Thursday 29 February 2024

బాడీ లాంగ్వేజ్ ట్రిక్స్ .. పోశ్చర్ టిప్స్

 


ఎదుటివారు మనతో ప్రవర్తించే విధానం మన బాడీ లాంగ్వేజ్ మీద ఆధారపడి ఉంటుంది నిలబడే తీరు ముఖంలో వలికే కవళికలు మనల్ని ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి అలాంటి కొన్ని ట్రిక్స్ నీకోసం

 బాడీ లాంగ్వేజ్ ట్రిక్స్

పోశ్చర్..

నడిచేటప్పుడు భుజాలు వెనక్కి చుబుకం పైకి ఉండాలి నిటారుగా ఉండాలి శరీరం గురించిన కన్షియస్ కలిగి ఉండాలి

ముఖ కవళికలు

ముఖం మీద చిరునవ్వు ఎప్పుడూ మెరుస్తూ ఉండాలి ఇతరులు మీతో మాట్లాడడానికి ఆసక్తి చూపుతారు చిరునవ్వు మీ గురించి ఎదుటి వాళ్ళలో సద్భావన కలుగుతుంది

స్వరం

అనవసరంగా గొంతు పెంచి మాట్లాడకూడదు సందర్భాన్ని బట్టి స్వరం మారుస్తూ ఉండాలి మార్ధవం గంభీరం సున్నితత్వం స్వరంలో సందర్భానుసారంగా తోనికి సెలడాలి

చేతుల కదలికలు

అవసరాన్ని బట్టి భావవ్యక్తీకరణకు తోడ్పడేలా చేతులు కదిలించాలి మీరు వ్యక్తం చేయదలచుకున్న విషయాన్ని చేతుల కదలికలు స్పష్టం చేసేలా ఉండాలి

కళ్ళు

 పరిచయం చేసుకునేటప్పుడు సూటిగా కళ్ళలోకి చూడాలి ఎదుటి వ్యక్తి మాట్లాడేటప్పుడు కళ్ళలోకి చూస్తూ వినాలి

నడక

 ఎంత హడావిడిలో ఉన్న ఆ తొందర నడకలో ప్రతిబింబించకూడదు నడకలు ఆత్మవిశ్వాసం తొణికిసలాడాలి

 కూల్

 క్రమశిక్షణతో మెలగాలి ఎంత చిరాకు వచ్చినా స్థిరత్వం కోల్పోకూడదు

No comments:

Post a Comment