Wednesday 27 March 2024

ఆధ్యాత్మిక సమాచారం 27 మార్చి 24

 హనుమాన్ ఆలయానికి విరాళం అందజేత

పిట్ల మండలంలోని అల్లాపూర్ గ్రామ హనుమాన్ ఆలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో గ్రామానికి చెందిన హనుమాన్ సైన్యం ఆధ్వర్యంలో 21 వేల విలువ గల జ్యోతి దీపారాధన హుండీని ఆలయ నిర్వాహకులకు విరాళంగా అందజేశారు అంతకుముందు హనుమాన్ సైన్యం సభ్యులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో హనుమాన్ సైన్యం అధ్యక్షుడు పరువయ్య ఉపాధ్యక్షుడు సాయి సుధీర్ ప్రధాన కార్యదర్శి విటల్ కోశాధికారి శంకర్ సభ్యులు సాయి రెడ్డి సురేంద్రరావు బాలాజీ రావు సాయిరాం సంతోష్ రెడ్డి మహిపాల్ రెడ్డి కాంతరెడ్డి హనుమంత్ రెడ్డి మల్లుగొండ బసేందర్ పండరి రావు తదితరులు పాల్గొన్నారు

30 నుంచి సిద్ధ రామేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

దక్షిణ కాశీగా పేరుందిన బిక్కనూరు సిద్ధరామేశ్వర ఆలయంలోని స్వామివారి బ్రహ్మోత్సవాలను ఈనెల 30 నుంచి ఏప్రిల్ 3 వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఉత్సవ కమిటీ పునర్నిర్మాణ కమిటీ ప్రతినిధులు మంగళవారం తెలిపారు ఈ సందర్భంగా వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు కామారెడ్డి బస్టాండ్ నుంచి ప్రతి గంటకు ఆర్టిసి బస్సులు ఆలయానికి వస్తాయన్నారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరారు

మైలారం గ్రామంలో గల కొచ్చేరి మైసమ్మ ఆలయంలో మంగళవారం భక్తుల సందడి నెలకొన్నది ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారికి భక్తులు కొబ్బరికాయలు కొట్టినవేద్యాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు

పెద్దకూడాప్గల్ మండల కేంద్రంలోని పాప హరేశ్వర ఆలయంలో పురోహితులు శ్రీపతిరావు పంతులు ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీపతిరావు మాట్లాడుతూ శిఖర ప్రతిష్టాపనలో భాగంగా గోవు పూజ అగ్ని ప్రతిష్ట తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించమని చెప్పారు బుధవారం జరగబోయే కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై విజయవంతం చేయాలని కోరారు





No comments:

Post a Comment