Tuesday, 27 February 2024

పేస్ మేకర్ జాగ్రత్తలు ఏమిటి

 పేస్ మేకర్ అమర్చిన తర్వాత వారం వరకు చాతి మీద వేసిన బ్యాండేజ్ ని మార్చుకోవాలి గోకటం చేత్తో గట్టిగా రుద్దడం వంటివి చేయవద్దు వారంలోనే రోజువారి పనులన్నీ చేసుకోవచ్చు అయితే నాలుగు నుంచి ఆరు వారాల వరకు కఠినమైన తీవ్రమైన వ్యాయామాలు చేయవద్దు ముఖ్యంగా పేస్మీకరణ అమర్చినవైపు చేతితో బలమైన పనులు చేయవద్దు. ఆ తర్వాత అన్ని పనులు చేసుకోవచ్చు అయస్కాంతముతో కూడిన ఎలక్ట్రానిక్ పరికరాలు పేస్ మేకర్ మీద ప్రభావం చూపవచ్చు కాబట్టి స్మార్ట్ ఫోన్లను పేస్ మేకర్ కు కనీసం 6 అంగుళాల దూరంలో ఉండేలా చూసుకోవాలి మాట్లాడేటప్పుడు అవతరిచేది అంటే ఎడమవైపున పేస్ మేకర్ అమర్చితే కుడిచేవి వద్ద ఫోన్ పెట్టుకోవాలి. స్పీకర్ ఆన్ చేసుకోనైనా మాట్లాడవచ్చు ఈ సిగరెట్ల వంటి వాడకపోవడం ఉత్తమం. ఇవి పేస్ మేకర్ పనితీరుకు భంగం కలిగించవచ్చు కనీసం ఆరు నెలలకు ఒక్కసారైనా తనిఖీ చేసుకోవాలి అవసరమైతే డాక్టర్లు పేస్ మేకర్ సెట్టింగ్స్ ని మారుస్తారు పేస్ మేకర్ అమర్చినప్పుడు ఒక చిన్న కార్డు ఇస్తారు ఇందులో పేస్ మేకర్ రకము తయారుచేసిన కంపెనీ వంటి వివరాలు ఉంటాయి. దీనిని వెంట ఉంచుకోవడం మంచిది. ఫోన్లో ఫోటో తీసి అయినా పెట్టుకోవచ్చు ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తిన ఇతరత్రా కారణాలతో ఆసుపత్రికి వెళ్లిన కార్డు చూపిస్తే చికిత్సలు మందుల విషయంలో పొరపడడం తప్పుతుంది శాస్త్ర చికిత్స చేస్తున్నప్పుడు రక్తస్రావం కాకుండా వాడే ఎలక్ట్రో కార్ డి పరికరం కొన్నిసార్లు పేస్ మేకర్ మీద ప్రభావం చూపవచ్చును చూపిస్తే పేస్ మేకర్ మోడ్ ను తగినట్లుగా మారుస్తారు ఎమ్మారైని తట్టుకునే రకానిదే అయినా సెట్టింగ్స్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది ఇక్కడ కార్డు ఉపయోగపడుతుంది రేడియేషన్ చికిత్స వంటివి పేస్ మేకర్ మీద ప్రభావం చూపవచ్చు ముందే డాక్టర్ కు విషయాన్ని చెప్పాలి అవసరమైతే సెట్టింగ్స్ మారుస్తారు అలాగే విమానాశ్రయాలలో మెట్రో రైల్వే స్టేషన్లలో మెటల్ డిటెక్టర్లు గుర్తించినప్పుడు కార్డును చూపిస్తే ఇబ్బంది అడ్డుకోకుండాను చూసుకోవచ్చు.

No comments:

Post a Comment