16, మే 2026, శనివారం

విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

 కామారెడ్డి జిల్లా యాదవ ఎంప్లాయిస్ సొసైటీ ఆధ్వర్యంలో 2025 26 విద్యాసంవత్సరానికి పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలలో 80 శాతానికి పైగా మార్కులు సాధించిన యాదవ గొల్ల కురుమ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు జిల్లా అధ్యక్షుడు సాయన్న తెలిపారు శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఈనెల 29న జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో అవార్డులను ప్రధానం చేయనున్నట్లు తెలిపారు అర్హులైన విద్యార్థులు తమ వివరాలను ఈ నెల 28 లోగా సాయన్న యాదవ్ 9505200165 మరియు జె శ్రీనివాస్ యాదవ్ 9441046994 లను సంప్రదించి నమోదు చేసుకోవాలని కోరారు ప్రతినిధులు కుంభాల రవి యాదవ్ శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి