Wednesday, 28 February 2024

పార్కులలో పుస్తకాలు

 మన నగరాలలోని పార్కుల్లో ఏమేమి ఉంటాయి కలబంద జ్యూస్ నుంచి చిరుధాన్యాలు జావా దాకా ఆరోగ్యానికి మంచిదనుకున్న ప్రతిదీ ఉంటుంది కానీ అవన్నీ శారీరక ఆరోగ్యానికి మరి మానసిక ఆరోగ్యానికి సాహిత్యాన్ని మించింది ఏముంటుంది అందుకే చెన్నై నగరంలోని ప్రతి పార్కులోను ఒక బుక్ జోన్ను ఏర్పాటు చేస్తోంది అక్కడే నగరపాలక సంస్థ పార్కులకు వచ్చిన వాళ్ళకి ఉచితంగా పుస్తకాలు ఇచ్చే చదవమంటుంది చిన్నారులను యువతని లక్ష్యంగా చేసుకొని ఇటీవల వీటిని ఏర్పాటు చేసింది వార్తాపత్రికలు పోటీ పరీక్షల పుస్తకాల జోలికి వెళ్లకుండా పూర్తిగా ఇంగ్లీషు తమిళ ఆధునిక సాహిత్యాన్ని పరిచయం చేస్తుంది పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ ఎక్కడైనా దొరుకుతుంది నేటి యువతకి కరువు అవుతున్నది సాహిత్య పరిచయమే సంపూర్ణ వికాసానికి అదే తోడ్పడుతుంది అంటున్నారు ఈ బుక్ జోన్లని ఏర్పాటు చేస్తున్న కార్పొరేషన్ అధికారులు అది కూడా సంపన్నులు ఉన్న ప్రాంతాల్లో కాకుండా మురికివాడల దగ్గరే ఈ పార్క్ బుక్ జోన్లను ఏర్పాటు చేయడం విశేషం



No comments:

Post a Comment