Thursday 29 February 2024

ఒత్తిడి తగ్గించే కాఫీ

 కాఫీ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అవి ఏమిటంటే 

కాఫీ తాగడం వల్ల మెరిసే మొఖం మీ సొంతమవుతుంది. మృదుత్వం వస్తుంది .చర్మంలోని కణజాలాలను మెరుగుపరిచే లక్షణాలు కాపీలోని కెఫీన్ కు ఉంది .చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. చర్మం లో ఫ్లెక్స్ బిలిటిని తీసుకొస్తుంది.

కాఫీ అనేది డైయూరిటీక్ పానీయము. ఇది తాగితే శరీరంలోని విష పదార్థాలన్నీ తొలగిపోతాయి. పొట్ట శుభ్రంగా ఉంటుంది.

ఊబకాయం తగ్గించే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా బ్లాక్ కాఫీ తాగడం వలన శరీరంలోని కొవ్వు పదార్థాలు తొలగిపోతాయి. ఈ విధంగా బరువును తగ్గించే గుణం కాఫీకి ఉందన్నమాట.

అలసట ఉండడం, విశ్రాంతి లేకుండా ఉండేవారు కాఫీ తాగితే అలసట కనపడదు. కాస్త చురుగ్గా అనిపిస్తుంది

కాఫీ గింజలలో ఫ్రీ రాడికల్స్ ఉంటాయి. దీనివలన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స వలన చర్మంలో ముడతలు వలయాలు రావు.

కాఫీ తాగడం అంటే ఒత్తిడిని తగ్గించుకోవడమే. కాస్త కాఫీ తాగగానే వెంటనే ఒంట్లో చురుకు వస్తుంది. కాఫీలో ఉత్తేజపరిచే లక్షణం ఉంది.

కాస్త తలనొప్పిగా ఉంటే కాఫీ తాగితే సరిపోతుంది అంటారు ఇది నిజమే. కాఫీ వల్ల రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. ముఖ్యంగా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి అలవడుతుంది..

No comments:

Post a Comment