Friday, 22 March 2024

క్యూఆర్ కోడ్ తో ట్రైన్ టికెట్ కొనుగోలు

 తొలి దశలో 14 స్టేషన్లోని 31 కౌంటర్లు ఏర్పాటు

రైలలో వెళ్లాలనుకునే వారు టికెట్ల కోసం ఇకనుంచి క్యూ లైన్ లలో నిలబడి నిరీక్షించాల్సిన అవసరం లేదు స్టేషన్లోని జనరల్ బుకింగ్ కౌంటర్లలో ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి నిమిషాల్లో ట్రైన్ టికెట్ కొనుగోలు చేయవచ్చు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తున్న దక్షిణ మధ్య రైల్వే జనరల్ బుకింగ్ కౌంటర్లలో కొత్తగా నగదు రహిత లావాదేవీలను తీసుకువచ్చింది క్యూఆర్ కోడ్ తో టికెట్లు కొనుగోలు చేసే విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది దీని ద్వారా టికెట్ కొనడానికి ప్యాసింజర్లు సరిపడే జిల్లాలను తీసుకువెళ్లే అవసరం ఉండదు. తొలి దశలో సికింద్రాబాద్ డివిజన్ కు చెందిన 14 స్టేషన్లో 31 కౌంటర్లలో ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టారు

తొలి దశలో భాగంగా 14 ముఖ్యమైన రైల్వే స్టేషన్లో క్యూఆర్ కోడ్ అమలు చేస్తున్నారు అందులో సికింద్రాబాద్ కాజీపేట బేగంపేట వరంగల్ మంచిర్యాల లింగంపల్లి హైటెక్ సిటీ జేమ్స్ స్ట్రీట్ మహబూబాబాద్ బెల్లంపల్లి ఫతేనగర్ బ్రిడ్జి సిర్పూర్ కాగజ్నగర్ వికారాబాద్ స్టేషన్లు ఉన్నాయి డిస్ప్లే బోర్డులో బయలుదేరి స్టేషన్ చేరుకొని స్టేషన్ ప్రయాణపు తరగతి వివరాలు పెద్దలు పిల్లల సంఖ్య తెలిపే వివరాలతో పాటు చార్జీలు తెలియజేస్తారు. ప్రయాణికులు చెల్లించవలసిన ఛార్జింగ్ సంబంధించిన క్యూఆర్ కోడ్ కూడా డిస్ప్లే బోర్డుగా కనిపిస్తుంది రైలు వినియోగదారులందరూ సాధారణ టికెట్లను కొనుగోలు చేయడానికి ఈ క్యూఆర్ కోడ్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కోరారు ఈ విధానం పారదర్శకతకు కచ్చితంగా మైలురాయిగా నిలుస్తోందని నగదు చెల్లింపులను ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు

No comments:

Post a Comment