నిజామాబాద్ జిల్లా స్థాయి సైక్లింగ్ జట్ల ఎంపికలు ఈనెల 3 గంటలకు కంటేశ్వర్ బైపాస్ రోడ్డులో నిర్వహిస్తున్నట్లు జిల్లా సైకిల్ సంఘం ప్రధాన కార్యదర్శి విజయ్ కాంత్రావు శుక్రవారం ఒక ప్రకటనలు తెలిపారు ఎంపికైన క్రీడాకారులు ఈనెల 9 10 తేదీలలో మెదక్ జిల్లాలో జరిగే ఎనిమిదవ రాష్ట్రస్థాయి మౌంటెన్ బైక్ సైక్లింగ్ ఛాంపియన్షిప్లు పాల్గొంటారని తెలిపారు.
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
2, మార్చి 2024, శనివారం
21, ఫిబ్రవరి 2024, బుధవారం
రేపు జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక
కామారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కబడ్డీ జట్లను శుక్రవారం ఎంపిక చేయనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రంగా వెంకటేశ్వర్ గౌడ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు మధ్యాహ్నం మూడు గంటలకు జిల్లా కేంద్రంలోని లయోలా పాఠశాలలో సీనియర్స్ పురుషుల కబడ్డీ క్రీడా ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఎంపికైన వారు మార్చి 2 నుంచి 4 వరకు నాగార్జునసాగర్ లోని పైలాన్ కాలనీలో నిర్వహించే 70వ రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్నట్లు తెలిపారు ఎంపికలో పాల్గొనేవారు 85 కేజీల లోపు బరువు ఉండాలని ఆధార కార్డు తప్పనిసరిగా తీసుకొని రావాలని పేర్కొన్నారు సెలక్షన్లో పాల్గొనే క్రీడాకారులు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బాణాల భాస్కర్ రెడ్డికి రిపోర్ట్ చేయాలని లేదా 9398571110 ఫోన్ నెంబర్లు సంప్రదించాలని తెలిపారు
22న సెపక్ తక్ర జూనియర్ , సబ్ జూనియర్ క్రీడాకారుల ఎంపికలు
8, ఫిబ్రవరి 2024, గురువారం
ఆల్ ఇండియా క్యారం పోటీలకు భీమ్గల్ క్రీడాకారులు
ఆల్ ఇండియా క్యారం పోటీలకు భీమ్గల్ మండల కేంద్రానికి చెందిన క్యారం ప్లేయర్స్ డి రవీందర్ గౌడ్ నూతికట్టు సతీష్ లు ఎంపికయ్యారు ఉద్యోగరీత్యా హైదరాబాద్ అగ్రికల్చర్ ఆఫీసులో పనిచేసే డి రవీందర్ గౌడ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేసే నూతికట్ట సతీష్లు ఎంపిక ఇవ్వడంతో భీమ్గల్ పట్టణవాసులు వారిని అభినందిస్తున్నారు జాతీయ క్యారంకు ఎంపికైన ఈ ఇద్దరు ఈ నెల 10 నుండి 15 తేదీల్లో బీహార్ క్యాపిటల్ పాట్నాలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్యారం పోటీల్లో పాల్గొననున్నారు
4, ఫిబ్రవరి 2024, ఆదివారం
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక
రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా క్రీడాకారుల ఎంపిక పూర్తయింది కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో శనివారం సబ్ జూనియర్స్ విభాగంలో అండర్ ఎయిట్ టెన్ 12 14 సంవత్సరాల బాలబాలికల నుంచి ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేశారు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి సుమారు 1000 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ప్రతిభ చూపిన క్రీడాకారులకు నిర్వాహకులు బహుమతులు ప్రధానం చేశారు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు జైపాల్ రెడ్డి డాక్టర్ అనిల్ కుమార్ కోశాధికారి నరేష్ రెడ్డి ఉపాధ్యక్షులు రంగ వెంకటేశ్వర్ గౌడ్ వెంకటి దత్తాద్రి నవీన్ శ్రీనివాస మధుసూదన్ వీణ గౌహతి నవీన్ సంజీవ్ నరేష్ శివగౌడ్ తదితరులు పాల్గొన్నారు
ఎంపికైన క్రీడాకారులు వీరే తాన్సింగ్ సాత్విక్ అధర్వ కృతిక ఆధ్యా రాంచరణ్ భార్గవ్ రెడ్డి రఘువీర్ గౌడ్ విహాన్ రెడ్డి వేదశ్రీ రైనా సాత్విక్ రామ్ చరణ్ శ్రావణ్ కుమార్ భవాని మమత పవిత్ర ప్రణీత ప్రవీణ్ విజయ్ కుమార్ యోగి సునీత సంధ్య కార్తీక్
3, ఫిబ్రవరి 2024, శనివారం
రాష్ట్ర స్థాయి పోటీలకు ఆదర్శ విద్యార్థి మాలతి ఎంపిక
రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు రెంజల్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని మాలతి ఎంపికయ్యారు ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలలో 76 కేజీల విభాగంలో ప్రథమ స్థానం సాధించింది ఈనెల 3 4 5 తేదీల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సప్తగిరి కాలనీలో జరిగే అండర్ 17 పోటీల్లో పాల్గొన్నట్లు ఫిజికల్ డైరెక్టర్ తెలిపారు విద్యార్థిని పాఠశాల ప్రిన్సిపల్ బలరాం ఫిజికల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ అభినందించారు.
వాలీబాల్ టోర్నీ విజేత బోర్లామ్ క్యాంప్
బాన్సువాడ ఉద్దెన గంగప్ప స్మారకార్థం ఇబ్రహీంపేటలో నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో బోర్లాం క్యాంప్ జట్టు విజేతగా నిలిచింది శుక్రవారం గ్రామ పెద్దలు విజేతలకు బహుమతులు అందించారు ఈ సందర్భంగా ఎంపీటీసీ కళావతి మాట్లాడుతూ గంగప్ప సర్పంచ్ గా గ్రామానికి ఎంతో సేవ చేశారన్నారు కార్యక్రమంలో ఆనంద్ వినయ్ రాజ్ కుమార్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
ఐఐటి మద్రాస్ లో స్పోర్ట్స్ కోట
దేశ ఐఐటీల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఐఐటి మద్రాస్ స్పోర్ట్స్ కోట అమలు చేయనుంది 2024 25 విద్యా సంవత్సరం నుంచి ప్రతి యూజీ కోర్సులో రెండు సీట్లను అత్యుత్తమ క్రీడాకారులకు కేటాయించనుంది ఇందులో ఒకటి జనరల్ న్యూట్రల్ కు ఒకటి మహిళలకు కేటాయిస్తామని ఐఐటి మద్రాస్ డైరెక్టర్ కామకోటి తెలిపారు. స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అడ్మిషన్ కార్యక్రమం ద్వారా క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి సూపర్ న్యుమరరి సీట్ల ద్వారా ప్రవేశం కల్పించి ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు
2, ఫిబ్రవరి 2024, శుక్రవారం
స్ట్రాన్జా పోటీలకు జిల్లా వాసులు..
బాక్సింగ్ క్రీడలో ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్ట్రాంజా బాక్సింగ్ టోర్నమెంట్ కు జిల్లా నుంచి ఇద్దరు ప్రాతినిథ్యం వహించడం గొప్ప విషయం బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గురువారం బరువుల వారీగా భారత బాక్సింగ్ క్రీడాకారులను ఎంపిక చేశారు జిల్లా స్టార్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ 50 కేజీల బరువు విభాగంలో పోటీ పడనుండగా ఈ పోటీలకు వెళ్లే క్రీడాకారులకు శిక్షకుడిగా జిల్లా వాసి ఎత్త సాముద్దీన్ వ్యవహరించనున్నారు క్రీడల్లో అతికిష్టమైన బాక్సింగ్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయం అయితే భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులకు శిక్షకుడు మన జిల్లా వాసే కావడం మరో ఘనత ఈ నెల ఒకటి నుంచి 12 వరకు బలిగేరియాలోని సోఫియాలో జరిగే 75 వ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్ స్ట్రాంజా పోటీలకు భారత జట్టుతో పాటు నిఖ్యారి శిక్షకుడు ఎత్తసముద్దీన్ బయలుదేరారు
మహిళా డిగ్రీ కళాశాలలో స్టేట్ లెవెల్ కల్చరల్ ఫెస్ట్
సదాశివ నగర్ మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల కామారెడ్డి మర్కల్ నందు ఈనెల ఐదు ఆరు తేదీలలో స్టేట్ లెవెల్ వైబ్రేషన్ ప్రోగ్రాం కల్చరల్ ఫెస్ట్ ను ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ వి రాధిక తెలిపారు గురువారం లేఖర్ల సమావేశంలో కార్యక్రమాలకు సంబంధించిన అంశాలను వెల్లడించారు రెండు రోజులపాటు నిర్వహించబోయే కల్చరల్ ఫెస్ట్లో 24 కాంపిటీషన్స్ లోని వివిధ రకాల సాంస్కృతిక పోటీలలో ఉండే నియమ నిబంధనల గురించి వివరించారు ఈ రకమైన పోటీల ద్వారా విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీయడంతోపాటు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించవచ్చు అని పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ జితేష్ పార్టీలతోపాటు కామారెడ్డి ఎల్లారెడ్డి శాసనసభ్యులు ఇతర ఉన్నతాధికారులు హాజరవుతారని అన్నారు అనంతరం ప్రిన్సిపల్ డాక్టర్ వీర రాధిక అధ్యాపకులు, విద్యార్థినిలతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు.
క్రీడా కారిణి ని సన్మానించి న ఐ టీ శాఖా మంత్రి
తక్కడపల్లి గ్రామానికి చెందిన కిక్ బాక్సింగ్ క్రీడాకారిణి ప్రతిభా పాటిల్ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కేమ్రాజ్ కళ్యాణి సర్పంచ్ రమేష్ తో కలిసి గురువారం సన్మానించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో క్రీడాకారులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బాలికలు క్రీడలలో రాణించడం గొప్ప పరిణామమని కొనియాడారు మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నారని ఆటలలో మంచి ప్రతిభను కనబరుస్తున్నారని వివరించారు క్రీడలకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు తనను ఎప్పుడైనా నేరుగా వచ్చి కలవచ్చని తెలిపారు.
సాఫ్ట్బాల్ క్రీడాకారినికి సత్కారం
నేషనల్ లెవెల్ సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికైన నవీపేట్ కి చెందిన దీపం స్థానిక దుర్గా యూత్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ ఎదుగుదలకు పేదరికం ఎప్పటికీ అడ్డు కాదన్నారు గ్రామీణ నేపథ్యం ఉన్న ఓ బాలిక జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం గొప్ప విషయం అన్నారు దీపం బాలికలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు అనంతరం డాక్టర్ సాధించిన బీడీ దాస్ ను దీప తల్లిదండ్రులను సన్మానించారు కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ దొంతు ప్రవీణ్ తేడు పోశెట్టి సాయిబాబాగౌడ్ లోకం నరసయ్య సూరిబాబు సురేష్ పోసాని దేవరాజ్ దుర్గా యూత్ సభ్యులు గోపి వినోద్ కుమార్ శేఖర్ పాల్గొన్నారు
1, ఫిబ్రవరి 2024, గురువారం
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
కామారెడ్డి పట్టణంలోని ఆర్కేడ్స్ పాఠశాల నుంచి రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు మధుప్రియ మనీష్ ఎంపికయ్యారని పాఠశాల ప్రిన్సిపాల్ గోవర్ధన్ రెడ్డి తెలిపారు ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు
ఆర్చరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షునికి ఘన సన్మానం
నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ సంఘ కార్యవర్గ సమావేశంలో జిల్లా ఒలింపిక్ సంఘ కార్యవర్గం ఇటీవల జరిగిన ఆలిండియా ఫెడరేషన్ ఆర్చరీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఈగ సంజీవరెడ్డిని జిల్లా టిఎన్జీవో భవనంలో బుధవారం ఘనంగా సన్మానించారు
రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు కాకతీయ విద్యార్థులు ఎంపిక
కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో బుధవారం రాష్ట్రస్థాయి రగ్బీ పోటీ ల కు జిల్లా స్థాయి బాలబాలికల జట్లను ఎంపిక చేయడం జరిగింది. ఇందులో భాగంగా కామారెడ్డి కాకతీయ విద్యార్థులైన సంజన లోకేష్ రెడ్డిలు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనడానికి అర్హత సాధించారని వ్యాయామ ఉపాధ్యాయుడు నరేష్ తెలిపారు ఎందుకైనా విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ప్రిన్సిపాల్ ను ఉపాధ్యాయ బృందం అభినందించారు ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలని ఆకాంక్షించారు
వ్యాయామ ఉపాధ్యాయుడికి ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు
గాంధారి గ్రామీణ ప్రాంత విద్యార్థులను నిరంతరం క్రీడా శిక్షణ ఇస్తూ వాలీబాల్ షూటింగ్ బాల్ లో ఎంతో మందిని జాతీయ స్థాయి వరకు రాణించేందుకు కృషి చేస్తున్న పోతంగల్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ కు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్రస్థాయి అవార్డును నిర్మల్ జిల్లాలో మా అమ్మా నాన్న ఫౌండేషన్ ఫుడ్ బ్యాంక్ వారు అందజేసినట్లు ఆయన తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిరంతరం కొనసాగిస్తూ గ్రామీణ విద్యార్థులకు క్రీడా సౌకర్యాలు కల్పిస్తున్నారు దానితోపాటు 2017 సంవత్సరంలో మా అన్న పేరుతో బామ్మనాయక స్పోర్ట్స్ ఫౌండేషన్ 892 పబ్లిక్ 2017 ను స్థాపించి దాని ద్వారా క్రీడా సదుపాయాలు క్రీడా దుస్తులు అందిస్తూ క్రీడా సౌకర్యాలు పల్లెటూరి విద్యార్థులకు అందిస్తున్నందుకు రాష్ట్రస్థాయి అవార్డు ఇచ్చినట్లు ఆయన తెలిపారు క్రీడల అభివృద్ధికి గాను గతంలో పలుమార్లు స్వచ్ఛంద సంస్థలు జాతీయస్థాయి అవార్డులు అందించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మా అమ్మ నాన్న ఫౌండేషన్ ఫుడ్ బ్యాంక్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయులు శ్రీ సాయి అనాథ ఆశ్రమ వ్యవస్థాపకులు అశోక్ స్థానిక నాయకులు పాల్గొన్నారు
విద్యార్థులకు అభినందన సభ
కోటగిరి మండల కేంద్రంలోని శ్రీ వివేకానంద పాఠశాలకు చెందిన విద్యార్థులు అంతర్జాతీయ కరాటే పోటీలలో హైదరాబాద్లోని సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో 16 మంది విద్యార్థులు పాల్గొని 24 మెడల్స్ సాధించడంతో బుధవారం అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కోటగిరి ఎస్సై సందీప్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులను అభినందించారు స్వీయ రక్షణకు కరాటే ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు ప్రతి ఒక్కరు క్రీడలలో పాల్గొనాలని హైదరాబాదులో అంతర్జాతీయ పోటీల్లో బంగారు పతకాలు సాధించిన విద్యార్థి అందరినీ ప్రత్యేకంగా అభినందించారు కరాటే మాస్టర్లు పల్లవిని అభినందించారు వివేకానంద పాఠశాలకు ఓవరాల్ ఛాంపియన్షిప్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల మేనేజ్మెంట్ హనుమంతరావు శివ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు శాంతినికేతన్ విద్యార్థుల ఎంపిక
యాదాద్రి భువనగిరి జిల్లాలో జరగబోయే రెడ్డి పోటీలకు కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి గ్రామ పరిధిలోని శాంతినికేతన్ విద్యాలయం నుంచి నలుగురు విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు రిషిక దివ్య అభిలాష్ రిషిత్ గౌడ్ ఈ నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపాల్ మరియన్ ఉపాధ్యాయులు శ్రీధర్ పటేల్ స్వామి వ్యాయామ ఉపాధ్యాయులు రాజు శివాజీ అభినందించారు.
ఆరు విభాగాల్లో బంగారు వెండి పథకాలు
తెలంగాణలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఈనెల 27 నుండి 30 వరకు బుద్వేల్ లో 30 డిగ్రీ కళాశాలలకు స్పోర్ట్స్ మీట్ 2024 నిర్వహించారు. మాక్లూర్ మండలంలోని దాస్ నగర్ సమీపంలో గల నిజామాబాద్ డిగ్రీ కళాశాలకు చెందిన పాలకూర విద్యార్థులు సత్తా చాటారు మొత్తం ఆరు విభాగాల్లో బంగారు వెండి బహుమతులు కైవసం చేసుకున్నారు టెన్నికాయిట్లో బంగారు పథకం త్రిష ప్రియతమ టేబుల్ టెన్నిస్లో వెండి పథకం సాయి ప్రసన్న హై జంప్లో బంగారు పతకం రంజిత రిలే మీటర్ బంగారు పతకం 3000 మీటర్ 800 మీటర్ వెండి పతకం రోజా గెలుపొందారు గెలుపొందిన విద్యార్థినులకు వారికి శిక్షణను ఇచ్చిన పిఈటిలను ప్రిన్సిపల్ లావణ్య ఉపాధ్యాయులు అభినందించారు
వాలీబాల్ విజేత మగ్గిడి జట్టు
ప్రముఖ పారిశ్రామికవేత్త విద్యాదాత ఏనుగు దయానంద రెడ్డి గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మంగళవారం ఉపకాల మండల కేంద్రంలోని క్రీడా ప్రాంగణంలో అండర్ 17 జిల్లా స్థాయిలో బాలబాలికలకు ఒకరోజు వాలీబాల్ కబడ్డీ పోటీలను నిర్వహించారు వాలీబాల్ పోటీలలో జడ్పీహెచ్ఎస్ మగిడి జట్టు బాలికలు ప్రథమ స్థానంలో నిలవగా ద్వితీయ స్థానంలో కలిగోట్ జడ్పీహెచ్ఎస్ బాలుర విభాగంలో జడ్పీహెచ్ఎస్ పోచంపాడు ప్రథమ ద్వితీయ స్థానం కాకతీయ ఉన్నత పాఠశాల నిజామాబాద్ జట్లు గెలుపొందినట్లు నిర్వాహకులు తెలిపారు అదే విధంగా బాలురకు కబడ్డీ పోటీలు సైతం చేపట్టారు ఇందల్వాయి జట్టు ప్రథమ బాల్కొండ కృష్ణవేణి ఉన్నత పాఠశాల విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచారు గెలుపొందిన జట్లకు ప్రథమ జట్టుకు పదివేల రూపాయలు ద్వితీయ జట్టుకు 5000 రూపాయలతో పాటు షీల్డ్లను అందజేశారు కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ముసుగు భూమేశ్వర్ రెడ్డి సీనియర్ నాయకులు సామ వెంకటరెడ్డి బద్దం నరసారెడ్డి మోత గంగారెడ్డి శ్రీనివాస్ గౌడ్ టి సాయన్న రిటైర్డ్ ఉపాధ్యాయులు అంజయ్య పుష్ప నాథ్ గోపీనాథ్ జిల్లా కమిటీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కే గంగాధర్ పిడి రాజకుమార్ మల్లేష్ గౌడ్ పీఈటీలు పాల్గొన్నారు




















