Sunday, 25 February 2024

ఆధ్యాత్మిక సమాచారం 25 ఫిబ్రవరి 2024

 ఆలయంలో ఎంపీ పూజలు మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో ఎంపీ బీబీ పాటిల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు శనివారం ఆయన నాయకులతో కలిసి ఆలయాన్ని సందర్శించారు దర్శనం అనంతరం అధికారులు ఆయనను సన్మానించారు ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నర్సింలు గౌడ్ భక్తులు ఉన్నారు





తెలంగాణ తిరుమలలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు ఉదయం సుప్రభాతం ఆరాధన అష్టోత్తర నామ పూజ నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి శ్రీవారికి అర్చనలు అభిషేకాలు చేశారు ఈ సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశారు కమిటీ సభ్యులు నాగేశ్వరరావు నరసరాజు అప్పారావు మేనేజర్ విటల్ అర్చకుడు నందకిషోర్ ఉన్నారు

దాతలు అందజేసిన 17 లక్షల రూపాయల విరాళాలతో బీర్కూర్ కోదండ రామాలయం వెనుక భాగాన అన్నదాన సత్రం స్లాబ్ పనులను శనివారం ఎంపీపీ రఘు కమిటీ సభ్యులు ప్రారంభించారు కమిటీ సభ్యులు విట్టల్ గంగారం రాజు యోగేశ్వర్ ఉన్నారు

సరస్వతీ విగ్రహ ఆవిష్కరణ బీర్కూరు గడి కింది బాలికల ప్రాథమిక పాఠశాలలో మీరు కోరుకు చెందిన విఠల్ అనే ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు సొంతంగా 50 వేల రూపాయలతో ఏర్పాటు చేసిన సరస్వతి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి శనివారం ఎంపీపీ రఘు పిఆర్టియు నాయకులు ఆవిష్కరించారు హెచ్ఎం వేణుగోపాల్ పిఆర్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కుశాల్ తదితరులు ఉన్నారు

గులాబ్ బాబా ఆశ్రమానికి పాదయాత్ర బీర్కూరులో గులాబ్ బాబా గురు స్వామి కొండలవాడి మాధప్ప ఆధ్వర్యంలో శనివారం బాబా భక్తులు మహారాష్ట్రలోని కాటేద్దాం గులాబ్ బాబా ఆశ్రమానికి 30 మంది భక్తులు పాదయాత్రగా తరలి వెళ్లారు 13 రోజులపాటు ఈ పాదయాత్ర కొనసాగుతుందని మాదప్ప చెప్పారు

దేశ సంస్కృతి పరిరక్షణకు యువత పాటుపడాలని నేషన లిస్ట్ హబ్ చానల్ ceo సాయికృష్ణ అన్నారు జిల్లా కేంద్రంలో సరస్వతి శిశు మందిర్ పాఠశాల 41 వార్షికోత్సవం శనివారం రాత్రి నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు శిశు మందిరాలు క్రమశిక్షణకు నిలయాలన్నారు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకుంది పాఠశాల అధ్యక్షుడు శ్యాంసుందర్ ప్రతినిధులు హరిస్మరణ రెడ్డి రాజిరెడ్డి మల్లేష్ యాదవ్ ప్రతాప్ గౌడ్ అశోక్ రావు శంకర్ లాల్ రంజిత్ మోహన్ చారి శ్రీనివాస్ ప్రధాన చాలు నాగభూషణం తదితరులు ఉన్నారు

No comments:

Post a Comment