సదాశివ నగర్ మండల కేంద్రంలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఆలయ కమిటీ అధ్యక్షుడిగా జోగిని రాజయ్య ట్రాక్టర్ కార్యదర్శిగా న్యాయని నడిపి గంగయ్య కోశాధికారిగా బద్దం రాజిరెడ్డి కార్యవర్గ సభ్యులుగా వడ్ల బాలరాజ్ నల్ల బాయికాడి సాయి రెడ్డి కుమ్మరి రాజయ్య రాజేందర్ నల్ల వెంకటరెడ్డి జనగామ రామ్రెడ్డి సాకలి పున్నమి రాజయ్య తడిగం రాజేందర్ గదారి లచ్చిరెడ్డి తాడ్వాయి నారాయణ తదితరులను ఎన్నుకున్నారు మాజీ సర్పంచ్ బద్దం శ్రీనివాస్ రెడ్డి మాజీ ఉపసర్పంచ్ వంకాయల రవి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కొప్పుల నరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
26, మార్చి 2024, మంగళవారం
7, మార్చి 2024, గురువారం
బుగ్గ ఆలయం సేవలకు నిలయం
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో దట్టమైన అటవీ క్షేత్రంలో కొండా కోనల మధ్య బుగ్గ ఆలయం వెలసింది సాక్షాత్తు శ్రీరాముడు వనవాసంలో సైకతలింగాన్ని ప్రతిష్టించి పూజలు చేసినట్లు భక్తుల నమ్మకం బుగ్గ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటే చిరకాల కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం మహాశివరాత్రికి లక్షల సంఖ్యల స్వామిని దర్శించుకుంటారు దాతలు గ్రామస్తుల సహకారంతో ఆలయంలో నిత్యాన్నదానం వృద్ధాశ్రమం గోశాల తదితర అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ పలు ఆలయాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు
వృద్ధులకు ఆశ్రయం వృద్ధులకు అనాథ వృద్ధులకు ఆలయంలో ఆశ్రయం కల్పిస్తున్నారు. 35 మంది వరకు వృద్ధులు ఉంటున్నారు వీరికి సకల సౌకర్యాలు కల్పిస్తూ ఉదయం రాత్రి భోజనం పెట్టి దుస్తులు ఇతర సామాగ్రి అందజేస్తారు వృద్ధులు మరణిస్తే అంత్యక్రియలను సైతం ఆలయ కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారు. ఆలయా ఆవరణలోని గోశాలలో 85 గోవులను పోషిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు బుగ్గ ఆలయంలో పలు కార్యక్రమాలు చేయడానికి భక్తులు గ్రామస్తులు సహకారం మరువలేనిది గత 23 ఏళ్లుగా నిత్యాన్నదానం నిర్విరామంగా కొనసాగుతోంది ఆలయ పునరుద్ధరణకు దాతలు పెద్ద సంఖ్యలు ముందుకు రావాలి అని ఆలయ అర్చకుడు ప్రభాకర్ స్వామి అన్నారు నిరుపేదలకు చేయూత అందించేందుకు కృషి చేస్తున్నాం గ్రామస్తులు దాతల సహాయంతో అనాధలకు ఆశ్రయం కల్పిస్తున్నాం మహాశివరాత్రికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకోవాలి అని ఆలయ చైర్మన్ లచ్చిరెడ్డి అన్నారు
23 ఏళ్లుగా నిత్యాన్నదానం బుగ్గ ఆలయంలో 2001 నుంచి నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామస్తులు ప్రతి ఇంటి నుంచి ఒక సంచి బియ్యాన్ని అందజేస్తారు తొలిత కిలో నుంచి ప్రారంభించి ప్రస్తుతం నిత్యం 50 కిలోల వరకు అన్నదానం చేస్తున్నారు సోమవారం రెండు క్వింటాల బియ్యం అన్నదానం చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు
నేటి నుంచి వేడుకలు ప్రారంభం ఆలయంలో మహాశివరాత్రి ఏర్పాట్లు ముంబారంగా కొనసాగుతున్నాయి గురువారం రోజున అఖండ దీపారాధన రాత్రి పల్లకి సేవ గ్రామంలో ఊరేగింపు ఉంటుంది శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన ఉదయం 11 గంటలకు స్వామివారి కళ్యాణం సాయంత్రం నాలుగు గంటలకు రథోత్సవ కార్యక్రమం శనివారం ఉదయం 6 గంటలకు అగ్నిగుండాలు రుద్రాభిషేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు
5, మార్చి 2024, మంగళవారం
ఆధ్యాత్మిక సమాచారం మార్చి 5 2024
అయోధ్య భక్తులను సత్కరించిన మాజీ జెడ్పిటిసి
గాంధారి మండలం నుండి గత వారం రోజుల క్రిందట అయోధ్య రామ మందిరానికి బయలుదేరి స్వగ్రామానికి క్షేమంగా తిరిగి వచ్చిన భక్తులందరికీ సత్కరించిన టిఆర్ఎస్ సీనియర్ నాయకులు తనాజిరావు వారి వెంట పడగల రాజేశ్వరరావు బిజెపి మండల అధ్యక్షులు సాయిబాబా శివాజీ రావు శ్రీకాంత్ మహారాష్ట్ర భక్తులు తదితరులు పాల్గొన్నారు
భక్తిశ్రద్ధలతో మల్లన్న కళ్యాణోత్సవం
కామారెడ్డి పట్టణంలోని గొల్లవాడ యాదవ సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక శ్రీ మల్లన్న ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు స్వామివారికి అగ్నిగుండాలలో నడవడం అన్నదానం చేశారు మల్లన్న పట్నాలు వేసి ఒగ్గు కథ అని చెప్పారు ఈ కార్యక్రమంలో యాదవ సంఘం యువజన సంఘం ప్రతినిధులు స్థానికులు పాల్గొని పూజలు చేశారు
శివ స్వాముల పల్లకి సేవ
భిక్కనూరు మండల కేంద్రంలో శివ స్వాములు పల్లకి సేవ ఊరేగింపు సోమవారం నిర్వహించారు వాహనంపై లింగములు ప్రతిష్టించి మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు శ్రీ సిద్ధ రామేశ్వరాలయం మహంత్ సదాశివ మహంత్ శివ స్వాములు రామదండు ప్రతినిధులు పాల్గొన్నారు
నసురుల్లాబాద్ మండలంలోని దొరికి సోమలింగేశ్వర ఆలయాన్ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు సోమవారం సందర్శించారు ఈ సందర్భంగా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు అనంతరం ఆవరణలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు ఆయన వెంట మాజీ సర్పంచ్ దుర్గం శ్యామల నాయకులు మోహన్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు
ఘనంగా మల్లికార్జున స్వామి కళ్యాణం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గొల్లవాడలో యాదవ సంఘం ఆధ్వర్యంలో మల్లికార్జున స్వామి కళ్యాణం సోమవారం ఘనంగా నిర్వహించారు ఆలయంలో ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదానం చేశారు కార్యక్రమంలో ఎదవ సంఘం నాయకులు యూత్ సభ్యులు పాల్గొన్నారు
అలరించిన నృత్యోత్సవం
మహాశివరాత్రి పురస్కరించుకొని కామారెడ్డి లోని కళాభారతి ఆడిటోరియంలో సోమవారం సనాతన సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్యం అలరించింది తెలుగు రాష్ట్రాల నుంచి కళాకారులు హాజరై ప్రదర్శన ఇచ్చారు కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా శ్రీ వేద విద్యానంద గిరి స్వామి గాయకుల భిక్షునాయక్ సుజాశ్రీ హాజరయ్యారు ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు ఇచ్చారు కార్యక్రమంలో టిపిఆర్టియు జిల్లా అధ్యక్షుడు అందరూ మనోహర్రావు సనాతన సంస్థ వ్యవస్థాపకుడు మాలోతు నవీన్ శ్లోకబడి ఛైర్మన్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు
అయోధ్య రాముడు దర్శనానికి భక్తులు
కామారెడ్డి రైల్వే స్టేషన్ నుంచి అయోధ్యకు రామభక్తులు దర్శనానికి సోమవారం బయలుదేరారు 1453 మంది భక్తులతో వెళుతున్న రైలును భాజపా జిల్లా అధ్యక్షురాలు అరుణతార జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు బాలరాముడు దర్శనానికి జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని భక్తులు అయోధ్యకు వెళ్తున్నారన్నారు వారికి తీర్థయాత్ర ట్రస్ట్ అభియాన్ రాష్ట్ర కన్వీనర్ వెంకటరమణారెడ్డి వసతులు కల్పిస్తున్నారని అన్నారు అసెంబ్లీ కన్వీనర్ కుంట లక్ష్మారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు విపుల్ కౌన్సిలర్లు అవధూత నరేందర్ బీజేవైఎం రాష్ట్ర నాయకుడు నరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు
3, మార్చి 2024, ఆదివారం
విశ్వనాథేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాలు
కామారెడ్డి విద్యానగర్లోని శ్రీ విశ్వనాథేశ్వర స్వామి ఆలయ నాలుగవ వార్షికోత్సవం మహాశివరాత్రి పర్వదిన ఉత్సవాలు ఈనెల 6 7 8 తేదీలలో బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజులు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు శంకర్ గౌడ్ మంగళారపు మోహన్ ప్రతినిధులు శ్రీనివాస్ రెడ్డి లక్ష్మయ్య తెలిపారు స్వామివారి కల్యాణోత్సవం అన్నదానం అభిషేక విశేష పూజలు ఉంటాయన్నారు
అభివృద్ధి పథంలో సోమేశ్వరాలయం
నసురుల్లాబాద్ మండలంలోని దుర్గి గ్రామంలో సోమలింగాల ఆలయం రంగులు నూతన ప్రాకారాల నిర్మాణంతో అభివృద్ధి చెందుతోంది మాజీ స్పీకర్ ప్రస్తుత బాన్సువాడ నియోజకవర్గం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి ఒకకోటి రూపాయలు నిధులు కేటాయించినట్లు పలు సమావేశాల్లో తెలిపారు కానీ మంజూరని నిధులు అందుకు పోవడంతో ఆయన కుటుంబ సభ్యులు తమ సొంత నిధులతో 60 లక్షల వరకు ఖర్చు చేసి నూతనంగా అభివృద్ధి చేస్తున్నారు దీనితో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆలయం నిర్మాణం జరగడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు సోమలింగేశ్వర ఆలయం దక్షిణ కాశీగా వీరా జిల్లా ఉందని ఈ ఆలయం స్వయంభు లింగం నెలకొని ఉన్నందున శివరాత్రి వరకు పనులు పూర్తి కావచ్చు అని ప్రజల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు
లోక కళ్యాణార్థం మహాపాదయాత్ర
లోక కళ్యాణార్థం భారత దేశ శాంతి కోసం ఈనెల 11 నుంచి 22 వరకు మహాపాదయాత్ర నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఆదివారం బీర్కూరు మండల కేంద్రంలోని శ్రీ రామాలయంలో పాదయాత్రకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు ఈ పాదయాత్ర 11వ తేదీన ప్రారంభమై 23వ తేదీన యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని సోమనాథ్ పుణ్యక్షేత్రానికి చేరుకుంటుందన్నారు పాదయాత్రలో పాల్గొనే భక్తులకు ఉదయం మధ్యాహ్నం రాత్రి వేళల్లో అల్పాహారం ప్రసాదం సౌకర్యాలు కల్పించబడతాయని అన్నారు పాదయాత్రలో పాల్గొనే విజయవంతం చేయాలని కోరారు
నా భర్త బెట్టింగ్ మానాలి
సమ్మక్క భక్తురాలు విచిత్ర కోరిక మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీలలో భక్తుల విచిత్ర కోరికల చిట్టీలు బయటపడుతున్నాయి నా భర్త బెట్టింగ్ మానివేయాలి అక్క కొడుకుకు ఐఐటీలో సీటు రావాలి అని ఒక భక్తురాలు రాసిన కాగితం హుండీ లెక్కింపులో ఆదివారం బయటపడింది కోరిన కోరికలు తీర్చే తల్లి కోరిక తీరుస్తుందో లేదో చూడాలి మరి
ఆధ్యాత్మిక సమాచారం..4-3-2024
రేపు కృష్ణానంద స్వామి జన్మదినం
శ్రీరామ కోటి జప లిఖిత ప్రచారకులు స్థానిక కృష్ణానంద ఆశ్రమ వరయోగి కృష్ణానంద స్వామి 78వ జన్మదిన ఈనెల ఐదున్నటేక్రియాల బైపాస్ వద్ద ఆశ్రమంలో మంగళవారం నిర్వహించినట్లు ప్రతినిధి ప్రదీప్ కుమార్ ఒక ప్రకటనలు తెలిపారు జన్మదిన వేడుకలలో శారదా పీఠం స్వామి సచ్చిదానంద మనోహరాబాద్ శబరిమాత ఆశ్రమం స్వామి శివానంద భారతి నిర్మాణానంద సహజ ఆనంద శ్రీనివాస్ స్వామి తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు
అమ్మవారికి బోనాల సమర్పణ.. బాన్స్వాడ పట్టణంలోని బీడీ వర్కర్స్ కాలనీలో పోచమ్మకు ఆదివారం బోనాలను సమర్పించారు కాలనీవాసులు బోనాలతో వెళ్లి అమ్మవారికి సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు
వైభవంగా సాయిబాబా ఆలయ వార్షికోత్సవం
మద్నూర్ మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయ తొమ్మిదవ వార్షికోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు తెల్లవారుజాము నుంచి అభిషేకం ప్రత్యేక పూజలు హారతీ తదితర కార్యక్రమాలు జరిగాయి ఈ సందర్భంగా భక్తులు కొనదానం చేశారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పలువురు దాతలను సన్మానించారు అందంగాలంకరచారు
మహాశివరాత్రి జాగరణను విజయవంతం చేయాలి
కామారెడ్డి పట్టణంలోని వీక్లీ మార్కెట్లో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించే మహాశివరాత్రి జాగరణ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు ఆదివారం ఏర్పాట్లకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శివరాత్రి జాగరణ 8వ తేదీన నిర్వహిస్తున్నామని నియోజకవర్గ ప్రజలు హిందూ బంధువులు ఈ జాగరణ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని అన్నారు సంస్కృతిక కార్యక్రమాలు పూజలు లింగోద్భవం కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు సాయంత్రం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంటల వరకు కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు
నేడు బాల్కొండ చరిత్ర గ్రంథావిష్కరణ
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రానికి చెందిన చరిత్ర జిజ్ఞాసి విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రముఖ సీనియర్ పాత్రికేయుడు కాలమిస్ట్ చరిత్రకారుడు బ్రహ్మ రౌతు నర్సింగ్ రావు బాల్కొండ చరిత్ర రాయబోని 2014 నుండి 2023 వరకు దశాబ్ద కాలం పాటు బాల్కొండలోని చారిత్రాత్మక ఖిల్లా ను ప్రధానాధారంగా చేసుకొని పట్టణంలోని ప్రాచీన దేవాలయాలు జిల్లాలోని శివాలయం సమీపంలో గల శాసనాన్ని ఇత్యాధి చరిత్ర అంశాల్ని పరిశీలించి పరిశోధించి సరైన ఆధారాలు సంపాదించి చారిత్రాత్మక అన్నయ్య కొండయ్యల శిలా విగ్రహాలు బాల్కొండ కోట బురుజులు, ముఖద్వారాలు ఫిరంగి లాంటి వాటిని ఎంతో ఆసక్తితో నరసింహారావుతో పాటు చరిత్ర పరిశోధకులు కందకుర్తి యాదవరావు సిద్దసాయారెడ్డి కంకణాల రాజేశ్వర సంపూర్ణ సహకారంతో అల్లకొండ ఊరు ఉద్భవం అయిదు ఆలయాలకు ప్రసిద్ధి పేరుతో వ్రాసిన బాల్కొండ చరిత్ర గ్రంథాన్ని మొదటగా హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ఆడిటోరియంలో ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ఆవిష్కరించనున్నట్లు అస్మక చరిత్ర పరిశోధక మండలి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి చరిత్రకారుడు కంకణాల రాజేశ్వర్ శనివారం మీడియా ద్వారా ఒక ప్రకటనలు తెలిపారు ఈ సందర్భంగా కంకణాల రాజేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ్ రాజన్ ముఖ్య అతిథిగా విచ్చేసి గ్రంధావిష్కరణ చేస్తారన్నారు విశిష్ట అతిథిగా మానవ హక్కుల కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య హాజరుకానున్నారన తెలిపారు కార్యక్రమాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి చరిత్ర పరిశోధకులు చరిత్రకారులు సాహితీవేత్తలు చరిత్ర అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కంకణాల రాజేశ్వర్ కోరారు
ఆకట్టుకుంటున్న ఎల్లమ్మ నాటకం
గాంధారి మండలంలోని కరక్వాడి గ్రామంలో శుక్రవారం నుండి రేణుక ఎల్లమ్మ జీవిత చరిత్ర నాటకాన్ని భాగవతాన్ని ప్రదర్శిస్తున్నారు. గ్రామానికి చెందిన పలువురు ఇటీవల రేణుక ఎల్లమ్మ నాటకాన్ని నేర్చుకున్నారు దానిని గ్రామంలో ప్రదర్శించడంతో ప్రజల ఆసక్తిగా తిలకిస్తున్నారు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు
సామూహిక సత్యనారాయణ వ్రతాలు
నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి శివారులో హైవేపై ఉన్న అంజనాద్రి ఆలయంలో శనివారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు ఉదయం ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన అనంతరం సత్యనారాయణ స్వామి వ్రతాలు చేపట్టారు ఈ సందర్భంగా భక్తులకు కన్నదానం చేశారు కార్యక్రమంలో ఆయా గ్రామాల భక్తులతో పాటు అంజనాద్రి ఆలయ ధర్మకర్త కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
2, మార్చి 2024, శనివారం
ఆధ్యాత్మిక వార్తలు మార్చి 2 2024
రేపు సాయిబాబా ఆలయ వార్షికోత్సవం
మద్నూర్ మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయ వార్షికోత్సవాన్ని ఆదివారం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు ప్రకాష్ తెలిపారు భారీ సంఖ్యలో భక్తులు వచ్చి విజయవంతం చేయాలని కోరారు వచ్చిన భక్తుల కోసం అన్నదానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని సూచించారు
వైభవంగా సంతోషిమాత ఆలయ వార్షికోత్సవము
మద్నూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న సంతోషిమాత ఆలయ వార్షికోత్సవాన్ని శుక్రవారం భక్తులు వైభవంగా నిర్వహించారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గణపతి నవగ్రహ పూజ అమ్మవారికి ప్రత్యేక మహాభిషేకము కుంకుమ పూజ పేద పండితుల మంత్రోచ్ఛారణలతో యాగం నిర్వహించారు అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు మహారాష్ట్రకు చెందిన భక్తులు సైతం పెద్ద సంఖ్యలో ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు
బిచ్కుందలో స్థానిక రంగర్ గల్లీలోని మహాలక్ష్మి ఆలయ వార్షికోత్సవాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు నైవేద్యాలు సమర్పించారు అనంతరం అన్నదానం చేశారు
శివరాత్రి వేడుకలకు ఆహ్వానము తాండూరు గ్రామంలోని సుప్రసిద్ధ త్రిలింగ రామేశ్వర ఆలయంలో నిర్వహించే శివరాత్రి ఉత్సవాలకు హాజరుకావాలని జిల్లా పాలనాధికారి జితేష్ వి పాటిల్ ఎస్పీ సింధు శర్మ గార్లను శుక్రవారం ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు కమిటీ అధ్యక్షులు కొమ్మ దత్తు ఎంపీపీ రాజదాసు సొసైటీ చైర్మన్ ఆర్కిడి గంగారెడ్డి సభ్యులు రమేష్ సాయిలు రాజశేఖర్ తదితరులు ఉన్నారు
తెలంగాణ తిరుమల దేవస్థానంలో శుక్రవారం ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు దర్శించుకున్నారు ఈ సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సత్కరించారు నాయకులు సాయికిరణ్ పోచిగుండా యోగేశ్వర రాజు తదితరులు ఉన్నారు
మహమ్మద్ నగర్ మండలం హసన్పల్లి గ్రామ శివారులోని పటేల్ చెరువు మైసమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి శుక్రవారం బోనాలు నిర్వహించారు పట్టు వస్త్రాలు పూలదండలు నైవేద్యాలు సమర్పించి మోక్కులు తీర్చుకున్నారు
బారడి పోచమ్మ పండుగ చించోలిలో శుక్రవారం భారతి పోచమ్మ పండుగను గ్రామస్తులు నిర్వహించారు స్థానిక హనుమాన్ ఆలయం నుంచి మహిళలు బోనాలు మంగళహారతులతో ఊరేగింపు చేపట్టారు అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించారు నైవేద్యాలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు గ్రామ ప్రజలకు అన్నదానం ఏర్పాటు చేశారు
29, ఫిబ్రవరి 2024, గురువారం
ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవం
బిచ్కుంద మండల కేంద్రంలో సద్గురు బసవలింగప్ప స్వామి సంస్థానమఠం ఆధ్వర్యంలో కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో శ్రీ గణపతి అన్నపూర్ణాదేవి నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు రెండు రోజులుగా సాగుతున్న ఉత్సవాలు గురువారం సంపూర్ణమయ్యాయి చివరి రోజు ఆలయంలో కుంకుమార్చన నిర్వహించగా పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు సద్గురు సోమయ్యప్ప స్వామి సిద్ధగయ శివాచార్య స్వామి ఆధ్వర్యంలో ఉత్సవాలు కొనసాగాయి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు
శ్వేత ప్రసాద్కు బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారము
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత కళాకారుని శ్వేతా ప్రసాద్ 2022 23 సంవత్సరానికి ప్రతిష్టాత్మక ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారకు ఎంపికయ్యారు కేంద్ర సంగీత నాటక అకాడమీ ఈ అవార్డును బుధవారం న్యూఢిల్లీలో ప్రకటించింది సంగీత విభాగం కర్ణాటక మ్యూజిక్ లో తెలంగాణ నుంచి శ్వేతా ప్రసాదం ఎంపిక చేశారు శ్వేతా ప్రసాద్ ప్రపంచవ్యాప్తంగా మూడు దశాబ్దాలుగా 2 వేలకు పైగా గాత్ర ప్రదర్శనలు నిర్వహించారు అన్నమాచార్య కృతులు త్యాగరాజ కీర్తనలతో ప్రదర్శనలు ఇచ్చారు దేశ విదేశాలలో భరతనాట్యము ఆంధ్ర నాట్యము కూచిపూడి విభాగాలలో ప్రముఖ నాట్య కళాకారులకు గాత్రము నట్టువాంగా సహకారం అందించారు పలు నృత్య ప్రదర్శనలకు స్వర కల్పన చేశారు అమెరికా చైనా మలేషియా టర్కీ సిరియా వియత్నాం దేశాలలో భారత సాంస్కృతిక మండలి తరఫున పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు
ప్రముఖ సినీ నటుడు రక్త కన్నీరు నాగభూషణం మనవారాలైన శ్వేతా ప్రసాద్ నాలుగేళ్ల ప్రాయంలోనే సంగీతం అభ్యసించారు కర్ణాటక ఓకల్ , లలిత సంగీతంలో ఆకాశవాణి ఏ గ్రేడ్ కళాకారుని ఆయన శ్వేతా ప్రసాద్ ప్రస్తుతం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంపీ చేస్తున్నారు
గంగాధరశాస్త్రికి సంగీత నాటక అకాడమీ అవార్డు
ప్రసిద్ధ గాయకుడు భగవద్గీత గాన ప్రవచన ప్రచారకర్త భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎల్వి గంగాధరశాస్త్రికి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది 2023 ఏడాదికి గాను ఇతర ప్రధాన సంప్రదాయ సంగీత విభాగంలో ఆయనకు ఈ పురస్కారం దక్కింది తాను అభ్యసించిన కర్ణాటక శాస్త్రీయ సంగీతంతో భగవద్గీతలోని 700 శ్లోకాలలో ఘంటసాల స్వరపరిచి పాడిన 108 శ్లోకాలను ఆయన గౌరవార్థం గంగాధర శాస్త్రి యథాతకంగా పాడారు అంతేకాదు మిగిలిన 594 శ్లోకాలను స్వీయ సంగీతంలో తెలుగు తాత్పర్య సహితంగా గానం చేశారు గతంలో గంగాధర శాస్త్రిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళా రత్న హంస పురస్కారంతో మధ్యప్రదేశ్ లోని మహర్షి పాడిని యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి అవార్డును ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు గంగాధర శాస్త్రి పేర్కొన్నారు అలాగే సంగీత నాటక అకాడమీ చైర్మన్ డాక్టర్ సంధ్యాపురేచతో పాటు జూరీ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు
ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
దోమకొండ మండలంలోని ముత్యంపేట గ్రామంలో ఉన్న ఎల్లమ్మ ఆలయ 60వ వార్షికోత్సవాన్ని గౌడ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు జడ్పిటిసి తిరుమల గౌడ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ ఆవరణలో సాయంత్రం ఘనంగా చక్రతీర్థం జరిగింది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ సీతారాం మధు సంతోష్ రెడ్డి గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
దోమకొండ మండలంలోని ముత్యంపేట గ్రామంలో రేణుకాదేవి అరవైవ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయంత్రం రేణుక ఎల్లమ్మ ఆలయం ఆవరణలో ఘనంగా చక్కెర తీర్థం జాతర జరిగింది రాత్రి 8 గంటల నుంచి శ్రీ సింగరాయపల్లి అంజయ్య శిష్యుల బృందం శ్రీ రేణుక ఎల్లమ్మ ఒగ్గు కథ కార్యక్రమం ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు కార్యక్రమంలో తీగల తిరుమల గౌడ్ నాని ప్రభాకర్ రెడ్డి ఆశ పోయిన శ్రీనివాస్ కదిరి గోపాల్ రెడ్డి సీతారాం మధు సంతోష్ రెడ్డి ఆలయ కమిటీ అధ్యక్షుడు ముత్తగారి శిరీష్ గౌడ్ సభ్యులు చిన్న పోష గౌడ్ స్వామి గౌడ్ భక్తులు పాల్గొన్నారు
ఇంటికే నేరుగా అయోధ్య హనుమంతుడి ప్రసాదం
అయోధ్యలోని హనుమాన్ గడి ఆలయ ప్రసాదం ఇకనుండి భక్తుల ఇంటికి నేరుగా చేరనున్నది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ట తర్వాత అయోధ్యలో భక్తుల రద్దీ బాగా పెరిగింది దీనితో చాలా మంది భక్తులకు అనుమానం గడి ఆలయ దర్శనం సాధ్యం కావడం లేదు ఈ నేపథ్యంలో భారతీయ తపాలా శాఖ హనుమాన్ గడి ఆలయ ప్రసాదాన్ని పోస్టల్ శాఖ ద్వారా ఇళ్లకు పంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ప్రసాదం కోసం దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి డిప్యూటీ పోస్ట్మాస్టర్ అయోధ్యర్ధం 224123 చిరునామాతో ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్లు తీయాలి భక్తుల చిరునామా ఇచ్చి ఆర్డర్ చేయాలి పిన్కోడు ఫోన్ నెంబర్ తప్పనిసరిగా నమోదు చేయాలి
ఇలా ఆర్డర్ చేశాక స్పీడ్ పోస్ట్ ద్వారా ప్రసాదాన్ని ఇంటికే పంపుతామని ప్రయాగరాజు వారణాసి జోన్ పోస్ట్మాస్టర్ జనరల్ కృష్ణకుమార్ తెలిపారు 251 ఒక్క రూపాయి మనీ ఆర్డర్ కు లడ్డూలు హనుమాన్ చిత్రం మహావీర్ గంధం అయోధ్య దర్శన పుస్తకం పంపుతారు
28, ఫిబ్రవరి 2024, బుధవారం
ఆ తల్లి పేరు దగ్గులవ్వ
భక్తులకున్న రకరకాల అవసరాలని బట్టి దేవతలు ఉంటారని మనకు తెలిసిందే వీసాలు ఇప్పించే చిలుకూరు బాలాజీ నుంచి పరీక్షలు పాస్ చేయించే విశాఖ వినాయకుడి దాకా అలా మనకు చాలా గుడులు పేరుొందాయి ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంలోని ఆ గుడికి ఒక ప్రత్యేకత ఉంది అందులో కొలువైన దేవత పేరు దగ్గులవ్వ పేరుకు తగినట్లే ఎటువంటి దగ్గు సమస్యలనైనా పోగుడుతుంది అన్నది భక్తుల విశ్వాసం బేల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కాలనీలో ఉండే ఈ గ్రామ దేవత ఆలయం అతి ప్రాచీనమైనదని అంటారు జలుబు నుంచి నిమోనియా దాకా ఏ సమస్య కారణంగా దగ్గు వచ్చిన ఈ తల్లికి మొక్కుకుంటారు పక్కనే ఉన్న పెన్గంగా నదినీటితో ఈ దేవతని అభిషేకించి దానిని దగ్గు తీర్చే తీర్థంగా తీసుకుంటారు వైద్యంతో అనారోగ్యం తగ్గాక అన్నదానం చేసి మొక్కులు చెల్లించుకుంటారు ప్రతి ఆషాడంలోనూ పెద్ద ఎత్తున పండగ చేస్తారు బోనాలు ఎత్తుతారు ఈ ఆలయంలో ఈ మధ్య కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేసి వైభవంగా ప్రాణ ప్రతిష్ట చేశారు
27, ఫిబ్రవరి 2024, మంగళవారం
ఆధ్యాత్మిక సమాచారము 28 ఫిబ్రవరి 2024
సదాశివ నగర్ మండలంలోని ఉత్తునూరు గ్రామంలో శ్రీ ఖండేరాయ ఆలయ వార్షికోత్సవాలలో భాగంగా బుధవారం సహస్ర ఘటాభిషేకం బోనాల ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ దొడ్ల రవి తెలిపారు మంగళవారం ముత్తునూరులో మంగళవారం శ్రీ ఖండరాయ ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మంటప పూజ హోమం నిర్వహించారు ఆలయ కమిటీ విడిసి చైర్మన్ దొడ్ల రవి గ్రామ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు
ఘనంగా రేణుక జమదగ్నిల్ల కళ్యాణం భిక్ నూర్ ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం రేణుకా జమదగ్నిల కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించారు ఈ నెల 24 నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు మహిళలు ఓడిబియ్యంతో మొ క్కులు చెల్లించుకున్నారు అనంతరం అన్నదానం చేపట్టారు
ఘనంగా బోనాల పండుగ మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో మంగళవారం రాత్రి రేణుక ఎల్లమ్మ బోనాలు ఊరేగింపు ఘనంగా నిర్వహించారు పురస్కరించుకొని గౌడ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలు ఊరేగింపు తీశారు గడపగడప నుంచి బోనాలు నైవేద్యాలతో ఆడపడుచులు ఆటపాటలు బ్యాండ్తో శివశక్తుల పూనకాలతో అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా తరలివచ్చారు అమ్మవారి ఆలయం వద్ద బోనాలతో మొక్కులు చెల్లించుకున్నార. కుమార్ కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు బోనాల ప్రదర్శన ఉత్సవాలను ప్రత్యేక జరుపుతున్నారు గౌడ సంఘం సభ్యులు మోతె రామా గౌడ్ గంగా గౌడ్ రాజా గౌడ్ రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
ముత్యంపేటలో ఎల్లమ్మ బోనాలు దోమకొండ మండలం ముత్యంపేటలో మంగళవారం ఎల్లమ్మ బోనాల పండుగ వైభవంగా నిర్వహించారు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు శిరీష్ గౌడ్ ప్రతినిధులు పోష గౌడ స్వామి గౌడ్ మోహన్ గౌడ్ సితా గౌడ్ గోపాల్ గౌడ్ నారా గౌడ్ పాల్గొన్నారు
ఆలయ అభివృద్ధికి విరాళము మాచారెడ్డి మండలం చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా నాగుపాము పుట్టపైన రేకుల షెడ్డు నిర్మాణానికి సిరిసిల్లకు చెందిన ఎండ్రాల ముఖ్యం రావు లక్ష్మీ దంపతులు 1,50,000 రూపాయలతో పనులు చేయిస్తామని పేర్కొన్నారు అందులో భాగంగా మంగళవారం 50వేల రూపాయలు ఆలయ నిర్వహణకు అందజేశారు కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ సంతోష్ అర్చకుడు పాల్గొన్నార.
ఎల్లారెడ్డి లోని బగలాముఖి పీఠం కాలమానిని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా మంగళవారం ఆవిష్కరించారు కార్యక్రమంలో పీఠం వ్యవస్థాపకుడు క్రాంతి పటేల్ లక్ష్మీనారాయణ సభ్యులు రేవంతప్ప సతీష్ మధు శివ నారాయణ తదితరులు పాల్గొన్నారు
జిల్లా కేంద్రంలోని శివాలయాలలో పూజలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆయా శివాలయాలలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు బ్రాహ్మణ గల్లి శివాలయం తో పాటు అశోక్ నగర్ విద్యానగర్ కాకతీయ నగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలలోని ఆలయాలలో అభిషేకాలు చేశారు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు





























