BE CAREFUL / CYBER CRIMES - AWARENESS లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
BE CAREFUL / CYBER CRIMES - AWARENESS లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, మార్చి 2024, ఆదివారం

ఎస్బిఐ రివార్డ్స్ పేరుతో సైబర్ మోసం

 ఎస్బిఐ రివార్డ్స్ పేరిట ఒక యువతి సైబర్ మోసానికి గురైనట్లు సిఐ కృష్ణ ఆదివారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి బాన్సువాడ మండలం చిన్న రాంపూర్ తాండాకు చెందిన విజయ తన ఫోన్లో ఫిబ్రవరి 23న వచ్చిన ఎస్బిఐ రివార్డ్ మెసేజ్ లింకును ఓపెన్ చేసింది అందులో సైబర్ నేరగాళ్లు సూచించినట్లు ఓటిపి ఎంటర్ చేయగానే బ్యాంక్ అకౌంట్ నుంచి 37 37వేల రూపాయలు విత్డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది వెంటనే అప్రమత్తమైన విజయం సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 193 ఫోన్ చేసి జరిగిన మోసాన్ని తెలిపి పిఎస్ లో ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు

29, ఫిబ్రవరి 2024, గురువారం

ఆఫర్లకు ఆకర్షితులవ్వద్దు లింకుల్ని క్లిక్ చేయొద్దు

 సైబర్ నేరాలు రోజు రోజుకి విస్తృతమవుతున్న నేపథ్యంలో వాటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ ఎక్స్ వేదికగా సూచించారు ఆన్లైన్ ఆఫర్లకు ఆకర్షితులు కావద్దని లింకుల్ని క్లిక్ చేయొద్దని యాప్ ల ద్వారా లభించే రుణాలను తీసుకోవద్దని నమాశక్యం కాని పథకాల్లో పెట్టుబడులు పెట్టవద్దని పేర్కొన్నారు సైబర్ నేరాలు రోజురోజుకీ విస్తృతమవుతున్నాయి నా పేరుతో నకిలీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలు తెరిచి డబ్బులు అడిగారు ఆ నకిలీ ఖాతాల్ని వెంటనే తొలగించిన నేరస్తులు మళ్లీ కొత్త కాజాలు తెరిచే ప్రయత్నం చేశారు హైదరాబాద్ సంయుక్త కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలోని సైబర్ క్రైమ్ బృందం రాజస్థాన్ వెళ్లి అతి కష్టం మీద నిందితుడిని పట్టుకు రాగలిగారు అధీనంలోని సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించి తొమ్మిది వందల మూడు కోట్ల రూపాయలు 712 కోట్ల రూపాయల విలువైన మోసాల కేసుల్ని మేము కనిపెట్టగలిగాము ఇలాంటివి పెద్ద స్థాయిలో జరుగుతున్న నిత్యము వందల సంఖ్యలో సాధారణ ప్రజలు సైబర్ నేరాల బారిన పడుతున్నారు నేరస్తులు ఎక్కడో కూర్చుని ఆన్లైన్లోనే డబ్బులు కాజేస్తున్నారు. అందుకే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి అని ఆయన సూచించారు

28, ఫిబ్రవరి 2024, బుధవారం

నకిలీ వెబ్సైట్లు ఎలా గుర్తించాలి

 ప్రతిరోజు ఏదో ఒక అవసరం కోసం ఎన్నో వెబ్సైట్స్ వాడాల్సి వస్తోంది ప్రస్తుతం నకిలీ వెబ్సైట్స్ ఎక్కువైపోయాయి వాటి వల్ల యూజర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి దీనికి సొల్యూషన్ ఏంటి నకిలి వెబ్సైట్లను కనిపెట్టడమే అది ఎలాగంటే

వెబ్సైట్ ఓపెన్ చేయాలంటే ముందుగా ఆ వెబ్సైట్ కి సంబంధించిన అడ్రస్ డొమైన్ నేమ్ ఇవ్వాలి వెబ్సైట్ పేరు చివరలో .com,in,org,edu లాంటిది ఎక్కువగా కనిపిస్తుంటాయి అయితే నకిలీ వెబ్సైట్లో అలా కాకుండా తప్పుగా ఉంటాయి

వెబ్సైట్ పేరులో యు ఆర్ ఎల్ ఉంటే కచ్చితంగా దానికి ముందు హెచ్టిటిపిఎస్ https ఉంటుంది అలా ఉంటే అది ఒరిజినల్ వెబ్సైట్ అలా లేదంటే నకిలీ

వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మరో వెబ్సైట్ కి రీ డైరెక్ట్ అవుతుందంటే కచ్చితంగా అది నకిలీ వెబ్సైట్

ఒరిజినల్ వెబ్సైట్లో about us,contact పేజీలు కనిపిస్తాయి నకిలీ వెబ్సైట్లో ఆ వివరాలు ఉండవు

అంతేకాకుండా web of trust అనే వెబ్సైట్ వాడి నకిలీ వెబ్సైట్లను గుర్తించవచ్చు

గూగుల్ క్రోమ్ బ్రౌజర్కు ఈ వెబ్సైట్ యాడ్ చేసుకోవాలి. ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే దానిపై గ్రీన్ కనిపిస్తే ఒరిజినల్ రెడ్ మార్క్ ఉంటే నకిలీ వెబ్సైట్

అనుమానాస్పద లింకులు ఫోన్ నెంబర్లతో వచ్చే మెసేజ్ ల గురించి కంప్లైంట్ చేసేందుకు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో 8712672222 వాట్సాప్ నెంబర్ అందుబాటులో ఉంచింది అలాంటి లింక్స్ ఏవైనా వస్తే వాటిని ఈ నెంబర్కు పంపిస్తే వాటిని పరిశీలిస్తుంది నకిలీవని తెలిపే వాటిని పనిచేయకుండా చేస్తుంది ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరో

21, ఫిబ్రవరి 2024, బుధవారం

అమ్మో వాయిస్ క్లోనింగ్

 డీప్ ఫేక్ వీడియోల కలకలం ఒకవైపు కొనసాగుతుండగాని వాయిస్ క్లోనింగ్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి .ఇప్పటికే అమెరికా ఐరోపా దేశాల్లో ఈ తరహా కేసులు నమోదయ్యాయి. కృత్రిమ మేధా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో నకిలీ వాయిస్ ని సృష్టించడమే వాయిస్ క్లోనింగ్ గా నిపుణులు చెప్తున్నారు. నకిలీ వాయిస్ తో ఆర్థిక నేరాలకు పాల్పడడమే దీని ఉద్దేశమని వెల్లడిస్తున్నారు .ఎలా మభ్యపెడతారంటే.. లక్షత వ్యక్తికి సంబంధించిన వాయిస్ ను తోలుతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో తర్ఫీదు ,ట్రైన్ చేసి చేసి అసలు వాయిస్ గా భ్రమించేలా క్లోనింగ్ చేస్తారు తర్వాత సదరు వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు ఆప్తుల ఫోన్ నెంబర్లకు కాల్స్ చేసి ఆ వ్యక్తి మాట్లాడినట్టుగా ఫేక్ సంభాషణలను కొనసాగిస్తారు ఆపదలో ఉన్నాం వెంటనే ఈ నెంబర్కు డబ్బులు పంపించాలంటూ విజ్ఞప్తి చేస్తారు డబ్బులు పంపించే వరకు పలు విధాలుగా మభ్యపెడతారు ఆత్మీయ లే ఫోన్ చేశారు కదా అంటూ అలా పలువురు పెద్ద మొత్తంలో డబ్బు పంపించిన ఉదంతాలు అమెరికాతో పాటు ఇప్పటికే పలు దేశాల్లో  వెలుగు చూశాయి కూడా. అమెరికాలోని ఓ కంపెనీకి చెందిన సీఈవో ఇలా మోసపోయి ఏకంగా రెండు లక్షల 43 వేల డాలర్లను నీరగాళ్లకు పంపించినట్లు సమాచారం అమెరికా అధ్యక్షుడు జో బైడన్ కు కూడా వాయిస్ క్లోనింగ్ సెగ ఇటీవల తగిలింది ఈ సంవత్సరం చివర్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు అభ్యర్థిత్వం కోసం ప్రస్తుతం అమెరికాలో ప్రైమరీ పోల్స్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడి ఓటర్లకు బయడేన్ చెప్పినట్లుగా ముందుగా రికార్డ్ చేసిన కొన్ని ఫేక్ ఫోన్ కాల్స్ పలుగురికి వెళ్లాయి ఎన్నికల్లో ఓటు వేయొద్దని బయడిన్ఓటర్లను కోరినట్లు ఆడియోలో ఉన్నది .కృత్రిమ మేధా ఆధారంగా సృష్టించిన ఈ ఫేక్ కాల్స్ పై వైట్ హౌస్ ఆందోళన వ్యక్తం చేసింది వాయిస్ క్లోనింగ్ నేరాల పట్ల క్లోనింగ్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తతో ఉండాలని అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

17, ఫిబ్రవరి 2024, శనివారం

గోల్డెన్ అవర్ రెస్పాన్స్ రు కోటిన్నర సేఫ్

 సైబర్ నేరాల్లో భారీగా కోల్పోయిన ఇరువురు వ్యక్తులు ఫిర్యాదు పై స్పందించిన సైబర్ క్రైమ్ బాధితులకు సొమ్ము అందజేత




11, ఫిబ్రవరి 2024, ఆదివారం

సైబర్ సెక్యూరిటీ అవగాహన స్ట్రీట్ ప్లే పోటీలు

 ఈనెల 25 వరకు ఎంట్రీలకు కేంద్ర హోం శాఖ ఆహ్వానం

సైబర్ నేరాల కట్టడికి అవగాహనని అస్త్రంగా ప్రయోగించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది ఇందులో భాగంగా ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఐ ఫోర్ సి ఆధ్వర్యంలో సైబర్ సేఫ్ ఇండియా అన్న ఇతివృత్తంతో సైబర్ క్రైమ్ అవగాహన స్ట్రీట్ ప్లే పోటీలను నిర్వహిస్తోంది ఆసక్తి ఉన్నవారి నుంచి ఎంట్రీలో ఆహ్వానిస్తోంది ఎంట్రీలు పంపేందుకు ఫిబ్రవరి 25 చివరి తేదీ అని అధికారులు తెలిపారు https://www.mygov.in/task/cyber& awareness&street&play&contest/ లింకుపై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయాలని సూచించారు ఇన్వెస్ట్మెంట్ పార్ట్ టైం జాబ్స్ పేరిట సైబర్ మోసాలు అనధికారిక లోన్ యాప్స్ మోసాలు సెక్టార్షన్ పార్సిల్ స్కామ్ ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టం ఆధారితమోసాలు చిన్నారులు మహిళలపై సైబర్ వేధింపులు అనే అంశాలపై 15 నిమిషాలకు మించకుండా స్ట్రీట్ ప్లేను తీసి అప్లోడ్ చేయాలని సూచించారు




7, ఫిబ్రవరి 2024, బుధవారం

డీప్ ఫేక్ టెక్నాలజీతో 207 కోట్లు దోపిడీ

 డీప్ ఫేక్ టెక్నాలజీ ఉపయోగించి సైబర్ నీరగాళ్లు ఓ మల్టీ నేషనల్ కంపెనీ నుంచి 2007 కోట్ల రూపాయలు కొట్టేశారు ఆ కంపెనీకి చెందిన చీప్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ముఖాన్ని డీప్ ఫేక్ చేశారు ఆపై వీడియో కాల్ చేసి వ సీక్రెట్ ఆపరేషన్ కోసం డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలంటూ అకౌంట్ డిపార్ట్మెంట్ ఉద్యోగులను ఆదేశించారు దీంతో సిబ్బంది ఆయన చెప్పిన అకౌంట్లకు క్యాష్ ట్రాన్స్ఫర్ చేశారు పక్కా ప్లాన్ చేసిన నేరగాళ్లు వారం రోజుల్లో ఈ దోపిడీ ఎపిసోడ్ ను ముగించారు ఆపై తేరుకున్న కంపెనీ సిబ్బంది తమ మోసపోయామంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ అతిపెద్ద డీప్ ఫేక్ మోసం కంపెనీకి చెందిన హాంకాంగ్ బ్రాంచ్లో టీవల జరిగిందని ఇంటర్నేషనల్ మీడియా తెలిపింది

వీడియో కాల్ చేసి నమ్మించారు స్కామర్లు పక్కాగా స్కెచ్ వేశారు కంపెనీకి చెందిన మెయిన్ బ్రాంచ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ తో పాటు కీలక సిబ్బంది ముక్కాలను డీప్ ఫేక్ చేశారు వాళ్ళ మాట తీరును మక్కికి మక్కి కాపీ కొట్టారు ఆపై క్యాష్ వ్యవహారాలు చూసుకుని హాంగ్కాంగ్ బ్రాంచ్ లోని అకౌంటెంట్ కు వీడియో కాన్ఫరెన్స్ కలిపారు అంతకుముందే సీక్రెట్ ఆపరేషన్ కోసం డబ్బు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుందని మెయిల్ ద్వారా అతన్ని అలర్ట్ చేశారు గ్రూప్ వీడియో కాల్ లో మాట్లాడుతున్న బాస్ తో సహా మిగతా టీమ్ అంతా తమ కంపెనీ వాళ్ళే కావడంతో అకౌంటెంట్ కు ఏ మాత్రం అనుమానం రాలేదు. వీడియో కాల్ లో వాళ్ళు చెప్పినట్లే ఐదు అకౌంట్లకు 27 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు కంపెనీ హెడ్ ఆఫీస్ కు వెళ్లగా తనను మోసం చేశారని పేర్కొని పోలీసులను ఆశ్రయించారు అయితే ఆ కంపెనీ పేరు ఏంటో కూడా వెల్లడించని పోలీసులు ఈ కేసులో ఇప్పటివరకు ఎవరిని పట్టుకోలేకపోయారని మీడియా రిపోర్ట్ తెలిపింది.



3, ఫిబ్రవరి 2024, శనివారం

కేవైసీ మోసాలతో జాగ్రత్త ఆర్బిఐ హెచ్చరిక

 నో యువర్ కస్టమర్ కేవైసీ మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని ఆర్బిఐ మరోసారి హెచ్చరించింది స్కామర్లు ఫోన్ కాల్స్ ఎస్ఎంఎస్ ఈమెయిల్ తో బాధితుల వ్యక్తిగత సమాచారం ఖాతా వివరాల వంటివి చోరీ చేస్తున్నారు మోసగాళ్లు ఇలాంటి కమ్యూనికేషన్ పంపి కస్టమర్లు ఆందోళన పడేలా చేస్తారు వెంటనే కేవైసీ అప్డేట్ చేసుకుంటే ఖాతా రద్దు అవుతుందని భయపెడతారు. దీంతో బాధితుడు భయపడి మొత్తం సమాచారం ఇస్తాడు ఫైనాన్షియల్ సైబర్ మోసాలు జరిగితే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ లో లేదా సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ ద్వారా ఫిర్యాదు చేయాలని ఆర్పిఐ తెలిపింది కేవైసీ అప్డేషన్ కోసం ఏదైనా రిక్వెస్ట్ వస్తే నిర్ధారణ కోసం నేరుగా బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థను సంప్రదించాలని పేర్కొంది ఆర్థిక సంస్థ కస్టమర్ కేర్ ఫోన్ నెంబర్ను దాని అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే తీసుకోవాలి ఖాతా లాగిన్ వివరాలు వెరిఫై కానీ యాప్లను ఇన్స్టాల్ చేయడం వల్ల కూడా మోసాలు జరిగే అవకాశాలు ఉంటాయని ఆర్బిఐ తెలిపింది



అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట

 విద్యావంతులు సైతం సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో వర్క్ షాప్ లో డీజీపీ రవి గుప్తా

ప్రజల్లో అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయగలుగుతామని డిజిపి రవి గుప్తా అన్నారు ఈ నేరాల కట్టడికి దేశంలోని తొలిసారిగా రాష్ట్రస్థాయిలో తెలంగాణ స్టేట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ జిల్లాల స్థాయిలో డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు శుక్రవారం బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సైబర్ నేరాలపై అవగాహన వర్క్షాప్ నిర్వహించారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖ గోయల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ వర్క్ షాప్ లో డిజిపి రవి గుప్తా హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి ఉత్తర అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డిజిపి రవి గుప్తా మాట్లాడుతూ తనకు సైతం సైబర్ నేరగాళ్ల నుంచి ఎస్ఎంఎస్ లు వచ్చాయని వెల్లడించారు హైదరాబాద్ సిటీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచితే దాదాపు 60 శాతం సైబర్ నేరాలు తగ్గ అవకాశం ఉంది అన్నారు సైబర్ నీరకాల మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ మీడియాను కోరార కార్యక్రమంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీలు విశ్వజిత్ దేవేందర్ సింగ్ ఏసీబీ నుంచి కేవీఎం ప్రసాద్ పాల్గొన్నారు


24, జూన్ 2022, శుక్రవారం

నమ్మితే దొచేస్తారు..సైబర్ నేరగాళ్లు...

 తియ్యటి మాటలతో నమ్మించి వివరాలు తస్కరించి డబ్బులు కొల్ల గొట్టడంలో సైబర్ నేరగాళ్లు ఆరితేరి పోయారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచితుల కు వ్యక్తిగత వివరాలు చెప్పకూడదని సూచిస్తున్నారు.నేరుగా సంబంధిత కార్యాలయానికి వెళ్లి అధికారులను సంప్రదించాలని కోరారు.


15, జూన్ 2022, బుధవారం

ఆన్ లైన్ బెట్టింగ్ ప్రకటనలు వేయొద్దు

 ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో విరివిగా కనిపిస్తున్న ఆన్ లైన్ బెట్టింగ్ ప్రకటనలు ప్రచురించ వద్దు అని కేంద్ర ప్రసార, సమాచార మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.వీటిపై చాలా చోట్ల నిషేధం ఉందని,నిబంధనలు సరిగా పాటించడం లేదని తెలిపింది. వ్యక్తుల సామాజిక ఆర్థిక పరిస్థితి దెబ్బతీసేలా ఉన్నాయని తెలిపింది.