Monday, 26 February 2024

మసాలాలతో క్యాన్సర్ కు వైద్యం

 మద్రాస్ ఐఐటీకి దక్కిన పేటెెంటు జంతువులపై ప్రయోగాలు సక్సెస్ త్వరలోనే మనుషులపై ట్రైల్స్ 2028 నాటికి మార్కెట్లోకి ఔషధం

ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధిని భారతీయులు వంటింట్లో నిత్యము ఉపయోగించే మసాలా దినుసులతో నయం చేసే విధానాన్ని మద్రాస్ ఐఐటీ పరిశోధకులు ఆవిష్కరించారు దీనిపై తాజాగా పేటెంట్ కూడా పొందారు ఈ ఔషధంపై క్లినికల్ ట్రైయాల్స్ నిర్వహించి 2028 నాటికి మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఐఐటి మద్రాస్ లోని కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ ఆర్ నాగరాజు అని తెలిపారు ఊపిరితిత్తులు రొమ్ము పెద్దపేగు గర్భాశయ నోటి థైరాయిడ్ క్యాన్సర్లను మసాలాల నుంచి సేకరించిన నానో మెడిసిన్ తో నయం చేయవచ్చని ఐఐటి మద్రాస్ పరిశోధకులు నిరూపించారు ఈ ఔషధంతో క్యాన్సర్ కణాల చుట్టూ ఉండే ఆరోగ్యకరమైన కణాలకు ఎలాంటి ముప్పు ఉండదని తెలిపారు జంతువులపై ఔషధంతో చేసిన ప్రయోగాలు సానుకూల ఫలితాలు ఇచ్చాయి త్వరలోనే మనుషులపై క్లినికల్ ట్రైల్స్ చేపట్టనున్నారు ప్రస్తుతం తక్కువ ఖర్చుతో ఎలా ఉత్పత్తి చేయాలన్న దానిపై దృష్టి పెట్టినట్లు నాగరాజున్ తెలి పారు

No comments:

Post a Comment