Tuesday, 26 March 2024

ఆధ్యాత్మిక సమాచారం 26 మార్చి 2024

 ఘనంగా మల్లన్న కళ్యాణం లింగంపేట మండలం భవానిపేటలో సోమవారం మల్లికార్జున స్వామి కళ్యాణం యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ప్రత్యేక హోలీ పండుగ సందర్భంగా కేతమ్మ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరిపించారు ఈ సందర్భంగా భక్తులు అగ్నిగుండాల మీదుగా మల్లన్న దేవుని నామస్మరణ చేసుకుంటూ నడిచారు అనంతరం అన్నదానం చేశారు అలాగే ఒగ్గు కళాకారులతో కళాజాత కార్యక్రమం నిర్వహించారు

హోలీ మదన పున్నమి సందర్భంగా సోమవారం కామారెడ్డి లోని స్థానిక హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శారద ఆదిశంకర ఆలయంలో భక్తిశ్రద్ధలతో నవదుర్గ సామూహిక వ్రతం నిర్వహించారు గతంలో పాల్గొన్న మహిళలకు ఆలయ కమిటీ తరఫున పూజా సామాగ్రి అందజేశారు అన్నదానం చేశారు

చండీ మంత్రాలయంలో స్థానిక శ్రీనివాస్ నగర్ ని శ్రీ చండీ మంత్రాలయంలో మదన పున్నమి సందర్భంగా చండీ హోమం నిర్వహించారు అమ్మవారికి విశేష పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు




రాజంపేట సాయిబాబా ఆలయంలో సోమవారం అన్నదానం నిర్వహించారు ప్రతి నెల పౌర్ణమి రోజున ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు అనే కమిటీ సభ్యులు తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చిన్న సీతారాములు బంధం కృష్ణమూర్తి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఘనంగా హోలీ రంగుల కెళ్ళి హోలీ పర్వదినాన్ని జిల్లా ప్రజల సోమవారం ఘనంగా జరుపుకున్నారు రంగులు చదువుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు


గ్రామాల్లో కుస్తీ పోటీలు
జిల్లాలోని పలు గ్రామాలలో హోలీ సందర్భంగా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలను సోమవారం నిర్వహించారు నందిపేట మండలంలోని కంఠంలో కుస్తీ పోటీలు రసవాతారంగా జరిగాయి జిల్లా నుంచి కాకుండా మహారాష్ట్ర నుంచి మల్ల యోధులు కుస్తీ పోటీలకు అధిక సంఖ్యలో తరలివచ్చారు కుస్తీ పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చారు గ్రామ పెద్దలు విజేతలకు నగదు బహుమతి అందజేశారు ప్రతి ఏడాది హోలీ రోజున కుస్తీ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని గ్రామస్తులు తెలిపారు






No comments:

Post a Comment