Wednesday, 27 March 2024

గర్భాశయ క్యాన్సర్ ను పసిగట్టే స్మార్ట్ స్కోప్

 సర్వైకల్ క్యాన్సర్ ను ముందుగానే పసికట్టే సంస్థ స్మార్ట్ స్కోప్ అనే డిజిటల్ డివైస్ ను రూపొందించింది పూణేలోని పెరివింకిల్ టెక్నాలజీస

మహిళలకు ఎక్కువగా వచ్చే క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని పసిగట్టడంలో స్మార్ట్ స్కోప్ కీలకపాత్ర పోషిస్తుంది యూఎస్ యూకే లలో పని చేసిన వీణ మోక్తాలి ఆమె భర్త కౌస్తుబు నాయకులు మన దేశానికి వచ్చి పూణే కేంద్రంగా పెరివింకిల్ టెక్నాలజీకి శ్రీకారం చుట్టారు ఈ కంపెనీ నుంచి వచ్చిన స్మార్ట్ స్కోప్ డిజిటల్ డివైస్ సులభంగా ఉపయోగించేలా ఉంటుంది ప్రస్తుతం ఉన్న సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వద్ద పద్ధతులు సమయం తీసుకుంటున్నాయి ఈ సౌకర్యాలు పెద్ద నకర నగరాల్లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఫలితంగా ఎక్కువ మంది మహిళలు స్క్రీనింగ్ చేయించుకోలేకపోతున్నారు అంటున్నారు వీణ ఈ నేపథ్యంలో స్మార్ట్ స్కోప్ అనేది చిన్న ప్రైవేటు క్లినిక్ నర్సింగ్ హోమ్స్ మున్సిపల్ డిస్పెన్సరీలు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ జిల్లా ఆసుపత్రులలో అందుబాటులోకి తీసుకువచ్చారు ఒక బ్యాంకు మేనేజర్ కు గ్రేడ్ 2 దశలో క్యాన్సర్ని గుర్తించడంలో స్మార్ట్ స్కోప్ ఉపయోగపడింది మన దేశంలోని ఆరు రాష్ట్రాలకు చెందిన లక్షమంది ఈ పరికరం సహాయంతో జాగ్రత్త పడ్డారు ఈ డివైస్ నిర్వహణ ఖర్చు తక్కువ కావడం కూడా మరొక సానుకూల అంశము కూలి పనుల వల్ల రోజుల తరబడి ప్రయాణం చేసే టైం గ్రామీణ మహిళలకు ఉండడం లేదు స్మార్ట్ స్కోప్ ద్వారా ఫలితం కోసం ఎక్కువ సమయం ఎదురు చూడాల్సిన అవసరం లేదు అంటుంది వీణ అంతర్జాతీయ మార్కెట్లోకి కూడా విస్తరించాలని లక్ష్యం ఏర్పాటు చేసుకొని ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది వీణ మొక్తాలి



No comments:

Post a Comment