BE CAREFUL లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
BE CAREFUL లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, ఫిబ్రవరి 2026, గురువారం

కాస్మెటిక్స్ తో క్యాన్సర్ ఎలా వస్తుంది

 



ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి . ప్రతి సంవత్సరం 20 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆరు లక్షలకు పైగా క్యాన్సర్ మరణాలు సంభవిస్తున్నాయి ముఖ్యంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ,గర్భాశయ ,అండాశయా క్యాన్సర్లు అత్యంత ప్రబలంగా కనిపిస్తున్నాయి .చర్మ క్యాన్సర్లు కూడా ఆడవాళ్లను పట్టిపీడిస్తున్నాయి .అయితే మహిళలు ఉపయోగించే అనేక సౌందర్య ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది.

 అమెరికా లాస్ ఏంజెల్స్ లో నిర్వహించిన ఈ సర్వే వివరాలు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లెటర్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ సర్వేలో భాగంగా అమెరికాకు చెందిన 64 మంది మహిళలను ఎంచుకున్నారు. వారు నిత్యం ఉపయోగించే సబ్బులు, లోషన్లు ,షాంపు, కండిషనర్ ,స్కిన్ లైట్నర్, ఐ లైనర్,  ఐలాష్ గ్లూ లాంటి దాదాపు 1143 ఉత్పత్తులను పరిశీలించారు .అందులో 53 శాతం మంది ఫార్మాలిడిహైడ లాంటి క్యాన్సర్ కారకాలను విడుదల చేసే సౌందర్య ఉత్పత్తులను ఉపయోగించినట్టు కనుగొన్నారు. అనేక ఉత్పత్తుల్లో ఫార్మాలిడిహైడ్ను  విరివిగా వాడుతున్నారని, ఇది క్యాన్సర్ కారకమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీని నుంచి విడుదలయ్యే వాయువులు క్యాన్సర్ను కలగజేయడమే కాకుండా శరీరంపై దద్దుర్లు ,జుట్టు,  గోర్లపైన ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. వీటిని అలాగే వాడితే దీర్ఘకాలంలో రొమ్ము క్యాన్సర్ తో పాటు గర్భాశయ, అండాశయం క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు .


యూరోపియన్ యూనియన్ 2009లోనే ఫార్మాలిడిహెడ్ ను కాస్మెటిక్ పదార్థంగా నిషేధించిందని పలువురు గుర్తు చేశారు. అయినా అనేక సౌందర్య ఉత్పత్తుల సంస్థలు ఇష్టారాజ్యంగా వీటిని వాడుతున్నాయని చెబుతున్నారు. అయితే ఆయా ఉత్పత్తుల లేబుల్స్ పై ఫార్మల్ డిహైడ్ గురించిన వివరాలు ప్రత్యక్షంగా ఇవ్వడం లేదని చాలా వరకు దాని రసాయనిక పేర్లను వాడుతున్నారని తెలిపారు. 


కాబట్టి వినియోగదారులు సౌందర్య ఉత్పత్తులను కొనుగోలు చేసే సమయంలో లేబుల్స్ను క్షుణ్ణంగా చదవాలని సూచిస్తున్నారు .ఏ రకమైన ఉత్పత్తులు అనారోగ్యానికి గురిచేస్తాయో తెలుసుకోవడానికి రసాయన శాస్త్రవేత్తలే కావాల్సిన అవసరం లేదని ,కాస్త అవగాహన ఉంటే చాలని అంటున్నారు. అందంగా ఉండాలని ఆరాటపడుతూ లేనిపోని కొత్త రోగాలు కొని తెచ్చుకోకూడదని సలహాయిస్తున్నారు.

29, మార్చి 2024, శుక్రవారం

డి ఓ టి పేరుతో వచ్చే కాల్స్ తో జాగ్రత్త

 కేంద్ర టెలి కమ్యూనికేషన్ శాఖ పేరుతో వచ్చే కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఆ శాఖ హెచ్చరించింది ఈ మేరకు పలు సూచనలు చేసింది మొబైల్ నెంబర్లు కనెక్షన్లు తొలగిస్తామని మీ నెంబర్ కొన్ని చట్ట విరుద్ధ కార్యకలాపాలలో దుర్వినియోగం అయ్యిందని తమ శాఖ అధికారుల నుంచి వచ్చినట్లు చెప్పి బెదిరింపు కావాల్సిన నమ్మవద్దని సూచించింది విదేశీ మొబైల్ నెంబర్లతో ప్రెస్ 92 తో మొదలయ్యేలాంటి వాట్సాప్ కాల్స్ చేసి ప్రభుత్వ అధికారుల పేర్లతో ఎవరైనా బెదిరించిన నమ్మవద్దని చెప్పింది తమ శాఖ తరఫున ఎవరు అలాంటి ఫోన్ కాల్స్ చేయాలని స్పష్టం చేసింది

కాచిన నూనెలతో మెదడుకు ముప్పు

 క్యాన్సర్ కాలేయ వ్యాధులకు దారి తీసే ప్రమాదం తాజా అధ్యయనంలో వెల్లడి

కాచిన నూనెలతో మళ్ళీ వంటలకు వినియోగిస్తే మెదడుకు ముప్పు తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలేయ క్యాన్సర్ తో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీసే అవకాశం ఉన్నదని స్పష్టం చేశారు ఇటీవల నిర్వహించిన అమెరికన్ సొసైటీ ఫర్ బయో కెమిస్ట్రీ అండ్ మాలిక్యులర్ బయాలజీ వార్షిక సమావేశంలో ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదికను వెల్లడించారు ఈ పరిశోధనలో నూనెకు మెదడు ఆరోగ్యానికి మధ్య ఉన్న సమస్యల గురించి వెళ్లడైంది ఎలుకలపై పరిశోధనలు నిర్వహించినట్లు వారు తమ నివేదికలో వెల్లడించారు కొన్ని ఎలుకలకు సాధారణ ఆహారం ఇవ్వగా మరికొన్నిటికీ కాచిన నూనెతో చేసిన ఆహారం ఇచ్చారు ఈ రెండింటిని పోల్చి చూస్తే కాచిన నూనెతో చేసిన ఆహారం తిన్న ఎలుకల్లో మెదడు అనారోగ్య ముప్పుని ఎదుర్కొన్నాయని పరిశోధకులు తెలిపారు కాచిన నూనెతో చేసిన వంటల వినియోగంతో శారీరక సమతుల్యత దెబ్బతింటుందని గుర్తించారు కీలకమైన జీర్ణ వ్యవస్థ కాలయాన్ని దెబ్బతీస్తుందని తేలింది ఈ నూనె కారణంగా క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని పలువురు ఆరోగ్యాన్ని పనులు హెచ్చరిస్తున్నారు ఇది ఫ్రీ రాడికల్స్ నొప్పి పెంచుతుందని దీనివల్ల దేహంలో వాపు ఏర్పడి ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని పేర్కొంటున్నారు ఇప్పుడు తాజా పరిశోధన కూడా వాటిని నిరూపిస్తుందని పరిశోధకులు వెల్లడించారు పదేపదే వేడి చేసిన నూనెలతో చేసిన వంటలతో మనిషి శరీరంలో కొలెస్ట్రాల స్థాయిలో పెరుగుతాయని దీర్ఘకాలిక రోగాలు వేధిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు ఈ ప్రమాదాలను తగ్గించుకో వడానికి ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు యాంటీ ఆక్సిడెంట్లు ప్రోబయటిక్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని వారు కోరుకుంటున్నారు

26, మార్చి 2024, మంగళవారం

అనారోగ్య టెకీలు

 ఐటీ ఉద్యోగులు 61 శాతం మందిలో హై కొలెస్ట్రాల్ 37 శాతం మందిలో ఏదో ఒక దీర్ఘకాలిక రుగ్మత పాతికేళ్లలోపు వారిలో కొవ్వు స్థాయిలో అస్తవ్యస్తం 25 నుంచి 40 లోపు ఉన్న 56000 మందిపై అధ్యయనం ఎనిమిది అంశాలపై హెచ్సీఎల్ హెల్త్ కేర్ పరీక్షలు యాంత్రిక జీవన శైలితో 40 ఏళ్లలో పై ఇబ్బందులు చాలామందిలో సంతానలేమి.. వైద్య నిపుణులు

మీరు ఐటీ ఉద్యోగుల మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉంటున్నారా తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారా ఇవన్నీ ఎందుకంటే ఐటి ఉద్యోగులు తీవ్ర ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వారి హెల్త్ పారామీటర్స్ అస్తవ్యస్తంగా ఉన్నట్లు హెచ్సీఎల్ హెల్త్ కేర్ సంస్థ హెచ్చరిస్తోంది దేశవ్యాప్తంగా 56,000 మంది ఐటి ఉద్యోగుల ఆరోగ్య స్థితిగతులపై ఈ సంస్థ అధ్యయనం చేసింది దీనిలో 77 శాతం మంది ఆరోగ్య విలువలు చాలా అస్తవ్యస్తంగా ఉన్నట్లు తెలిసింది ముఖ్యంగా 61 శాతం మంది అధిక కొవ్వు సమస్యతో బాధపడుతున్నట్లు పేర్కొంది క్లినికల్ స్టడీ చేసిన తర్వాత హెచ్ సి ఎల్ హెల్త్ కేర్ ఈ వివరాలు వెల్లడించింది ఈ స్టడీని 25:40 ఏళ్ల లోపు వారిపై చేశారు వీరందరికీ వారి పని ప్రదేశాల వద్ద వైద్యుల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు దేశంలోని కార్పొరేట్ వ్యవస్థలు పనిచేసే ఉద్యోగుల్లో పెరుగుతున్న అనారోగ్య పరిస్థితులను నివారించే లక్ష్యాన్ని నొక్కి చెప్పడమే ఈ అధ్యయన ప్రధాన ఉద్దేశం అని హెచ్.ఎస్.ఎల్ పేర్కొంది ఉపాయం ఫ్రీ డయాబెటిస్ డయాబెటిస్ ఫ్రీ హైపర్ టెన్షన్ రక్తపోటు రక్తహీనత హైపోథైరాయిడిసం అధిక కొవ్వు లాంటి కీలకమైన ఎనిమిది అంశాలను పరీక్షించారు ఉద్యోగులలో 22 శాతం మంది ఉబకాయం 17% ఫ్రీ డయాబెటిస్తో 11% రక్తహీనత హైపోథైరాయిడిజంతో ఏడు శాతం మధుమేహంతో ఇబ్బంది పడుతున్నట్లు అధ్యయనం తేల్చింది ఉద్యోగుల్లో ప్రతి ఒక్కరు ఒకటి కంటే ఎక్కువ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు పాతికలలోపు వారిలో కొవ్వు స్థాయిలు చాలా అస్తవ్యస్తంగా ఉన్నట్లు వీరులో 14% రక్తహీనతతో 13% ఉబకాయంతో ఎనిమిది శాతం హైపో థైరాయిడ్ఏ డు శాతం ప్రీ డయాబెటిస్తో బాధపడుతున్నట్లు వెల్లడైంది ఇలాంటి దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులు చాలా వేగంగా పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయని అధ్యయన సంస్థ తెలిపింది ఈ సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రధానంగా 40 ఏళ్లు దాటిన వారిలో చాలా ప్రమాదకర స్థితిలో ఈ పారామీటర్స్ పెరుగుతున్నట్లు వెల్లడించింది ప్రధానంగా అధిక కొవ్వు, ఉబకాయం ప్రీ డయాబెటిస్ డయాబెటిస్ ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలిపింది కేవలం 23% మంది ఉద్యోగుల హెల్త్ పారామీటర్స్ తగిన స్థాయిలో ఉన్నాయని వెల్లడించింది ఇక పరీక్షలు చేయించుకున్న వారిలో 37% మందికి ఒక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య ఉండగా 26% మందిలో రెండు 11 శాతం మందిలో మూడు రకాల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తెలిపింది సాధారణంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లన్ని కూడా 40 ఏళ్ల తర్వాతే వస్తుంటాయి కానీ ఐటీ ఉద్యోగుల్లో మాత్రమే 30 లపే కనిపిస్తున్నాయి ఎందుకు ప్రధాన కారణం వారి జీవనశైలే అని హెచ్సీఎల్ హెల్త్ కేర్ సీఈవో వైస్ చైర్మన్ శిఖర్ మల్హోత్రో పేర్కొన్నారు ఐటి ఉద్యోగులు తప్పక ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు నేటి ఉద్యోగులు ఎక్కువగా జంక్ ఫుడ్స్ రెడీమేడ్ ప్రాసెస్ తీసుకుంటున్నారని అలాగే గంటలకు కూర్చోవడం జీవనశైలి విధానం వల్ల కూడా వారిలో ఇలాంటి అనారోగ్య సమస్యలు ఎక్కువ కనిపిస్తున్నాయని యశోద ఆసుపత్రి కి చెందిన ప్రముఖ వృద్రోక వైద్య నిపుణులు డాక్టర్ రాయుడు గోపికృష్ణ తెలిపారు

ఐటీ ఉద్యోగులలో సంతానాలు ఏమి సమస్య తీవ్రం ఐటి ఉద్యోగులు ఎక్కువగా యాంత్రిక జీవనశైలిని గడుపుతున్నారు రివర్స్ టైం లో పనిచేస్తుంటారు అందుకే వారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వారి ఉద్యోగస్థితి అందుకు కారణం రేయింబగళ్లు పని వ్యాయామం లేకపోవడం సరైన డైట్ పాటించకపోవడం స్మోకింగ్ మద్యపానం సరిగా నిద్రపోకపోవడం లాంటి వాటితో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి హెచ్సీఎల్ అధ్యయనం కంటే కూడా ఇంకా ఎక్కువ సమస్యలే వారిలో ఉన్నాయి ఇటీవారి కాలంలో వారిలో సంతానలేని సమస్య తీవ్రత చాలా ఎక్కువగా కనిపిస్తోంది ఇది బాగా ఆందోళనకరమైన అంశం అందుకే 25 రాకముందే ఏటా విధిగా అన్ని రకాల టెస్టులు చేయించుకోవాలి. బి.పి షుగర్ను కనీసం ఆరు నెలలకు ఒక మారైన చెక్ చేయించుకోవాలి ఐటీ కంపెనీల యాజమాన్యాలు సైతం విధిగా తమ ఉద్యోగులకు పరీక్షలు చేయించాలి దాంతో ముందస్తుగా వారి ఉద్యోగు ల్లోని అనారోగ్య సమస్యలు గుర్తించవచ్చు తద్వారా వారి భీమా ఖర్చు తగ్గే అవకాశం ఉంది అని డాక్టర్ ఎం వి రావు సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్ యశోద ఆసుపత్రి హైదరాబాద్ వారు అన్నారు

25, మార్చి 2024, సోమవారం

మరో మహమ్మారి రావచ్చు సైంటిస్టుల హెచ్చరిక

 ప్రపంచాన్ని వనికించిన కరోనాను మించిన మరోవైరస్ రాబోతున్నదని శాస్త్రవేత్తలు హెచ్చరించారు కరోనా ప్రభావం తగ్గినప్పటికీ అంతకు మించిన ప్రమాదం ముందుందని అలర్ట్ చేస్తున్నారు స్కై న్యూస్ నివేదిక ప్రకారం జంతువుల నుంచి మానవులకు వ్యాప్తి చెందే మరో మహమ్మారి ప్రభలే అవకాశం ఉన్నదని యూకేకు చెందిన అంటూ వ్యాధుల నిపుణులు చెబుతున్నారు ఏ సమయంలోనైనా మరో మహమ్మారి పుట్టుక రావచ్చని హెచ్చరిస్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏది జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అవసరమైతే త్యాగాలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు గ్లోబల్ వార్మింగ్ అటవీ నిర్మూలన వల్ల వైరస్ లు లేదా బ్యాక్టీరియా జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ప్రమాదం పొంచి ఉన్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు



నియామకాల్లో కొత్త ట్రెండ్ ఘోస్ట్ జాబ్స్

 ప్రపంచవ్యాప్తంగా జాబ్ మార్కెట్లో కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది దీని పేరు ఘోస్ట్ జాబ్స్ ఉద్యోగ ఖాళీలు లేకున్నప్పటికీ నియామకాల కోసం ప్రకటనలు జారీ చేయడం దరఖాస్తులు స్వీకరించడం పరీక్షల నుంచి ఇంటర్వ్యూల దాకా అన్ని ప్రక్రియలు సీరియస్గా నిర్వహించడం ఆ తర్వాత దాన్ని ఎక్కించడానికి ఘోస్ట్ జాబ్స్ అని పిలుస్తున్నారు ప్రస్తుతం మార్కెట్లో ఈతరహాట్ రెండు కొనసాగుతోంది కంపెనీలకు చెలగాటంలో ఉన్న నిరుద్యోగులకు మాత్రం ఇది ఆందోళన కలిగిస్తోంది తాజాగా ఈ పరిణామం గురించి మౌర్యం డబ్బులు క్లాస్ అనే మహిళ సామాజిక మాధ్యమం యాప్ థ్రెడ్లో ఈ తరహా జాబ్స్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు తాను పనిచేసే కంపెనీలోని హెచ్ఆర్ సిబ్బంది ఇలాంటి జాబ్ల కోసం అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయాలని తనను కోరినట్లు ఆమె చెప్పుకొచ్చారు అయితే ఒక రకంగా మోసపూరితంగా కనిపించే ఈ విధానానికి తాను ఒప్పుకోలేదని ఆమె వెల్లడించారు అయితే కంపెనీలు ఈ ఉత్తుత్తి నియామక ప్రక్రియను ఎందుకు చేపడతాయని దానిపై నిపుణులు వేరువేరు కారణాలు చెబుతున్నారు ప్రధానంగా వినిపిస్తున్నది ఏమిటంటే ఇలాంటి ఓపెనింగ్స్ తో అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయడం ద్వారా జాబ్ మార్కెట్స్థితిగతులు అభ్యర్థుల టాలెంట్ స్థాయిలు భవిష్యత్తు అవసరాలకు గల వాతావరణం వంటి వాటిని ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి చాలా కంపెనీలు ఈ విధంగా వ్యవహరిస్తున్నాయని తేలింది

మొసలి ఎముకలైనా 30 సెకండ్లలో ముటాష్

 ప్రమాదకరమైన చేపలు అనగానే షార్క్ లు , ఫిరాన గుర్తుకు రావడం కామనే కానీ వాటికన్నా ప్రమాదకరమైన ఒక చేప గురించి తెలుసా పెద్దపెద్ద కోరలాంటి పదునైన పళ్ళతో దొరికితే చాలు చీల్చి పడేసే ఆ చేపలు టైగర్ ఫిష్లు ఆఫ్రికా ఖండంలోని సరస్సులు నదుల్లో కనిపించే ఈ చేపలు టార్గెట్ చేశాయంటే ఎంత పెద్ద చేప అయినా నిమిషాల్లో మఠాషల్సిందే ఈ చేపలు మరీ క్రూరంగా దూకుడుగా వ్యవహరిస్తాయి కేవలం 30 సెకండ్లలో ముసళ్ళ ఎముకలను కూడా కొరికిపడేయగలవు చూడడానికి కూడా కాస్త భయం గోలిపేలా ఉన్న ఈ చేపలు మందలు మందలుగా వేటాడుతాయి

నీటి కోసం వచ్చే పక్షులను పట్టేసి 



ప్రపంచంలో అత్యంత క్రూర ప్రవృత్తి ఉన్న చేపలుగా టైగర్ ఫిష్ లకు పేరు ఉన్నది అడుగు నుంచి మూడు అడుగుల వరకు ఉండే ఈ చేపలు సరస్సులు నదులు ఉపరితలానికి కాస్త కింద ఆ మాట వేస్తాయి నీళ్లు తాగడానికి వచ్చే పక్షులు చిన్నపాటి జంతువులను చుట్టుకుని పట్టేసి కొరికి తినేస్తాయి

పోక్సో ఈ బాక్స్ తో బాధితులకు భరోసా

 మైనర్లు మహిళలపై దాడులు వేధింపుల ఘటనలు ప్రతిరోజు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి పలు కారణాలతో చాలా ఘటనలు బయటకు రాకుండా రాజులతో ముగిసిపోతున్నాయి వీటిపై ఫిర్యాదు చేసేందుకు ప్రజలు భయపడుతున్నారు ఇలాంటి వాటికి చెక్ పెడుతూ ఫిర్యాదుదారుల వివరాలు పోలీసులకు సైతం తెలియకుండా రహస్యంగా ఉంచి బాధ్యతలు బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల సరికొత్త యాప్ అందుబాటులోకి తెచ్చింది ఆన్లైన్ వేదికగా ఫోక్సో ఈ బాక్స్ పేరిట యాప్ ను రూపొందించింది కళ్ళ ముందు వేధింపులు అఘాయిత్యాలు జరిగితే ధైర్యంగా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు



కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ యాప్ లో వచ్చే ఫిర్యాదులను ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తుంది. యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి రాష్ట్ర జిల్లా కార్యాలయానికి ఒకేసారి సమాచారం ఇస్తారు బాలల సంరక్షణ అధికారి సిబ్బంది విచారణ చేపడతారు 100% పారదర్శకతతో కేసు నమోదు అవుతుంది ఫిర్యాదుదారులకు రక్షణ ఉండేలా నేరానికి పాల్పడిన వారికి శిక్షపడేలా యంత్రాంగం తోడ్పాటునందిస్తుంది. యాప్ పై అధికారులు గ్రామీణ స్థాయి నుంచి అవగాహన కల్పిస్తే చాలా వరకు వేధింపుల కేసులకు అడ్డుకట్ట వేయవచ్చు అని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది

కాలికలు మహిళల సంరక్షణను సామాజిక బాధ్యతగా భావించే ప్రతి ఒక్కరు స్మార్ట్ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఫోక్సో ఈ బాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలు తెలిస్తే ఈ యాప్ ఓపెన్ చేసి ఈ బాక్స్ పై క్లిక్ చేయాలి చిన్నారులకు ఎదురయ్యే ఆరు రకాల హింసలకు సంబంధించిన చిత్రాలు ఇందులో కనిపిస్తాయి ఘటనకు సంబంధించిన హింస స్వభావాన్ని గమనించి చిత్రంపై క్లిక్ చేయాలి అనంతరం ఫిర్యాదు పత్రంలో బాధితులకు జరిగిన ఘటన వివరాలు పొందుపరిచి సమర్పించాలి

22, మార్చి 2024, శుక్రవారం

నకిలీ మందుల సమాచారం ఇవ్వండి 1800596969

 నకిలీ మందులు విక్రయిస్తున్న ఎమ్మార్పీ కంటే ఎక్కువ వసూలు చేసిన డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు డీసీఏ డీజే కమలాసన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు లైసెన్సు లేకుండానే కొన్ని కంపెనీలు మందులను తయారు చేసే విక్రయిస్తున్నట్లు తమ తనిఖీలలో గుర్తించినట్లు చెప్పారు ఇలాంటి ఫిర్యాదులు ఉన్న ప్రజలు 18005996969 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు కాక డిసి అధికారులు కొత్తగూడెంలో చేపట్టిన తనిఖీల్లో టెక్స్లాబ్ అని స్టెరాయిడ్ ఇంజక్షన్ అధిక ధరకు విక్రయిస్తున్నట్లుగా గుర్తించినట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్కువ ఇంజక్షన్ అసలు ధర  రూపాయలకు 26 రూపాయలకు గాను సదురు కంపెనీ 39 రూపాయల 90 పైసలుగా ముద్రించినట్లు గుర్తించామని పేర్కొన్నారు నిబంధనలు గ్రహించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు

క్లినిక్ లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి

 హాస్పిటల్లో మాదిరిగా హైదరాబాద్ జిల్లాలోని ఐస్ క్లినిక్స్ పాలి క్లినిక్స్ అలోపతి క్లినిక్స్ కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అవసరమని డిఎంహెచ్వో డాక్టర్ వెంకటేష్ స్పష్టం చేశారు చేసుకోకుంటే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రతి క్లినిక్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు సర్టిఫికెట్లతో అప్లికేషన్ చేసుకుంటే పది రోజుల్లో టెంపరరీ సర్టిఫికెట్ జారీ చేస్తామని అంతా ఓకే అయితే 45 రోజుల్లో పర్మనెంట్ ఐదు ఏళ్లకు సర్టిఫికెట్ జారీ చేస్తామని స్పష్టం చేశారు

19, మార్చి 2024, మంగళవారం

మత్తుతో చిత్తే యాంగ్జైటీ

 రాత్రి మధ్య మత్తులో తోగేటప్పుడు పర్యవసానాల గురించి ఎవరు ఆలోచించరు మరుసటి ఉదయం నిద్ర లేచిన తర్వాత హ్యాంగోవర్తో పాటు అర్థం లేని ఆందోళన భయాలు వేధిస్తాయి ఈ ఆందోళన హ్యాంగ్జైటీ

రాత్రి తాగిన మద్యం మత్తు తెల్లవారేసరికి పూర్తిగా దిగిన దిగకపోయినా అపరాధ భావన మాత్రం వేధించడం మొదలుపెడుతుంది ఈ మానసిక స్థితికి కారణం వెనక భౌతిక వాస్తవాలు ఉన్నాయి మద్యం తాగి ఆ మత్తు నుంచి బయటపడే సమయంలో ప్రతి వ్యక్తి మెదడులో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. తక్కువ పరిమాణాల్లో మద్యం తీసుకున్న వాళ్లలో అయోమయం లాంటి లక్షణాలు కనిపిస్తే ఎక్కువ మోతాదుల్లో తాగేసేవాలలో మరుసటి ఉదయం ఆందోళన భయం మానసిక గందరగోళం లాంటి లక్షణాలు మొదలవుతాయి బిరియాని పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసే మద్యం మరుసటి ఉదయానికి చిత్రమైన మానసిక అసంతులనానికి లోను చేస్తుంది మెదడులోని న్యూరో ట్రాన్స్మిటర్లలో ఏర్పడే మార్పులే ఎందుకు ప్రధాన కారణం ప్రధానంగా నిద్ర ఒత్తిడిలకు సంబంధించిన గ్రామ అమీను బ్యూటీ యాసిడ్ కేంద్రం నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతుంది మద్యంతో ఈ ట్రాన్స్మిటర్ మోతాదు తగ్గుతుంది దీనికి తోడు మెదడులోని మరొక ట్రాన్స్మిటర్లుటమేట్ మీద కూడా మద్యం ప్రభావం పడుతుంది ఈ బ్లూటమేట్ తగ్గడంతో మెదడు మీద మద్యం ప్రభావం మరింత పెరిగి ఆందోళనలను ప్రేరేపించే రసాయన ఉత్పత్తి పెరుగుతుంది ఫలితంగా మద్యం తాగిన మరుసటి ఉదయం ఆందోళన భయం మొదలవుతాయి అరుదుగా తాగే వాళ్లలో హాంగ్చేయిటి సమస్య ఒక్కరోజులోనే అదుపులోకి వచ్చేస్తుంది కానీ క్రమం తప్పకుండా మద్యం తాగే వాళ్ళలో ఈ న్యూరో ట్రాన్స్మిటర్ల మధ్య సంతులనం దెబ్బతిని హ్యాంగ్జైటీ నుంచి కోరుకునే వేగం తగ్గుతుంది ఏ లక్షణాలను కప్పిపుచడం కోసం మద్యం తాగారు మరుసటి రోజు అవే లక్షణాలు రెట్టింపు తీవ్రతతో పిలుచుకుపడతాయి హ్యాంగ్ ఓవర్ నుంచి ఉపశమనం పొందడం కోసం కొందరు మరుసటి ఉదయం స్వల్పంగా మద్యం తీసుకునే పాతకాలపు చిట్కాను అనుసరిస్తూ ఉంటారు ఈ రిలీఫ్ డ్రింకింగ్ వల్ల మరింత వ్యసనానికి దారి తీసే ప్రమాదం ఉంది

వన్య ప్రాణులతో సెల్ఫీలు నిషేధం

 అనుమతి లేకుండా వన్యప్రాణుల ఫోటోలు కానీ సెల్ఫీలు కానీ తీస్తున్నారా ఏడేండ్ల జైలు తప్పదని హెచ్చరిస్తున్నారు ఒడిశా అటవీ అధికారులు జంతువులతో ఫోటోలు ముఖ్యంగా సెల్ఫీల కారణంగా వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాలలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల క్రమంలో ఒడిశా ప్రిన్సిపాల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సుశాంత్ నంద ఆదేశాలు జారీ చేశారు సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయడానికి జంతువులతో సెల్ఫీలు తీసుకుంటున్నారని జంతువుల సహజ ప్రవర్తన వాటి నివాస పరిస్థితిలపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని అంతేకాకుండా ఇది 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని అతిక్రమించడమేనని అన్నారు

13, మార్చి 2024, బుధవారం

టి సేఫ్ యాప్ కాదు సేవ

 బేసిక్ ఫోన్ లోను సేవలు లభ్యం యాప్ ప్రారంభంలో సీఎం రేవంత్ వెల్లడి రాష్ట్ర పోలీసుల కృషికి అభినందన

తెలంగాణ పోలీసుల రూపొందించిన టిసి యాప్ మాత్రమే కాదని అది సేవా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు మహిళలు చిన్నారుల భద్రత కోసం ట్రావెల్స్ సేఫ్ పేరిట తెలంగాణ మహిళా భద్రత విభాగం అందుబాటులోకి తెచ్చిన ఈ సేవల్ని సచివాలయంలో సీఎం మంగళవారం ఆవిష్కరించారు ఈ సేవలను పొందేందుకు స్మార్ట్ఫోన్ ఉండాల్సిన అవసరం లేదని యాప్ డౌన్లోడ్ చేయాల్సిన పనిలేదని తెలిపారు మహిళల చేతిలో బేసిక్ ఫోన్ ఉన్న టి సేఫ్ సేవలను పొందే వీలుందని పేర్కొన్నారు మహిళలు చిన్నారుల భద్రతకు నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్ర పోలీసులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి విధానాన్ని ప్రకటించిన రోజే ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావడం శుభ పరిణామం అన్నారు కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కొండ సురేఖ సీతక్క తుమ్మల నాగేశ్వరరావు జూపల్లి కృష్ణారావు దామోదర్ రాజనర్సింహ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బిజెపి రఘుతా హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ మహిళా భద్రత విభాగం అదనపు డీజీపీ షికా గోవిల్ తదితరులు పాల్గొన్నారు

ఫోన్ ద్వారా 100 లేదా 112 నెంబర్ కు ఫోన్ చేసిన అనంతరం ఐవిఆర్ ఆప్షన్ ద్వారా 8 నెంబర్ను ఎంపిక చేసుకుని టి సేఫ్ సేవలను పొందవచ్చు అలాగే ఫోన్ చేసిన వెంటనే ఆటోమేటెడ్ లింక్ వస్తుంది దీని ద్వారా గూగుల్ ప్లే స్టోర్లో లేదా టి సేఫ్ పేజీలో అందుబాటులో ఉన్న ట్రావెల్స్ అప్లికేషన్ ద్వారా సేవను పొందవచ్చు

రాష్ట్రంలోని 791 పెట్రోలింగ్ కారులు 1000 85 బ్లూ కోల్డ్స్ వాహనాలను ఈ యాప్ తో అనుసంధానం చేయనున్నారు వినియోగదారులు తమ ప్రయాణ వివరాలను కుటుంబ సభ్యులతోనూ లైవ్ లొకేషన్ లింక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు

9, మార్చి 2024, శనివారం

డ్రై ఐ స్ ముట్టుకుంటే ముప్పే

 డ్రై ఐస్ అంటే ఏమిటి డ్రై అయిస్ నిన్న మొన్న వార్తలు హల్చల్ చేసిన ఉత్పత్తి గురుగ్రామ్ కు చెందిన ఒక రెస్టారెంట్లో భోజనానంతరం డెసర్ట్ అనుకుని ఈ డ్రై ఐస్ నోట్లో వేసుకున్న ఐదుగురు తీవ్రమైన ఆస్వస్థతకు గురవ్వడమే ఇన్దుకు కారణం. రక్తపు వాంతులతో వారు భయభ్రాంతులైపోయారు ఇంతకీ ఏమిటి డ్రై అయిస్ కార్బన్డయాక్సైడ్ ను దాదాపు 80 డిగ్రీల దగ్గర చల్లబరిచినప్పుడు ఈ డ్రై ఐస్ ఏర్పడుతుంది ఐస్ క్రీమ్ లాంటివి కరిగిపోకుండా ఉండేందుకు దీనిని వాడతారు పొరపాటున దీనిని నోట్లో వేసుకుంటే ఒంట్లోని ఆక్సిజన్ ని ఆవిరి చేసేస్తుంది నోరు జీర్ణాశయం ఇలా డ్రై అయిస్ ప్రయాణించే మార్గం అంతా దెబ్బతింటుంది చర్మానికి తగిలితే కాలిపోయినంతగా బాధిస్తుంది దాని ఆవిరి తగిలినా కూడా దద్దుర్లు కళ్ల మంటలు కాయం సరదాగా అయినా ఈ డ్రై ఐస్ చోలికి పోవద్దన్నది వైద్యుల హెచ్చరిక వృత్తిపరంగా ఈ ఉత్పత్తికి దగ్గరగా ఉండాల్సి వస్తే నిపుణుల సూచనలను తప్పకుండా పాటించాలి చేతులకు గ్లౌజ్ కళ్ళకు గాగుల్స్ లేకుండా పొరపాటున కూడా దీనిని తాకకూడదు

6, మార్చి 2024, బుధవారం

రీసైకిల్ ప్లాస్టిక్ లో విషరసాయనాలు

 రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ ఉత్పత్తులు విషపూరితమైన రసాయనాలు అధికంగా ఉన్నాయని తాజా అధ్యయనంలో వెళ్లడైంది ఢిల్లీలోని టాక్సిక్ లింక్స్ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది ఎలాంటి నిబంధనలు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ వాడకం ఆందోళన కలిగిస్తుంది ఈ ప్లాస్టిక్ లో విషపూరితమైన రసాయనాలు ఉంటున్నాయి అని మంగళవారం విడుదలైన తాజా అధ్యయనం పేర్కొంది అధ్యయనంలో భాగంగా మార్కెట్లో వేరేవిగా లభించే 15 రకాల ప్లాస్టిక్ వస్తువుల నమూనాలను పరిశీలించిన పరిశోధకులు వాటిలో 60 శాతానికి పైగా విశారసాయనాలు ఉన్నాయని గుర్తించినట్లు వెల్లడించారు

5, మార్చి 2024, మంగళవారం

ఐఐఎఫ్ఎల్ గోల్డ్ లోన్లపై ఆర్.బి.ఐ బ్యాంక్

 ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ గోల్డ్ లోన్లు ఇవ్వడాన్ని ఆపాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది కంపెనీ తన గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియోను సరిగా పట్టించుకోవడంలేదని పేర్కొంది కస్టమర్లు నష్టపోకుండా ఉండేందుకు ఆర్బిఐ ఈ చర్యలు తీసుకుంది కంపెనీ ఆర్థిక పరిస్థితులను చెక్ చేసేందుకు కింద తేడాది మార్చి 31న ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ బుక్ లను ఆర్బిఐ తనిఖీ చేసింది లోన్లను ఇచ్చేటప్పుడు డిఫాల్ట్ల బంగారాన్ని వేలం వేసేటప్పుడు గోల్డ్ ప్యూరిటీ నేటి వెయిట్ కొలవడంలో తేడాలు ఉన్నాయని ఆర్బిఐ పేర్కొని అలానే గోల్డ్ వేల్యూలో ఇచ్చే లోన్ పరిమితులను క్యాష్ రూపంలో అప్పులు రికవరీ చేయడంలో అప్పుల పంపిణీలో లిమిట్స్ ను ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ ఉల్లంఘించిందని ఆర్బిఐ వెల్లడించింది స్టాండర్డ్ యాక్షన్ ప్రాసెస్ను ఫాలో కావడం లేదని కస్టమర్లపై వేసే చార్జీలో పారదర్శకత లేదని తెలిపింది ఇప్పటికే ఉన్న గోల్డ్ లోన్ కస్టమర్లకు ఐ ఎఫ్ఎఎల్ తన సర్వేలను కొనసాగించవచ్చని ఆర్బిఐ పేర్కొంది లోన్ రికవరీ ప్రాసెస్ కలెక్షన్స్ కొనసాగించవచ్చని తెలిపింది. రెగ్యులేషన్స్ను ఉల్లంఘించడంతోపాటు ఇటువంటి చర్యల వలన కస్టమర్లు తీవ్రంగా నష్టపోతారు. అని ఆర్బిఐ కామెంట్ చేసింది కంపెనీ సీనియర్ మేనేజ్మెంట్ ఆడిటర్లతో టచ్ లో ఉన్నామని ఈ లోపాలపై చర్చించామని అన్నది లోపాలను సరిదిద్దుకోవడానికి కంపెనీ ఇంకా చర్యలు మొదలుపెట్టలేదని కస్టమర్ల సేఫ్టీ ని దృష్టిలో పెట్టుకొని కాజా రెస్ట్రిక్షన్లు పెట్టామని ఆర్బిఐ పేర్కొంది స్పెషల్ ఆడిట్ చేపడుతున్నామని ఇది పూర్తయ్యాక మరోసారి రివ్యూ చేపడతామని తెలిపింది



ఇవి దగ్గర ఉంచుకోండి

 




అమ్మాయిలను ఒంటరిగా బయటకు పంపాలంటే ఏ అమ్మానాన్నలకైనా ఆందోళన ఎందుకంటే ఈ క్షణం ఏం జరుగుతుందో అని భయం. అలాగని ఇంటికి పరిమితం కాలేము కదా కాబట్టి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు

మన జాగ్రత్తలో మనం ఉండడానికి ఆపద సమయంలో మనల్ని మనం కాపాడుకునేందుకు ప్రస్తుతం మార్కెట్లో కొన్ని గాడ్ చెట్లు అందుబాటులో ఉన్నాయి అవి ఏమిటంటే

సేఫ్టీ టార్చ్ అనుకొని కారణాల వలన అప్పుడప్పుడు అర్ధరాత్రి వేళలో ఇంటికి వెళ్లాల్సి రావచ్చు అలాంటప్పుడు ఎవరైనా వెంబడించిన లేదంటే దొంగతనానికి పాల్పడిన సదర వ్యక్తి నుంచి మనం తప్పించుకోవాలంటే ఈ సేఫ్టీ టార్చ్ సహాయపడుతుంది దీనికి ముందు భాగంలో ఉండే ఎల్ఈడి లైట్ నుంచి విద్యుత్ శక్తి ప్రసరిస్తుంది తద్వారా ఆ లైట్ పడిన చోట విపరీతమైన నొప్పి వస్తుంది కొన్ని నిమిషాల వరకు వారిని ఎక్కడికి కదలనివ్వదు. ఆ సమయంలో ఈజీగా తప్పించుకోవచ్చు

మ్యూజికల్ సేఫ్టిస్టిక్ అపరిచిత వ్యక్తి మన పై దాడి చేసేటప్పుడు ఈ సేఫ్టీ రాడ్ స్టిక్ తో కొట్టి ఎక్కడినుంచి వెంటనే తప్పించుకోవచ్చు అదెలా అంటే ఈ రాడిని ఫోల్డ్ చేసుకుని హ్యాండ్ బ్యాగ్ లేదా ప్యాకెట్ లో పెట్టుకోవచ్చు ప్రమాదం ఎదురైనప్పుడు హ్యాండిల్ కి ఉన్న పిన్ని లాగితే చాలు స్టిక్ మాదిరిగా వస్తుంది

సి ఫర్ స్మార్ట్ జ్యువెలరీ అపరిచితుడు వెంబడిస్తున్నప్పుడు మనం ప్రమాదంలో ఉన్నామన్న విషయం కుటుంబ సభ్యులు స్నేహితులకు తెలియజేయడానికి మీ సేఫర్ స్మార్ట్ జువెలరీ ఉండవలసింది దీని లాకెట్ మొబైల్ యాప్ తో కనెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన వారి నంబర్లు సెట్ చేసుకోవాలి. దీన్ని చైన్ లా మెడలో వేసుకొని ప్రమాదం వచ్చినప్పుడు లాకెట్ వెనుక బట్టల్ని రెండుసార్లు నొక్కితే చాలు మనకు కావాల్సిన వారికి మనం ప్రమాదంలో ఉన్నామని మెసేజ్ వెళుతుంది అంతేకాదు ఈ యాప్ నుంచి మీ లైవ్ లొకేషన్ కూడా షేర్ అవుతుంది. దీనితో మిమ్మల్ని వారు సులభంగా చేరుకోగలుగుతారు ఇలా ఇవి మనకు రక్షణ కవచాలుగా ఉపయోగపడతాయి


4, మార్చి 2024, సోమవారం

వెహికల్స్ వెనుక రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు మస్ట్

 రాత్రి వేళల్లో హైవేలు ఓ ఆర్ ఐ ప్రమాదాల నివారణకు ఆర్టిఏ చర్యలు

హైవేలు ఓ ఆర్ ఆర్ పై రోడ్డు ప్రమాదాల నివారణకు ఆర్టిఏ కీలక నిర్ణయం తీసుకుంది ప్రతి వాహనం వెనుక తప్పనిసరిగా రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు ఉండేలా చర్యలు ప్రారంభించింది త్వరలోనే దీనిని అమలు చేయాలని నిర్ణయించింది ఇటీవల కాలంలో జాతీయ రహదారులపై పెద్ద సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి చాలా ప్రమాద ఘటనల్లో డ్రైవర్ల నిర్లక్ష్యంతో పాటు ఆయా వాహనాలకు ముందస్తు జాగ్రత్తల విషయంలో సరైన శ్రద్ధ చూపకపోవడమే కారణమని అధికారులు చెబుతున్నారు ముఖ్యంగా వెహికల్స్ కు వెనుక గాని పక్కన గాని రెఫ్లెక్టివ్ స్టిక్కర్లు అందించకపోవడం వలన రాత్రి వేళలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అంటున్నారు ఈ స్టిక్కర్లను వాహనాల వెనుక వైపు ఇరువైపులా అంటిస్తే దూరం నుంచి వచ్చే వాహనాలకు చాలా సులభంగా ముందున్న వాహనం తెలిసి ప్రమాదాలు తగ్గుతాయని చెబుతున్నారు ఇందులో భాగంగా వెహికల్స్ కు వెనుక వైపున రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు తప్పనిసరి చేయాలని నిర్ణయించారు ప్రమాదాల నివారణకు మధ్యప్రదేశ్ గుజ రాత్ రాష్ట్రాలలో వెహికల్స్ కు రిప్లై చేశారు దీనివలన రాత్రివేళలో ఆయా రాష్ట్రాలలో ప్రమాదాలు తగ్గాయని మన రాష్ట్రంలో కూడా ఇదే విధానం అమలు చేస్తామని ఆర్టిఏ అధికారులు అంటున్నారు



3, మార్చి 2024, ఆదివారం

అత్యాశకు పోతే ఉన్నది పోయింది

 అమెరికాలో ఐదుగురు గుజరాతి సోదరుల వ్యాపార వివాదం హస్తగతం చేసుకొని మిగిలిన వారిని వెళ్లగొట్టిన హరీష్ జోగాని తప్పుబట్టిన కోర్టు సోదరులకు 20వేల కోట్లు చెల్లించాలని తీర్పు

ఐదుగురు అన్నదమ్ములు వేలకోట్ల వజ్రాల వ్యాపారం దానికి తోడు రియల్ ఎస్టేట్ కంపెనీ అందరూ కలిసికట్టుగా నిర్మించుకున్న వ్యాపార సామ్రాజ్యాన్ని ఒక్కడే సొంతం చేసుకోవాలని భావించాడు మిగిలిన వారు కోర్టుకెక్కరు 21 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు అన్నదమ్ములకు వాటాలు పంచి ఇచ్చింది సోదరులను మోసగించినందుకు 20వేల కోట్ల రూపాయల పరిహారం వారికి చెల్లించాలని ఆ ఒక్కడికి షాక్ ఇచ్చే తీర్పునిచ్చింది గుజరాత్కు చెందిన శశికాంత్ జుగాని 22 ఏళ్ళ వయసులో 1969లో అమెరికాలోని కాలిఫోర్నియాకు వచ్చి వజ్రాల వ్యాపారం ప్రారంభించాడు తర్వాత కాలంలో తన నలుగురు సోదరులు హరీష్ రాజేష్ చేతన్లను గుజరాత్ నుంచి తీసుకొచ్చి వ్యాపారంలో భాగస్వామ్యం ఇచ్చాడు వ్యాపారం అమెరికాతో పాటు యూరప్ ఆఫ్రికా మధ్యప్రత్యానికి విస్త రించింది అయితే తర్వాత సోదరుల మధ్య ఆస్తి వివాదాలు పెరిగాయి వ్యాపారం మొత్తాన్ని హరీష్ జోగాని హస్తగతం చేసుకున్నాడు శశికాంత్ తో పాటు మిగిలిన ముగ్గురిని కంపెనీ నుంచి తొలగించాడు దీనిపై 2003లో న్యాయపోరాటం మొదలైనది 21 ఏళ్లలో ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. అప్పెళ్ళ మీద అప్పిళ్లు దాఖలయ్యాయి మొత్తం మీద లాస్ ఏంజెల్స్ సుపీరియర్ కోర్టు దీనిపై తాజాగా తీర్పునిస్తూ అన్నదమ్ముల మధ్య వ్యాపార భాగస్వామ్యం యజమాని నిర్ధారిస్తూ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు గాను నలుగురు సోదరులకు హరీష్ జోగాని 20050 కోట్ల డాలర్లు దాదాపు 20వేల కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది రియల్ ఎస్టేట్ కంపెనీలో సగం వాటా శశికాంత్ దేనిని మిగిలిన సగంలో హరీష్ కు 24 శాతం రాజేష్కు పది శాతం స్టైలిష్కు 9.5% చేతన్కు 6.5% వాటా ఉంటుందని తీర్పు చెప్పింది


29, ఫిబ్రవరి 2024, గురువారం

ప్రాసెస్ ఫుడ్ తో 30కి పైగా రోగాలు

 అకాల మరణముప్పు పెరిగే ప్రమాదం తాజా అధ్యయనం హెచ్చరిక

తరచూ అల్ట్రా ప్రాసెసింగ్ ఫుల్ తీసుకుంటే క్యాన్సర్ గుండే ఊపిరితిత్తుల వ్యాధులతో పాటు 32 వ్యాధుల బారిన పడే ముప్పు ఉన్నదని బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ప్రచురితమైన తాజా అధ్యయనం హెచ్చరించింది అంతేకాకుండా దీనివల్ల మానసిక అనారోగ్యం అకాల మరణం ఉప్పు కూడా పెరిగే ప్రమాదం ఉన్నదని తెలిపింది పరిశ్రమలలో తయారయ్యే అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ లో విటమిన్లు పీచు తక్కువగా చక్కెర ఉప్పు ఎక్కువగా ఉంటాయని ఈ అధ్యయనంలో పాల్గొన్న ఆస్ట్రేలియా యుఎస్ ఫ్రాన్స్ ఐర్లాండ్ శాస్త్రవేత్తలు తెలిపారు అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల వల్ల కలిగే మరణము ఉప్పు 50% పెరుగుతుందని సాక్షాధారాలతో నిరూపించారు ఈ అధ్యాయంలో కోటి మంది నుంచి వివరాలు సేకరించి విశ్లేషించారు అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ వల్ల డిప్రెషన్ పెరిగే అవకాశం 22% ఎక్కువ అని తేల్చారు ఈ నేపథ్యంలో ప్రజా రోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వాలు అత్యవసరంగా తగిన చర్యలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు కోరారు అల్ట్రా ప్రాసెస్ ప్యాకెట్ల మీద వాటిలో అధిక పరిమాణంలో చక్కెరలు కొవ్వులు ఉన్నాయని ముద్రించడం ప్రచారం అమ్మకాలు నిషేధించడం ఫుడ్ కన్నా ప్రాసెస్ చేయని లేదా తక్కువ ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు తక్కువ ధరలకు లభ్యమయ్యేలా చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాలని డియాకిన్ యూనివర్సిటీ రీసెర్చ్ ఫెలో మెలిస్సా ఎం లానే సూచించారు