Thursday, 28 March 2024

రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు

 ముస్తాబైన ఇందూరు తిరుమల ఏప్రిల్ 2న శ్రీవారి కల్యాణ మహోత్సవం

నిజామాబాద్ రూరల్ మండలంలోని మోపాల్ మండలంలోని నర్సింగ్ పల్లి లో ఉన్న హిందువులు తిరుమల గోవింద వనమాల క్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబయింది దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభమై ఏప్రిల్ 5 వరకు కొనసాగలు ఉన్నాయి ప్రతి ఏడాది నిర్వహించే బ్రహ్మోత్సవాలలో సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ఏప్రిల్ 2 నా స్వామివారి కల్యాణోత్సవం ఉత్సవ మూర్తులతో పురవీధులలో గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు 5వ తేదీన బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి మా పల్లె చారిటబుల్ ట్రస్ట్ ఆలయ ప్రధాన ధర్మకర్తలు ప్రముఖ నిర్మాత దిల్ రాజు శిరీష్ నర్సింహారెడ్డి విజయసింహారెడ్డి హరీష్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు నిత్యం సినిమా షెడ్యూల్లో బిజీగా ఉండే దిల్ రాజు తన కుటుంబ సభ్యులతో బ్రహ్మోత్సవాల సందర్భంగా వారం రోజులపాటు స్వామి వారి సన్నిధిలో సేవ చేసుకుంటారు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని ఆలయ ప్రధాన ధర్మకర్తలు పేర్కొన్నారు భక్తులు సపరివార సమేతంగా బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు



No comments:

Post a Comment