Thursday 29 February 2024

చిలి సముద్ర జలాల్లో నడిచే చేప

 చిలి కోస్తా తీరంలోని సముద్ర జలాల్లో అత్యంత అరుదైన జాతికి చెందిన నడిచే చేప కెమెరా కంటికి చిక్కింది రెండు కాళ్లు రెండు చేతులతో నడుస్తున్న ఈ చేపను సముద్ర పరిశోధకులు గుర్తించారు అంతర్జాతీయ సైంటిస్టుల బృందం ఒకటి చిలి కోస్తా తీరం వెంబడి సముద్ర లోతుల్ని అన్వేషిస్తుండగా 100కు పైగా కొత్త జీవజాతులను వారు గుర్తించాలని వైస్ ఆఫ్ అమెరికా తాజాగా తెలిపింది. సముద్రంలో అత్యంత లోతైన ప్రాంతాలలో ఇవి ఆవాసాన్ని ఏర్పరచుకుంటాయి ఇందులో నడిచే చేపలు కొన్ని దశాబ్దాలకు ఒకమారు మనకు కనిపిస్తుంటాయి రోబోలను ఉపయోగించి విస్తృతమైన సముద్రతీరా భూభాగాన్ని అన్వేషిస్తుండగా వీటిని సైంటిస్టుల బృందం గుర్తించింది నాలుగు కొత్త సముద్ర పర్వతాలను కూడా కనుగొన్నాము అని ఓషియన్ ఇన్స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీర్మాని చెప్పారు


No comments:

Post a Comment