అకాల మరణముప్పు పెరిగే ప్రమాదం తాజా అధ్యయనం హెచ్చరిక
తరచూ అల్ట్రా ప్రాసెసింగ్ ఫుల్ తీసుకుంటే క్యాన్సర్ గుండే ఊపిరితిత్తుల వ్యాధులతో పాటు 32 వ్యాధుల బారిన పడే ముప్పు ఉన్నదని బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ప్రచురితమైన తాజా అధ్యయనం హెచ్చరించింది అంతేకాకుండా దీనివల్ల మానసిక అనారోగ్యం అకాల మరణం ఉప్పు కూడా పెరిగే ప్రమాదం ఉన్నదని తెలిపింది పరిశ్రమలలో తయారయ్యే అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ లో విటమిన్లు పీచు తక్కువగా చక్కెర ఉప్పు ఎక్కువగా ఉంటాయని ఈ అధ్యయనంలో పాల్గొన్న ఆస్ట్రేలియా యుఎస్ ఫ్రాన్స్ ఐర్లాండ్ శాస్త్రవేత్తలు తెలిపారు అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల వల్ల కలిగే మరణము ఉప్పు 50% పెరుగుతుందని సాక్షాధారాలతో నిరూపించారు ఈ అధ్యాయంలో కోటి మంది నుంచి వివరాలు సేకరించి విశ్లేషించారు అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ వల్ల డిప్రెషన్ పెరిగే అవకాశం 22% ఎక్కువ అని తేల్చారు ఈ నేపథ్యంలో ప్రజా రోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వాలు అత్యవసరంగా తగిన చర్యలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు కోరారు అల్ట్రా ప్రాసెస్ ప్యాకెట్ల మీద వాటిలో అధిక పరిమాణంలో చక్కెరలు కొవ్వులు ఉన్నాయని ముద్రించడం ప్రచారం అమ్మకాలు నిషేధించడం ఫుడ్ కన్నా ప్రాసెస్ చేయని లేదా తక్కువ ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు తక్కువ ధరలకు లభ్యమయ్యేలా చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాలని డియాకిన్ యూనివర్సిటీ రీసెర్చ్ ఫెలో మెలిస్సా ఎం లానే సూచించారు
No comments:
Post a Comment