Monday, 25 March 2024

పెళ్లి కోసం పెట్టుబడి ఎక్కడ

 మనదేశంలో వివాహాలు సాధారణంగా చూస్తే తక్కువ ఖర్చుతో ముగిసేవి కావు మీరు అనుకుంటున్నాట్లు ప్రతినెలా 45 వేల రూపాయల చొప్పున వచ్చే ఆరేళ్ల పాటు ఇన్వెస్ట్ చేసినట్లయితే గననీయమైన మొత్తం సమకూర్తుంది వివాహం లక్ష్యం విషయంలో రాజీ పడలేము అనుకున్న సమయానికి కావాల్సినంత చేతికి అందాల్సిందే వాయిదా వేయడానికి ఉండదు తక్కువ రిస్కు కోరుకునేవారు మధ్యమార్గాన్ని అనుసరించాలి 50 శాతాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీని వల్ల పెట్టుబడికి రెస్క్ ఉండదు మిగిలిన 50 శాతాన్ని వృద్ధి కోసం ఈక్విటీలకు కేటాయించుకోవాలి డెట్ విషయంలో షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ లేదా టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్ను ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీ పెట్టుబడులకు లార్జ్ క్యాప్ ఫండ్స్ లేదా లో కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్ నుంచి ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ అధిక రిస్కు తీసుకునే సామర్థ్యం ఉంటే అప్పుడు కాస్త దూకుడుగా పెట్టుబడిన సాధనాలను ఎంపిక చేసుకోవచ్చు ఆటుపోట్లను తట్టుకునేట్లయితే ఈక్విటీలకు 65% నుంచి 80 శాతాన్ని కేటాయించుకోవచ్చు మిగిలిన మొత్తాన్ని డెట్ సాధనాలకు కేటాయించుకోవాలి బంగారం కోసమే అయితే సార్వభౌమ బంగారం బాండ్లలో ఎస్జీబీలు కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు బంగారం విలువ పెరుగుదలకు తోడు పెట్టుబడి విలువపై ఏటా 2.5% వడ్డీ రేటు లభిస్తుంది ఈ బంగారంతో సోదరి పెళ్లి కోసం కావాల్సిన ఆభరణాలు చేయించవచ్చు

No comments:

Post a Comment