తెలంగాణ పోలీస్ శాఖ లోని ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతి యువకులకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సీపీ సాయి చైతన్య గారు తెలిపారు.
నిజామాబాద్ , ఆర్మూర్, బోధన్ డివిజన్ ల పరిధిలోని అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులు సంబంధిత పోలీస్ స్టేషన్లలో అందించే గూగుల్ ఫాం లింక్ లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దరఖాస్తు చేసుకోవాలి అని సూచించారు.
ఈ నెల 23 తేదీన ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. పరీక్ష 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానం లో ఉంటుంది.
నిజామాబాద్ డివిజన్ అభ్యర్థులకు మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో, బోధన్ డివిజన్ అభ్యర్థులకు జూనియర్ ఇంటర్ డిగ్రీ కాలేజ్ లో, ఆర్మూర్ డివిజన్ అభ్యర్థులకు క్షత్రియ ఇంజినీరింగ్ కాలేజీలో పరీక్ష నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్ష లో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 1 తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు" ఉచిత శిక్షణ తరగతులు" నిర్వహిస్తారు.
ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు శిక్షణ కొనసాగుతుంది. రెండు నెలల శిక్షణ కాలంలో 10 గ్రాండ్ టెస్టులు నిర్వహించడంతో పాటు అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందజేస్తామని తెలిపారు.
ఈ శిక్షణ పూర్తిగా ఉచితమని, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు సీపీ సాయి చైతన్య గారు స్పష్టం చేశారు.
దరఖాస్తు తదితర పూర్తి సమగ్ర వివరాలకు క్రాంతి 99519 43656, 87125 33273 నంబర్ లలో సంప్రదించాలని సూచించారు. .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి