USEFUL NOTICES లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
USEFUL NOTICES లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, ఫిబ్రవరి 2026, బుధవారం

వ్యాపారుల కోసం బిల్డ్..బోయింగ్ ఆఫర్..

 అప్లికేషన్లు కోరిన బోయింగ్..

 విమానాల తయారీ సంస్థ  బోయింగ్ తన యూనివర్సిటీ ఇన్నోవేషన్ లీడర్షిప్ డెవలప్మెంట్ /బిల్డ్  ప్రోగ్రాం 5 ఎడిషన్ కొరకు అప్లికేషన్లను ఆహ్వానిస్తోంది.

భారత విద్యార్థులు మరియు వర్ధమాన పారిశ్రామికవేత్తల వినూత్న ఆలోచనలను వ్యాపారంగా మార్చడమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. 

2019లో ప్రారంభమైన బిల్డ్ ప్రోగ్రామ్ ద్వారా ఇప్పటికే వేలాదిమంది గ్రాడ్యుయేట్లు , స్టార్ట్ అప్ లు ప్రయోజనం పొందాయి.. 

అర్హత..

ఏరో స్పేస్ ,టెక్నాలజీ, డిఫెన్స్ ,సస్టెనేబిలిటీ, సోషల్ ఇంపాక్ట్ రంగాలలో వినూత్న ఆలోచన లు ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 

ప్రయోజనం ఏమిటి?

ఎంపికైన వారికి శిక్షణ ఇస్తారు .విజేతలకు తమ ఆలోచనలను అభివృద్ధి చేసుకోవడానికి పది లక్షల రూపాయల గ్రాంట్ అందజేస్తారని బోయింగ్ తెలిపింది. ఔత్సాహిక అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని ప్రయోజనం పొందాలని కోరింది.

29, మార్చి 2024, శుక్రవారం

ఏప్రిల్ లో వచ్చే మార్పులు ఇవే

 ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్థిక సంబంధ అంశాల్లో పలుమార్పులు జరగనున్నాయి క్రెడిట్ కార్డుల వినియోగం మొదలు జాతీయ పెన్షన్ పథకం వరకు ఏప్రిల్ లో పలు నిబంధనలు మారబోతున్నాయి

ఏప్రిల్ ఒకటి నుంచి అన్ని జీవిత ఆరోగ్య జనరల్ బీమా పాలసీలను డిజిటల్ చేయాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది పెరుగుతున్న ఆన్లైన్ మోసాల నేపథ్యంలో జాతీయ పెన్షన్ పథకం అకౌంట్లకు మరింత భద్రత కల్పించేందుకు ఏప్రిల్ ఒకటి నుంచి 2 ఫ్యాక్టర్ ఆధార్ అదెంటిఫికేషన్ చేరుస్తోంది

పలు డెబిట్ కార్డులపై వార్షిక మెయింటెనెన్స్ చార్జీలను 75 రూపాయల వరకు పెంచుతున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది విదేశీ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లో ఏప్రిల్ ఒకటి నుంచి పెట్టుబడులను నిలిపివేయాలని అసెట్ మేనేజర్లను సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ ఆదేశించింది ఏప్రిల్ ఒకటి నుంచి ఓలా మనీ ని పూర్తిగా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ గా మారుస్తున్నట్లు ఓలా ప్రకటించింది గరిష్టంగా పదివేల రూపాయల నెలవారి లోడ్ లిమిట్ తో సేవలు అందించనున్నట్లు తెలిపింది ఉచితంగా ఎయిర్పోర్ట్ లాంగ్ వినియోగించుకోవడానికి సంబంధించి క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఐసిఐసిఐ బ్యాంకు ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త నిబంధనలను అమలు చేయనున్నది యాక్సిస్ బ్యాంకు మాత్రం డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజులను వినియోగించుకోవడానికి ముందు త్రైమాసికంలో క్రెడిట్ కార్డు నుంచి కనీసం  రూపాయలు 50,000 వెచ్చించాలని తెలిపింది

ఎస్ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగదారులు ఒక త్రైమాసికంలో కనీసం 10,000 రూపాయలు క్రెడిట్ కార్డులో వెచ్చిస్తే తర్వాతి త్రైమాసికంలో ఉచితంగా డొమెస్టిక్ లంజలు వినియోగించుకోవచ్చని తెలిపింది ఏప్రిల్ ఒకటి నుంచి క్రెడిట్ కార్డుల రివార్డ్ పాయింట్స్ లో ఎస్బిఐ కీలక మార్పులు చేయనున్నది ఎస్బిఐ ఆరం ఎలైట్ ఎలైట్ అడ్వాంటేజ్ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డులు వాడుతున్న వారు క్రెడిట్ కార్డు నుంచి చేసే అద్ద చెల్లింపులకు రివార్డ్ పాయింట్స్ ఉండవు ఏప్రిల్ ఒకటిన కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో ఆ ఒక్క రోజున 2000 రూపాయల నోట్లు మార్చుకునే కేంద్రాలు పనిచేయవని ఆర్బిఐ తెలిపింది

షుగర్ ముప్పును పక్కాగా గుర్తించవచ్చు

 వన్ అవర్ ప్లాస్మా గ్లూకోజ్ పరీక్షతో నిర్ధారణ అంతర్జాతీయ డయాబెటిస్ ఫెడరేషన్ సిఫారసు

మారిన జీవనశైలి ఆహార పలవాట్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా మధుమేహ బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది ఒక అధ్యయనం ప్రకారం మన దేశ జనాభాలో 11.4% అంటే 10.1 కోట్ల మంది మధుమేహ బాధితులు ఉన్నారు దేశ జనాభాలో 15.3% అంటే 13.6 కోట్ల మంది ఫ్రీ డయాబెటిక్ దశలో ఉన్నారు. ఫ్రీ డయాబెటిక్ దశలో ఉన్నవారికి మధుమేహం ముప్పు ఎక్కువగా ఉంటుంది వెంటనే అప్రమత్తమై జీవనశైలి ఆహారంలో మార్పులు చేసుకోకపోతే మధుమేహం బారిన పడతారని లెక్క అయితే ఫ్రీ డయాబెటిక్ స్టేజిలో ఉన్న వారిని కచ్చితంగా గుర్తించడం ముఖ్యం ఇన్దుకుగా ను వన్ అవర్ ప్లాస్మా గ్లూకోజ్ పరీక్ష 1 hpg ను ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ సిఫారసు చేసింది ఈ పరీక్ష ద్వారా అత్యంత ఖచ్చితత్వంతో ఎవరికి మధుమేహం ముప్పు ఉందో గుర్తించవచ్చు అని చెబుతోంది ఐ డి ఎఫ్ అనేది ప్రపంచవ్యాప్తంగా 240 కి పైగా మధుమేహ సంఘాలతో కూడిన సంస్థ ఇది మధుమేహానికి సంబంధించి వివిధ మార్గదర్శకాలను జారీ చేస్తుంటుంది సాధారణంగా ఫ్రీ డయాబెటిక్ దశను 75 గ్రాముల నోటి గ్లూకోజు టాలరెన్స్ లో రెండు గంటల ప్లాస్మా గ్లూకోజ్ పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు కానీ ఖచ్చితమైన ఫలితం కోసం మధుమేహం ముప్పు ఉన్నవారు రాత్రిపూట ఉపవాసం ఉన్న తర్వాత 75 గ్రాముల వన్ అవర్ ప్లాస్మా గ్లూకోజ్ పరీక్ష చేయించుకోవాలని ఐడిఎఫ్ చెబుతోంది వన్ అవర్ ప్లాస్మా గ్లూకోజ్ విలువ 155 mg/dl కంటే ఎక్కువ ఉంటే ప్రీ డయాబెటిస్ దశలో ఉన్నట్లు పరిగణిస్తారు.209mg/dl లేదా అంత కంటే ఎక్కువ ఉంటే టైప్ 2 మధుమేహం ఉన్నట్లు లెక్క..

డి ఓ టి పేరుతో వచ్చే కాల్స్ తో జాగ్రత్త

 కేంద్ర టెలి కమ్యూనికేషన్ శాఖ పేరుతో వచ్చే కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఆ శాఖ హెచ్చరించింది ఈ మేరకు పలు సూచనలు చేసింది మొబైల్ నెంబర్లు కనెక్షన్లు తొలగిస్తామని మీ నెంబర్ కొన్ని చట్ట విరుద్ధ కార్యకలాపాలలో దుర్వినియోగం అయ్యిందని తమ శాఖ అధికారుల నుంచి వచ్చినట్లు చెప్పి బెదిరింపు కావాల్సిన నమ్మవద్దని సూచించింది విదేశీ మొబైల్ నెంబర్లతో ప్రెస్ 92 తో మొదలయ్యేలాంటి వాట్సాప్ కాల్స్ చేసి ప్రభుత్వ అధికారుల పేర్లతో ఎవరైనా బెదిరించిన నమ్మవద్దని చెప్పింది తమ శాఖ తరఫున ఎవరు అలాంటి ఫోన్ కాల్స్ చేయాలని స్పష్టం చేసింది

అరిటాకులో భోజనం ఎందుకు చేయాలి

 అరిటాకులో భోజనం చేయడం ఒకప్పటి అలవాటు రోజు కుదరకపోయినా కనీసం పండుగలకు పబ్బాలకు తినేవారు ఈ పద్ధతి నీటికి కొనసాగుతోంది సంప్రదాయ వైద్యంలో అరిటాకు ఎంత ప్రాధాన్యత ఉందో తెలిస్తే అందులో తినాలని ఎందుకు సూచిస్తారో తెలుస్తుంది

అరిటాకులో ఉండే ఆంటీ యాక్సిడెంట్స్ వల్ల జలుబు దగ్గు లాంటి వైరల్ సమస్యలను శరీరం సమర్థంగా ఎదుర్కోగలదు కడిగిన అరిటాకుతో గాయాన్ని చుడితే అందులోనే ఔషధ గుణాల వల్ల గాయం త్వరగా మానుతుంది అరిటాకుల రసాన్ని జుట్టుకు రాసుకుంటే చుండ్రు తెల్ల వెంట్రుకలు లాంటి సమస్యలు దూరం అవుతాయట వీటిలో ఉండే రూటిన్ అనే పోషకం వల్ల దయాబెట్టేసి నియంత్రణలో ఉంటుంది అలాగే శరీరంలోని మాల్టోజ్ అనే ఒక రకం చక్కెరను నియంత్రించి షుగర్ నిలువలు పెరగకుండా చేస్తుంది. అరిటాకులోని లెక్ టిన్ అనే రసాయనం రోగనిరోధక శక్తిని పెంచే టి సేల్స్ పెంపునకు సహాయపడుతుంది అరిటాకులో ఆహారం తీసుకునేటప్పుడు దాని నుంచి వచ్చే సువాసన ఆకలిని కలిగిస్తుందట అందులో చుట్టిన ఆహార పదార్థాలు ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి

మళ్లీ యూనివర్సిటీలకు ఫార్టీ ప్లస్ వయ స్కూలు

 నైపుణ్యాల పెంపునకు సింగపూర్ నిర్ణయం

కృత్రిమ మేద రాకతో అన్ని రంగాలలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి అందుకు తగ్గట్లుగా నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు తమ దేశ ప్రజలను సింగపూర్ మళ్లీ యూనివర్సిటీల బాట పట్టిస్తుంది ఇందుకోసం పూర్తి కాల డిప్లమా కోరుస్ రూపొందించింది 40 ఏళ్ల పైబడిన వారు ఈ కోర్సులు చదవడానికి 90% ఫీజు రాయితీ కూడా అందిస్తోంది ప్రస్తుతం నలభై ఏళ్ల పైబడిన ఉద్యోగులు తాము 20 ఏళ్ల క్రితం చదువుకున్న చదువులకు ఇప్పటి చదువులకు ఎంతో మార్పు ఉంటుందని ఆ దేశ పార్లమెంట్ ఎంపీ టాన్ ఊ మేంగ్  తెలిపారు.అనుభవజ్ఞులు అయిన ఉద్యోగులు తమ జీవితా అనుభవాలను జీవన నైపుణ్యాలను తరగతి గదిలోకి తీసుకొస్తారు. అలాగే యువ విద్యార్థులతో కలిసి వారు కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటారు అని మెంగ్ అభిప్రాయపడ్డారు

కాచిన నూనెలతో మెదడుకు ముప్పు

 క్యాన్సర్ కాలేయ వ్యాధులకు దారి తీసే ప్రమాదం తాజా అధ్యయనంలో వెల్లడి

కాచిన నూనెలతో మళ్ళీ వంటలకు వినియోగిస్తే మెదడుకు ముప్పు తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలేయ క్యాన్సర్ తో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీసే అవకాశం ఉన్నదని స్పష్టం చేశారు ఇటీవల నిర్వహించిన అమెరికన్ సొసైటీ ఫర్ బయో కెమిస్ట్రీ అండ్ మాలిక్యులర్ బయాలజీ వార్షిక సమావేశంలో ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదికను వెల్లడించారు ఈ పరిశోధనలో నూనెకు మెదడు ఆరోగ్యానికి మధ్య ఉన్న సమస్యల గురించి వెళ్లడైంది ఎలుకలపై పరిశోధనలు నిర్వహించినట్లు వారు తమ నివేదికలో వెల్లడించారు కొన్ని ఎలుకలకు సాధారణ ఆహారం ఇవ్వగా మరికొన్నిటికీ కాచిన నూనెతో చేసిన ఆహారం ఇచ్చారు ఈ రెండింటిని పోల్చి చూస్తే కాచిన నూనెతో చేసిన ఆహారం తిన్న ఎలుకల్లో మెదడు అనారోగ్య ముప్పుని ఎదుర్కొన్నాయని పరిశోధకులు తెలిపారు కాచిన నూనెతో చేసిన వంటల వినియోగంతో శారీరక సమతుల్యత దెబ్బతింటుందని గుర్తించారు కీలకమైన జీర్ణ వ్యవస్థ కాలయాన్ని దెబ్బతీస్తుందని తేలింది ఈ నూనె కారణంగా క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని పలువురు ఆరోగ్యాన్ని పనులు హెచ్చరిస్తున్నారు ఇది ఫ్రీ రాడికల్స్ నొప్పి పెంచుతుందని దీనివల్ల దేహంలో వాపు ఏర్పడి ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని పేర్కొంటున్నారు ఇప్పుడు తాజా పరిశోధన కూడా వాటిని నిరూపిస్తుందని పరిశోధకులు వెల్లడించారు పదేపదే వేడి చేసిన నూనెలతో చేసిన వంటలతో మనిషి శరీరంలో కొలెస్ట్రాల స్థాయిలో పెరుగుతాయని దీర్ఘకాలిక రోగాలు వేధిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు ఈ ప్రమాదాలను తగ్గించుకో వడానికి ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు యాంటీ ఆక్సిడెంట్లు ప్రోబయటిక్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని వారు కోరుకుంటున్నారు

వన్ కార్డ్ బిజినెస్ సొల్యూషన్స్ డిస్కౌంట్ కార్డ్స్ అందజేత

 కామారెడ్డి జిల్లా కేంద్రంలో సాందీపని డిగ్రీ కళాశాలలో గురువారం వన్ కార్డ్ బిజినెస్ సొల్యూషన్ ఆధ్వర్యంలో స్పర్శ స్కిన్ హాస్పిటల్ నిమ్మాస్ డెంటల్ అఖిల హాస్పిటల్ సహకారంతో మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో 300 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారు పలు ఆసుపత్రుల్లో ఓపి మెడికల్ ల్యాబ్లో వైద్య సేవలకు సంబంధించిన డిస్కౌంట్ కార్డులను విద్యార్థులకు అందజేశారు కార్యక్రమంలో సాందీపానికి విద్యాసంస్థల డైరెక్టర్ హరీష్మరణ్రెడ్డి అకాడమిక్ ప్రిన్సిపల్ మనోజ్ కుమార్ వైద్యులు సందీప్ కుమార్ పుట్ట మల్లికార్జున్ పుట్ట భవాని అభిషేక్ రెడ్డి ప్రతినిధులు రవి కిషోర్ రమ్య శ్రావణి సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు



గృహాల్లో ఉపయోగించే రసాయనాలు ఎలా తయారు చేసుకోవాలి

 ఆర్ట్స్ కళాశాలలో వర్క్ షాప్

నిత్యం గృహాలలో ఉపయోగించే డిటర్జెంట్ పౌడర్ లిక్విడ్ సోప్ ఫ్లోర్ క్లీనర్స్ ఫినాయిల్ హెర్బల్ పౌడర్ నొప్పి నివారణ మందులను తయారు చేసుకోవడం ద్వారా విద్యార్థులు స్వయం ఉపాధి పొందవచ్చని సోర్స్ పర్సన్ ఎం జయంతి అన్నారు కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ఆధ్వర్యంలో ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు హాజరైన జయంతి విద్యార్థులు బహుముఖ నైపుణ్యాలు కలిగి ఉండాలన్నారు ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ మాట్లాడుతూ కెమిస్ట్రీ విద్యార్థులకు రసాయనాలపై అవగాహన ఉన్నందున గృహాల్లో నిత్యం ఉపయోగించే వివిధ ఉత్పత్తులను తయారు చేసి స్థానికంగా మార్కెటింగ్ చేయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చన్నారు కళాశాల తరఫున పూర్తి సహకారం అందిస్తామన్నారు వర్క్ షాప్ లో వైస్ ప్రిన్సిపాల్ కిష్టయ్య కెమిస్ట్రీ అధ్యాపకులు శారద సమన్వయకర్తలు చంద్రకాంత్ శంకరయ్య శ్రీనివాస్ శ్రీలత జుబేరియా రామస్వామి శ్రీనివాసరావు రాజేందర్ స్వాతి సుచరణ్ మానస మరకలు మహిళా గురుకుల డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు మీనా విద్యార్థులు పాల్గొన్నారు



మానసిక రుగ్మతలకు చికిత్స అవసరం..14416

 


అతి కోపం నిరాశ నిస్ స్పృహ ఆత్మహత్య ప్రేరేపిత ఆలోచనలను అధిగమించడం కోసం సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి వైద్య సలహాలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా ప్రభుత్వ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ రమణ పిలుపునిచ్చారు బుధవారం రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మానసిక వ్యాధుగ్రస్తులకు చికిత్స అవగాహన కల్పించారు మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రమణ మాట్లాడుతూ మానసిక సమస్యలున్న వ్యాధిగ్రస్తులు చికిత్స తీసుకోవాలని వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు మతిమరుపు నిద్రలేమి అతని గ్రాఫిక్స్ అతికోపము ఆత్మహత్య ప్రేరేపిత ఆలోచనలు అధిగమించాల్సిన తీరు ఆల్కహాల్ సంబంధిత వాటిని మాన్పించుటకు వైద్య సలహాలు తీసుకోవాలన్నారు ఒంటరితనం భ్రమల్లో గడపకుండా ఉన్నవి లేనట్లు లేని ఉన్నట్లు ఊహించుకోవడం లాంటి మానసిక అనారోగ్యంతో ఉన్నవారికి చికిత్స అందిస్తామని డాక్టర్ రమణ తెలిపారు జిల్లా మానసిక ఆరోగ్య సామాజిక కార్యకర్త డాక్టర్ రాహుల్ కుమార్ మాట్లాడుతూ జాతి ఆరోగ్య మిషన్ ద్వారా జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం నిర్వహిస్తున్నామని అవసరమయ్యే వ్యాధిగ్రస్తులకు చికిత్సతో పాటు కౌన్సిలింగ్ ఉంటుందని వ్యాధిగ్రస్తులు మొహమాటం లేకుండా వారికి మానసిక సమస్యలు తలెత్తితే నేరుగా వైద్యులను సంప్రదించాలన్నార

ఉచిత టోల్ ఫ్రీ నెంబర్ 14416 నీ సంప్రదించి మానసిక వైద్య సలహాలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారి సురేష్ హెల్త్ ఎడ్యుకేటర్ భీమ్ సూపర్వైజర్ జానకి ఫార్మసిస్ట్ రాజు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు

28, మార్చి 2024, గురువారం

దేవునిపల్లి కి చెందిన దేవల సంజయ్ అదృశ్యం

 కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవుని పల్లికి చెందిన దేవల సంజయ్ అదృశ్యమైనట్లు పట్టణ ఎస్హెచ్ఓ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు గురువారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సంజయ్ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికారు సంజయ్ ఆచూకీ లభించకపోవడంతో అతడి భార్య శ్రీలత పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు ఇటీవల ఇంటిని నిర్మించిన సంజయ్ కు అప్పులు పెరిగినట్లు తెలిసింది



వృద్ధుడి అదృశ్యం

 కామారెడ్డి మండలం లింగాయపల్లి కి చెందిన తొట్ట భూమయ్య 70 సంవత్సరాలు అదృష్టమైనట్లు దేవునిపల్లి ఎస్సై రాజు గురువారం తెలిపారు ఈనెల 11న ఇంటి నుంచి బయటకు వెళ్ళిన భూమయ్య ఇంటికి తిరిగి రాలేదు. పలుచోట్ల వెతికిన రాజకీయ లభించకపోవడంతో భూమయ్య కూతురు మమతా పోలీసులకు ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాము ఎస్సై రాజు తెలిపారు



నిజామాబాద్ నగరానికి పుంగనూరు ఆవులు

 


నిజామాబాద్ నగరంలోని మంచాల శంకరయ్య గుప్తా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ పుంగనూరు ఆవులను కొనుగోలు చేసి తన స్వగృహానికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా మంచాల జ్ఞానేందర్ మాట్లాడుతూ నేటి కాలంలో కుక్కలు పిల్లలను పెంచే కన్నా ప్రతి ఒక్కరు ఇలాంటి ఆవులను పెంచాలని ఆయన సూచించారు ఈ ఆవులు కేవలం రెండు అడుగుల ఎత్తు ఉండడం వలన చిన్న చిన్న ఇండ్లలో కూడా సంతోషంగా పెంచుకోవచ్చు అని ఆయన తెలిపారు ఈ ఆవులను చూడడానికి పలువురు వారి ఇంటికి రావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మంచాల శ్రీ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు

మంచాల శంకరయ్య గుప్త చారిటబుల్ ట్రస్ట్,నిజామాబాద్..


27, మార్చి 2024, బుధవారం

గర్భాశయ క్యాన్సర్ ను పసిగట్టే స్మార్ట్ స్కోప్

 సర్వైకల్ క్యాన్సర్ ను ముందుగానే పసికట్టే సంస్థ స్మార్ట్ స్కోప్ అనే డిజిటల్ డివైస్ ను రూపొందించింది పూణేలోని పెరివింకిల్ టెక్నాలజీస

మహిళలకు ఎక్కువగా వచ్చే క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని పసిగట్టడంలో స్మార్ట్ స్కోప్ కీలకపాత్ర పోషిస్తుంది యూఎస్ యూకే లలో పని చేసిన వీణ మోక్తాలి ఆమె భర్త కౌస్తుబు నాయకులు మన దేశానికి వచ్చి పూణే కేంద్రంగా పెరివింకిల్ టెక్నాలజీకి శ్రీకారం చుట్టారు ఈ కంపెనీ నుంచి వచ్చిన స్మార్ట్ స్కోప్ డిజిటల్ డివైస్ సులభంగా ఉపయోగించేలా ఉంటుంది ప్రస్తుతం ఉన్న సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వద్ద పద్ధతులు సమయం తీసుకుంటున్నాయి ఈ సౌకర్యాలు పెద్ద నకర నగరాల్లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఫలితంగా ఎక్కువ మంది మహిళలు స్క్రీనింగ్ చేయించుకోలేకపోతున్నారు అంటున్నారు వీణ ఈ నేపథ్యంలో స్మార్ట్ స్కోప్ అనేది చిన్న ప్రైవేటు క్లినిక్ నర్సింగ్ హోమ్స్ మున్సిపల్ డిస్పెన్సరీలు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ జిల్లా ఆసుపత్రులలో అందుబాటులోకి తీసుకువచ్చారు ఒక బ్యాంకు మేనేజర్ కు గ్రేడ్ 2 దశలో క్యాన్సర్ని గుర్తించడంలో స్మార్ట్ స్కోప్ ఉపయోగపడింది మన దేశంలోని ఆరు రాష్ట్రాలకు చెందిన లక్షమంది ఈ పరికరం సహాయంతో జాగ్రత్త పడ్డారు ఈ డివైస్ నిర్వహణ ఖర్చు తక్కువ కావడం కూడా మరొక సానుకూల అంశము కూలి పనుల వల్ల రోజుల తరబడి ప్రయాణం చేసే టైం గ్రామీణ మహిళలకు ఉండడం లేదు స్మార్ట్ స్కోప్ ద్వారా ఫలితం కోసం ఎక్కువ సమయం ఎదురు చూడాల్సిన అవసరం లేదు అంటుంది వీణ అంతర్జాతీయ మార్కెట్లోకి కూడా విస్తరించాలని లక్ష్యం ఏర్పాటు చేసుకొని ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది వీణ మొక్తాలి



ఆధ్యాత్మిక సమాచారం 27 మార్చి 24

 హనుమాన్ ఆలయానికి విరాళం అందజేత

పిట్ల మండలంలోని అల్లాపూర్ గ్రామ హనుమాన్ ఆలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో గ్రామానికి చెందిన హనుమాన్ సైన్యం ఆధ్వర్యంలో 21 వేల విలువ గల జ్యోతి దీపారాధన హుండీని ఆలయ నిర్వాహకులకు విరాళంగా అందజేశారు అంతకుముందు హనుమాన్ సైన్యం సభ్యులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో హనుమాన్ సైన్యం అధ్యక్షుడు పరువయ్య ఉపాధ్యక్షుడు సాయి సుధీర్ ప్రధాన కార్యదర్శి విటల్ కోశాధికారి శంకర్ సభ్యులు సాయి రెడ్డి సురేంద్రరావు బాలాజీ రావు సాయిరాం సంతోష్ రెడ్డి మహిపాల్ రెడ్డి కాంతరెడ్డి హనుమంత్ రెడ్డి మల్లుగొండ బసేందర్ పండరి రావు తదితరులు పాల్గొన్నారు

30 నుంచి సిద్ధ రామేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

దక్షిణ కాశీగా పేరుందిన బిక్కనూరు సిద్ధరామేశ్వర ఆలయంలోని స్వామివారి బ్రహ్మోత్సవాలను ఈనెల 30 నుంచి ఏప్రిల్ 3 వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఉత్సవ కమిటీ పునర్నిర్మాణ కమిటీ ప్రతినిధులు మంగళవారం తెలిపారు ఈ సందర్భంగా వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు కామారెడ్డి బస్టాండ్ నుంచి ప్రతి గంటకు ఆర్టిసి బస్సులు ఆలయానికి వస్తాయన్నారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరారు

మైలారం గ్రామంలో గల కొచ్చేరి మైసమ్మ ఆలయంలో మంగళవారం భక్తుల సందడి నెలకొన్నది ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారికి భక్తులు కొబ్బరికాయలు కొట్టినవేద్యాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు

పెద్దకూడాప్గల్ మండల కేంద్రంలోని పాప హరేశ్వర ఆలయంలో పురోహితులు శ్రీపతిరావు పంతులు ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీపతిరావు మాట్లాడుతూ శిఖర ప్రతిష్టాపనలో భాగంగా గోవు పూజ అగ్ని ప్రతిష్ట తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించమని చెప్పారు బుధవారం జరగబోయే కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై విజయవంతం చేయాలని కోరారు





సెంచరీ కొట్టాలంటే

 వయసు సెంచరీ కొట్టాలంటే ఏజ్ 50 దాటాక కొన్ని ఆరోగ్య సూత్రాలు తప్పనిసరిగా పాటించాలి. యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు అలవాటు అయిన ఆహార నియమాలే కొనసాగిస్తానంటే 60లోనే ఆసుపత్రి పాలు కావలసి వస్తుంది 70 దాటకుండానే రన్ అవుట్ అయ్యే ప్రమాదము ఉంది 50 ఏళ్లు దాటాక జీర్ణశక్తి కాస్త మందగిస్తుంది శరీర పోషక అవసరాలు మారుతుంటాయి మరి వయసులో ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను దూరంగా ఉంచడం ఎంతైనా మంచిది కానీ ఏమిటంటే

వేపుళ్ళు వద్దు ..

వయసులో హాఫ్ సెంచరీ కొట్టాక రోజువారి ఆహారంలో వేపుల్ల కోసం వేయించుకు తినడం మానేయవలసిందే పండుగకు పబ్బానుకో రుచి చూడొచ్చు కానీ ప్రతిరోజు కరకరలాడే వేపుళ్ళు తింటే ప్రమాదమే వాటిలో ఉండే నూనె శరీరానికి మంచిది కాదు పైగా పొట్టలో కొలెస్ట్రాల్ కూడా పేరుకు పోతుంది అంతగా తినాలి అనుకుంటే ఎయిర్ ప్రైర్ లో గాని ఓవెన్ లో గాని తయారు చేసుకుంటే కాస్త మంచిది

చక్కెరకు చెక్

జ్యూస్ గ్రీన్ టీ బలవర్ధకం లాంటి లేబుల్స్ చూసి అవి ఆరోగ్యవంతమైనవి అనుకొని మోసపోతుంటాము నిజానికి చూడాల్సింది అందులోనే చక్కెర శాతం అవి నడివయసుకు మంచిది కావు చక్కెరకు చెక్క పెడితే కానీ కొలెస్ట్రాలకు కామ పడదు.

చాపల్యం చాలు

50 ఏళ్లు వచ్చేవరకు ఆస్వాదించిన రుచులు చాలు జిహ్వచాపలి అని ఎంత వదులుకుంటే అంత ఆరోగ్యం ప్రజల కోసం ప్యాకేజ్డ్ ఫుడ్ కు అలవాటు పడితే చేటు తప్పదు వీటిలో కనిపించకుండా చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది దీనిని హిడెన్ షుగర్ అంటారు వీటి బదులు తాజా పండ్లు తినడం మంచిది

మందుకు నో

 వయసు పెరుగుతున్న కొద్దీ మద్యం వల్లే కలిగే దుష్ఫలితాలు పెరుగుతాయి మద్యంతో కాలేయం మీద ఒత్తిడి పెరుగుతుంది 50వ పుట్టినరోజు నాడు డ్రింకింగ్ హ్యాబిట్ కు స్వస్తి పలకండి

ఉప్పు ముప్పు

రోజువారి ఆహారంలో 200300 మిల్లి గ్రాములకు మించి ఉప్పు ఉండకూడదు అన్నది నిపుణుల మాట కానీ మనం అంతకు ఎన్నో రేట్లు లాగించేస్తుంటాము నడివయసులో వచ్చే అధిక రక్తపోటు లాంటి సమస్యలను ఉప్పు తీవ్రతరం చేస్తుంది వీలైనంతవరకు ఉప్పు తగ్గించడం మధ్య అవసరం అని గుర్తించండ

నేటి నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ

 ఉపాధ్యా అర్హత పరీక్ష టెట్ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ బుధవారం నుంచి ప్రారంభం కానున్నది ఆసక్తి ఉన్న అభ్యర్థులు బుధవారం ఉదయం 10 గంటల నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ పరీక్షలు ఆన్లైన్లో జరుగుతాయి సందేహాల నివృత్తికి అభ్యర్థులు 7075701768 మరియు 7075701784 నెంబర్లను సంప్రదించవచ్చ

క్యాన్సర్ రోగుల కోసం హెల్ప్ లైన్ 9355520202

 సెకండ్ ఒపీనియన్ కోరే వారి కోసం ప్రారంభించిన ఆంకాలజిస్టుల టీం ఉచితంగా వైద్యుల కన్సల్టేషన్

క్యాన్సర్ రోగుల కోసం కొంతమంది అహంకాలజిస్టులతో కూడిన బృందం సెకండ్ ఒపీనియన్ హెల్ప్ లైన్ నెంబర్ను ప్రారంభించింది తమ క్యాన్సర్ సమస్యపై రెండో అభిప్రాయం కోరుకునే రోగులు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య 9355520202 నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు ఈ నెంబర్కు కాల్ చేసి క్యాన్సర్ రోగులు డైరెక్ట్ గా నిపుణులైన ఆంకాలజిస్ట్ తో ఉచితంగా మాట్లాడవచ్చు చికిత్స పై చర్చించేందుకు వీడియో కాల్ చేసేందుకు కూడా అవకాశం ఉన్నది క్యాన్సర్ మొత్తం భారత్ క్యాంపెయిన్ లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు క్యాంపెయిన్ హెడ్ డాక్టర్ ఆశిష్ గుప్తా తెలిపారు ప్రాణాంతకమైన క్యాన్సర్ బారిన పడిన రోగులందరికీ సెకండ్ ఒపీనియన్ ను సిఫారసు చేస్తున్నామన్నారు క్యాన్సర్ చికిత్సకు సంబంధించి వివిధ దవాఖానాల్లో వేరువేరుగా ఖర్చవుతుంది అని ఇది కూడా సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి మరో కారణమని ఆశిష్ గుప్తా అన్నారు క్యాన్సర్ కు సంబంధించి భయంకరమైన సవాళ్లను ఎదుర్కొంటున్న వారికి తమ హెల్ప్ లైన్ ఒక విలువైన వనరుగా ఉపయోగపడుతుందని ఖచ్చితమైన సమాచారం అందిస్తుందని పేర్కొన్నారు దేశంలో భారీగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు ఎందుకు సరిపడా సంఖ్యలో ఆరోగ్య సదుపాయాలు వైద్యులు లేని దృష్ట్యా ఈ హెల్ప్ లైన్ నంబర్ ను ఏర్పాటు చేశామని తెలిపారు నీటి కాలంలో క్యాన్సర్ చికిత్సలో నిత్యం కొత్త ఔషధాలు సరికొత్త థెరపీలు వస్తున్నాయని ఇలాంటి సమయంలో వైద్యుల నుంచి సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం అమూల్యమైనదని గుప్తాభిప్రాయపడ్డారు

ఓటీపీ మోసాలకు ఇక చెక్

 ఐఐటి మండి సరికొత్త సాంకేతికత

వన్ టైం పాస్వర్డ్ మోసాలను అరికట్టడం పెద్ద సవాలుగా మారింది సైబర్ నేరగాళ్ల బారిన పడి ఎంతోమంది లక్షలలో పోగొట్టుకుంటున్న కేసులు పెరుగుతున్నాయి సాంకేతిక అంశాలు తెలిసిన టెక్లను కూడా బోల్తా కొట్టించి డబ్బులు కొట్టేస్తున్న ఘటనలు చూస్తున్నాం ఈ మోసాలకు చెక్ పెట్టేందుకు ఐఐటి మండి శాస్త్రవేత్తలు కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నారు పాస్వర్డ్ ఆధార్ నుంచి రక్షణ కల్పించే అడాప్ ఐడి టెక్నాలజీని ఐఐటి మండి ఐఐటి కాన్పూర్ ఆధ్వర్యంలో నెలకొల్పిన డీప్ అల్గారిథమ్స్ కంపెనీ అభివృద్ధి చేసింది అథెంటిఫికేషన్ కోసం రక్షణాత్మక వ్యవస్థలో భాగంగా మల్టీలేయర్ యూజర్ బయోమెట్రిక్ బేస్డ్ బిహేవియర్ పేటర్న్స్ ను వినియోగించనున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు

యువతి అదృశ్యం

 ఎల్లారెడ్డికి చెందిన ముస్కాన్ అనే యువతి అదృశ్యమైనట్లు ఎస్సై మహేష్ తెలిపారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన కుసుమ బేగం కుటుంబం 8 ఏండ్ల క్రితం ఎల్లారెడ్డికి వలస వచ్చి నివాసం ఉంటున్నది ఈ నెల 20వ తేదీన ముస్కాన్ ను తల్లి మందలించింది దీనితో ఆమె ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుందామని ఆచూకీ తెలిసినవారు 8712686160 మరియు 871526078 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ సూచించారు