ఒకే వేదిక పైకి తీసుకుని వచ్చి విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి , సాంకేతికత, నాయకత్వం, వ్యక్తిగత అభివృద్ధి వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఫెస్ట్ లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పసాలా ఫౌండేషన్ సహ వ్యవస్థాపకులు,చైర్మన్ అర్జున్ మదను , సీఈవో గోకుల్ రమణ , ప్రోగ్రామ్ డైరెక్టర్ రాజా , రీజినల్ కో ఆర్డినేటర్ విజయానంద్ పసాల, పబ్లిక్ రిలేషన్స్ అండ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి