Friday 22 March 2024

ఆధ్యాత్మికతతో మనశ్శాంతి

 ఆధ్యాత్మికత జీవనంతో మనశ్శాంతి కలుగుతుందని ప్రతి ఒక్కరూ దైవచింతలను అలవర్చుకోవాలని మల్లన్న గుట్టకు చెందిన బసవలింగ అవధూత మహారాజా అన్నారు బుధవారం రాత్రి లాడేగా గ్రామంలో ఆయన ప్రవచనం చేశారు నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు మహారాజును వ్రతంపై కూర్చోబెట్టి మంగళహారతులతో పూల వర్షం కురిపిస్తూ ఊరేగింపు చేశారు అవధూత మహారాజ్ మాట్లాడుతూ గురువును తల్లిదండ్రులను పూజించాలన్నారు వ్యసనాలకు బానిసకావద్దని పేర్కొన్నారు యోగాతో ఆరోగ్యం సిద్ధిస్తుందని చెప్పారు

ప్రజలు ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని జుక్కల్ మఠాధిపతి గోపాల్ గోవింద శాస్త్రి మహారాజు అన్నారు పిట్లం మండల కేంద్రంలోని కాళికాదేవి నూతన ఆలయ నిర్మాణం అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా గురువారం ఆలయంలో హోమం పూజలు నిర్వహించారు గోపాల్ మహారాజ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు భక్తి మార్గంలో నడుచుకోవాలని సూచించారు అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు ఉన్నారు



కులాస్పూర్ లో బోనాల పండుగ

మోపాల్ మండలంలోని కులాస్పూర్ గ్రామంలో గురువారం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు బుధవారం గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించారు గత కొన్ని సంవత్సరాల నుంచి గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందని గ్రామ పెద్దలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు వీడిసి గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు

సోమిరియా గాడి తండాలో సేవాలాల్ మాలాధారులకు బిక్ష

ఎల్లారెడ్డి మండలంలోని సోమిరియా గాడి తండాలో సేవాలాల్ మాల ధారణ చేసిన స్వాములకు గురువారం సేవలాల్ మహారాజాలయంలో పంచాయతీ కార్యదర్శి వెంకట రాములు బిక్ష ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సేవాగ్రేడ్ ఆలయ కమిటీ చైర్మన్ గోవింద్ గ్రామ మాజీ ఉపసర్పంచ్ డాన్సింగ్ తండావాసులు నగేష్ తదితరులు పాల్గొన్నారు

మాదాపూర్ లో ఎడ్లబండ్ల ప్రదర్శన

బిబిపేట మండలంలోని మాందాపూర్ గ్రామంలో వనదుర్గ పెద్దమ్మ తల్లి ఐదవ వార్షికోత్సవంలో భాగంగా గురువారం ఎడ్లమండ్ల ప్రదర్శనను తిరుగు బోనాల కార్యక్రమం నిర్వహించినట్లు ముదిరాజ్ సంఘ సభ్యులు తెలిపారు ఐదేళ్లకు ఒకసారి నిర్వహించే ఈ పండుగలు సంప్రదాయాన్ని మరవకుండా బోనాలు బండ్ల ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

బస్వాపూర్ లో కొనసాగుతున్న పెద్దమ్మ జాతర

బిత్తనూరు మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ పెద్దమ్మ జాతర ఆలయ వార్షికోత్సవం కొనసాగుతున్నది జాతరలో భాగంగా గురువారం అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం డప్పు చప్పుళ్ళ నడుము గంగ బోనం ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ మేరకు మహిళలు గంగ బోనంకు హారతులు ఇచ్చే మొక్కలు తెరుచుకున్నారు సాయంత్రం గ్రామదేవతలకు బోనాల ఊరేగింపు కార్యక్రమాన్ని డప్పు చప్పుళ్ళు పోతరాజుల విన్యాసాల నడుమ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు భక్తులు పాల్గొన్నారు




పెద్దమాలయానికి మైక్ సెట్ విరాళము అందజేత

భిక్కనూరు మండలంలోని బస్వాపూర్ పెద్దమ్మ ఆలయానికి గ్రామానికి చెందిన మద్ది నాగరాజు దంపతులు గురువారం మైక్ సెట్ ను వితరణ చేశారు ఈ సందర్భంగా దాత నాగరాజు మాట్లాడుతూ తన తండ్రి బాలరాజు జ్ఞాపకార్థం 16 వేల రూపాయల విలువ కలిగిన మైక్ సెట్ ను అందజేయడం జరిగిందని మునుముందు ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని తెలిపారు అనంతరం ముదిరాజ్ సంఘం సభ్యులు మాట్లాడుతూ నాగరాజుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు


No comments:

Post a Comment