Monday, 25 March 2024

హనుమాన్ దీక్షను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలి

 


హనుమాన్ దీక్షను తీసుకున్న స్వాములు భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని తోపుట పీఠాధిపతి స్వామి మాధవానంద అన్నారు మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయం ఆయన సందర్శించారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు హనుమాన్ స్వాములను ఉద్దేశించి మాట్లాడారు ప్రతి ఏడాది వేసవికాలంలో హనుమాన్ దీక్ష తీసుకున్న వారు అభివృద్ధి చెందుతారన్నారు దీక్ష తీసుకున్న వారికి ఆశీర్వాదం అందజేశారు




మద్నూర్ మండలంలోని శాఖాపూర్ గేటు వద్ద మైనారిటీలు హనుమాన్ స్వాములకు పండ్లను పంపిణీ చేశారు జుక్కల్ మండలం తిమ్మరాజు కల్లాలి నుంచి మద్నూర్ మండలం సలాబత్ కు ఆంజనేయస్వామి ఆలయానికి పాదయాత్రగా వస్తున్న స్వాములకు కాంగ్రెస్ యువ నాయకులు అజీమ్ పటేల్ ఆధ్వర్యంలో అల్పాహారం కింద పండ్లను పంపిణీ చేశారు దేశ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పడానికి మైనారిటీ సోదరులు హిందూ ముస్లింలు భాయి భాయిగా కొనసాగాలన్నారు మాజీ సర్పంచ్ రమేష్ దేశాయి హనుమాన్ స్వాములకు పంటను పంపిణీ చేసిన మైనారిటీలకు కృతజ్ఞతలు తెలిపారు

No comments:

Post a Comment