Monday, 26 February 2024

మోమోలు తేలేదని భర్త పై కేసు

 ఎవరైనా భర్త తనను మంచిగా చూసుకోవడం లేదను హింసిస్తున్నాడని ఫిర్యాదు చేస్తారు కానీ ఆగ్రాకు చెందిన ఒక వివాహిత తన భర్త తనకు మోమోలు తెచ్చివ్వడం లేదని పోలీసు కేసు పెట్టింది మోమో అనేది మన సమోసాలు లాగా పాపులర్ స్నాక్ యూపీలోని మలుపురకు చెందిన ఒక మహిళకు పినహాటకు చెందిన ఒక వ్యక్తితో ఇటీవల వివాహమైంది పెళ్లి సమయంలో తనకు మోమోస్ అంటే ఇష్టం అని వధువు చెప్పిందట పెండ్లయ్యాక ఆమె భర్త క్రమం తప్పకుండా మోమోస్ తెచ్చేవాడని ఇటీవల అలా చేయడం లేదని ఆమె అలిగిందట ఈ విషయమే తరచూ వారిద్దరి మధ్య గొడవ జరిగేది ఒకరోజు అలిగిన భార్య తన పుట్టింటికి వెళ్ళిపోయిందట అక్కడి నుంచే భర్త పై పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు భార్యాభర్తలను కౌన్సెలింగ్కు పంపించారు కొన్నిసార్లు డ్యూటీ ఆలస్యం వల్ల మామూలు దొరకలేదని మరికొన్నిసార్లు మోమోస్ తీసుకోవడం మర్చిపోయానని భర్త తన గోడు వెళ్ళబోసుకున్నాడు ఇద్దరి మధ్య కౌన్సిలర్లు కుదిరించిన రాజీప్రకారం భర్త వారానికి రెండు రోజులు మోమోసు తీసుకురావాలి. ఎందుకు అంగీకరించిన మహిళ భర్తతో కాపురానికి వెళ్లిందట

No comments:

Post a Comment