Monday, 26 February 2024

లోకో పైలట్లు లేకుండానే 70 కిలోమీటర్లు దూసుకెళ్లిన రైలు

 లోకో పైలట్లు లేకుండానే ఒక గూడ్స్ రైలు 70 కిలోమీటర్లు పరుగులు తీసింది ఆదివారం ఉదయం 7:25 నిమిషాల నుంచి 9 గంటల మధ్య జరిగిన ఈ సంఘటనపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు డ్రైవర్లు లేకుండా రైలు 70 కిలోమీటర్లు ప్రయాణించిన ఇలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు 53 వేగన్లతో చిప్ స్టోన్స్ ను మోసుకొని జమ్మూ నుంచి పంజాబ్ వైపు రైలు బయలుదేరింది డ్రైవర్ చేంజ్ కోసం జమ్మూలోని కథ రైల్వే స్టేషన్లో రైలు నిలిపారు ఆ ప్రదేశం కొంత వాలుగా ఉండడంతో తర్వాత కాసేపటికి రైలు నెమ్మదిగా కదులుతూ ముందుకు దూసుకెళ్లింది ఆ సమయంలో రైలులోకో పైలట్ అసిస్టెంట్ లోకో పైలట్ ఎవరూ లేరని అధికారులు తెలిపారు నెమ్మదిగా కదిలిన రైలు ఆ తర్వాత వేగం పుంజుకుంది చివరికి పంజాబ్ లోని ఉంచి బస్సు రైల్వే స్టేషన్లో ఆగింది ఈ ఘటనకు గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తునకు ఆదేశించినట్లు జమ్ము డివిజనల్ ట్రాఫిక్ మేనేజర్ తెలిపారు

No comments:

Post a Comment