సైబర్ నేరాలు రోజు రోజుకి విస్తృతమవుతున్న నేపథ్యంలో వాటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ ఎక్స్ వేదికగా సూచించారు ఆన్లైన్ ఆఫర్లకు ఆకర్షితులు కావద్దని లింకుల్ని క్లిక్ చేయొద్దని యాప్ ల ద్వారా లభించే రుణాలను తీసుకోవద్దని నమాశక్యం కాని పథకాల్లో పెట్టుబడులు పెట్టవద్దని పేర్కొన్నారు సైబర్ నేరాలు రోజురోజుకీ విస్తృతమవుతున్నాయి నా పేరుతో నకిలీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలు తెరిచి డబ్బులు అడిగారు ఆ నకిలీ ఖాతాల్ని వెంటనే తొలగించిన నేరస్తులు మళ్లీ కొత్త కాజాలు తెరిచే ప్రయత్నం చేశారు హైదరాబాద్ సంయుక్త కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలోని సైబర్ క్రైమ్ బృందం రాజస్థాన్ వెళ్లి అతి కష్టం మీద నిందితుడిని పట్టుకు రాగలిగారు అధీనంలోని సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించి తొమ్మిది వందల మూడు కోట్ల రూపాయలు 712 కోట్ల రూపాయల విలువైన మోసాల కేసుల్ని మేము కనిపెట్టగలిగాము ఇలాంటివి పెద్ద స్థాయిలో జరుగుతున్న నిత్యము వందల సంఖ్యలో సాధారణ ప్రజలు సైబర్ నేరాల బారిన పడుతున్నారు నేరస్తులు ఎక్కడో కూర్చుని ఆన్లైన్లోనే డబ్బులు కాజేస్తున్నారు. అందుకే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి అని ఆయన సూచించారు
No comments:
Post a Comment