Monday, 26 February 2024

గర్భాశయ క్యాన్సర్ సూచనలు ఏమిటి

 పూనం పాండే పబ్లిసిటీ స్టంట్ కావచ్చు కేంద్ర ప్రభుత్వం టీకాల ప్రస్తావన కావచ్చు ఒక్కసారిగా సర్వికల్ క్యాన్సర్ గురించి దేశవ్యాప్తంగా చర్చ పెరిగింది ఈ నేపథ్యంలో సర్వికల్ క్యాన్సర్ ఎందుకింత ప్రాణాంతకం అవుతున్నది అనే అధ్యయనం మొదలైనది తొలి రోజులలో పసిగట్టకపోవడమే ఈ మహమ్మారి విగ్రహం పడకు అసలు కారణమని గుర్తించారు నిపుణులు లక్షణాలను కనిపెట్టి సరైన వైద్యుడిని సంప్రదిస్తే తొలి దశలోనే సమర్థమైన చికిత్స సాధ్యం అంటున్నారు

రుతుస్రావ సమయంలో రక్తం ఎక్కువగా పోవడం రోజుల తరబడి రక్తస్రావం కొనసాగడం

పీరియడ్స్ మధ్యలో బహిష్టు తర్వాత కూడా రక్తస్రావము జరగడం

రక్తం రంగు మారుతూ దుర్వాసనతో కూడిన స్రావాలు వెలువడము

గర్భాశయం దగ్గర నొప్పి దురదగా ఉండడం, మూత్రానికి వెళ్ళినప్పుడు, రతి సమయంలో ఆసౌకర్యం కలగడం

ఈ లక్షణాలు ఇతర వ్యాధులలో కూడా కనిపించవచ్చు అదే సమయంలో గర్భాశయ క్యాన్సర్కు కూడా సూచనగానూ భావించాలి 9 నుంచి 14 సంవత్సరాల వయసులో వ్యాక్సిన్ వేయించుకోవడం పాతికేళ్ల వయసు వచ్చిన తర్వాత ప్రతి మూడు నుంచి ఐదు ఏళ్లకు ఒకసారి స్క్రీనింగ్ చేయించుకోవడం ఉత్తమమని నిపుణులు సలహా ఇస్తున్నారు

No comments:

Post a Comment