CHARITABLE TRUSTS లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
CHARITABLE TRUSTS లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, మార్చి 2024, శుక్రవారం

అంతిమయాత్ర రథం అందజేత

 

కామారెడ్డికి చెందిన కేపీ రాజారెడ్డి జన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో టౌన్ లో అంతిమయాత్రకు ఉపయోగించే రథాన్ని ట్రస్టు ప్రతినిధులు గొల్లవాల కవరస్తాన్ ప్రతినిధులకు శుక్రవారం అందించారు లక్షల రూపాయల విలువ చేసే వెహికల్ ఇవ్వడం పట్ల ట్రస్టు సభ్యుడు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డికి ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు

28, మార్చి 2024, గురువారం

నిజామాబాద్ నగరానికి పుంగనూరు ఆవులు

 


నిజామాబాద్ నగరంలోని మంచాల శంకరయ్య గుప్తా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ పుంగనూరు ఆవులను కొనుగోలు చేసి తన స్వగృహానికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా మంచాల జ్ఞానేందర్ మాట్లాడుతూ నేటి కాలంలో కుక్కలు పిల్లలను పెంచే కన్నా ప్రతి ఒక్కరు ఇలాంటి ఆవులను పెంచాలని ఆయన సూచించారు ఈ ఆవులు కేవలం రెండు అడుగుల ఎత్తు ఉండడం వలన చిన్న చిన్న ఇండ్లలో కూడా సంతోషంగా పెంచుకోవచ్చు అని ఆయన తెలిపారు ఈ ఆవులను చూడడానికి పలువురు వారి ఇంటికి రావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మంచాల శ్రీ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు

మంచాల శంకరయ్య గుప్త చారిటబుల్ ట్రస్ట్,నిజామాబాద్..


19, మార్చి 2024, మంగళవారం

చింతల పోషవ్వకు ఉమెన్ ఎనర్జీ అవార్డు

 కామారెడ్డికి చెందిన దివ్య హస్తం ఆర్గానిక్ ఉత్పత్తుల సంస్థ యజమాని చింతల పోషవ్వను ఉమెన్ ఎనర్జీ అవార్డు వరించింది హైదరాబాదుకు చెందిన ఉమెన్ ఎనర్జీ ఇంటర్నేషనల్ సంస్థ సోమవారం హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డును ప్రధానం చేసింది దివ్యాంగురాలు అయిన పోషవ్వ ఆర్గానిక్ ఉత్పత్తుల తయారీలో చేస్తున్న కృషికిగాను ఈ అవార్డును అందించినట్లు సంస్థ నిర్వాహకులు ప్రకటించారు



18, మార్చి 2024, సోమవారం

మానవత్వానికి జీవం పోయాలి సీనియర్ సివిల్ న్యాయాధికారి

 సభ్య సమాజంలో మనుషులు మానవత్వాన్ని మరిచిపోతున్నారని మానవత్వానికి జీవం పోయాలని సీనియర్ సివిల్ న్యాయాధికారి నసీం సుల్తానా అన్నారు ఆదివారం పట్టణంలోని చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఉచిత ఆపరేషన్లు కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అంటూ ఎం జె ఆస్పత్రి డాక్టర్ మధుశేఖర్ చేయూత సంస్థ ద్వారా సేవ చేయడం అభినందనీయమన్నారు తల్లిదండ్రులను మరిచిపోతున్న సమాజం ఇలాంటి డబ్బులను ఆశించకుండా పేదవారికి సేవలు చేస్తున్నారని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని తనకు నచ్చిన సేవలను చేస్తూ ముందుకు సాగాలని ఆమె అన్నారు ఈ ఉచిత క్యాంపు ద్వారా సుమారు వందమంది మహిళలకు ఆపరేషన్లు చేసినట్లు డాక్టర్ మధు శేఖర్ తెలిపారు అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా సీనియర్ సివిల్ న్యాయాధికారి నసీం సుల్తానా తో పాటు మరికొందరు మహిళా డాక్టర్లను పట్టు శాలువా పూలమాల మేమంటోతో డాక్టర్ మధు శేఖర్ దంపతులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో చేయూత స్వచ్ఛంద సంస్థ సభ్యులు కలిగుట గంగాధర్ బి నాగరాజు ఐడియా సాగర్ డాక్టర్ శ్రీలత ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు



ఏ ఎస్ ఆర్ ఫౌండేషన్ కామారెడ్డి జిల్లా కార్యవర్గం

 ఏఎస్ఆర్ ఫౌండేషన్ జిల్లా చైర్మన్గా శ్రీనివాసరావును నియమించినట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు అయ్యాల సంతోష్ తెలిపారు ఆదివారం బాన్స్వాడలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో వైఎస్ఆర్ ఫౌండేషన్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు  చైర్మన్గా శ్రీనివాసరావు , సంస్థ జిల్లా అధ్యక్షుడిగా బంగారు రవి, ప్రధాన కార్యదర్శిగా వాగ్మా రే బాలు ఉపాధ్యక్షులుగా రోటే  సాయిలు కోడంరాజు కోశాధికారిగా కల్లూరి రాజారాం సంయుక్త కార్యదర్శి లుగా విజయ్ , వస్సి  ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బొప్పని శ్రీనివాస్ ,సంగు గోవర్ధన్ తదితరులు ఎన్నిక అయ్యారు



15, మార్చి 2024, శుక్రవారం

అభయ హస్తం ఫౌండేషన్ పెళ్లి కానుక

 కోటగిరి మండల కేంద్రంలోని అమ్మ అనాధాశ్రమం విద్యార్థినికి అభయ హస్తం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పెళ్లి కానుకలు అందజేశారు ఈ సందర్భంగా సభ్యుడు బర్ల మధుకర్ మాట్లాడుతూ 2009లో ప్రారంభించిన అమ్మ అనాధాశ్రమం అనాధలకు వికలాంగులకు వారికి పెళ్లి చేయడం ఎంతో గొప్ప విషయం అన్నారు 2009లో పావని వికలాంగురాలు అధైర్య పడకుండా అమ్మ వెంకట రమణమ్మకు తోడుగా చేసుకుని ఆశ్రమాన్ని ప్రారంభించి ఎందరినో అనాధాలను వికలాంగులను చదివించి మంచి ర్యాంకులతో పాటు మెజారిటీలు సాధించి ఆర్మీలో ఉద్యోగాలు సంపాదించడం ఎంతో ఆనందదాయకమన్నారు నేడు పావని స్వర్గస్తులైనా కూడా ఆమె ఆశ్రమం ఆగిపోకుండా వారికి పెళ్లిళ్లు చేయడం బాధ్యత తీసుకోవడం మర్చిపోలేని అనుభూతి అన్నారు ఈ ఆశ్రమంలో విద్యార్థినికి ఇటీవల పెండ్లి కుదరడంతో పెండ్లికి కానుకగా అమ్మాయికి సంబంధించిన నూతన వస్త్రాలను ఇతర కానుకలను అభయహస్తం ఫౌండేషన్ వారి సహకారంతో అందజేయడం జరిగిందన్నారు వారికి ఎల్లవేళలా సహకారం ఉంటుందని బర్ల మధుకర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సభ్యులు బాలసాయి చిత్తర నరేందర్ శ్రీకాంత్ కూర్చారు ఇందూరు సాయి గంగాధర్ రాజు ఆశ్రమం లక్ష్మణ్ బర్ల శ్రీధర్ ఉన్నారు



13, మార్చి 2024, బుధవారం

మజ్జిగ వితరణ

 బాన్సువాడ పట్టణంలోని రామ్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో 500 మంది ప్రయాణికులు పేదలకు మంగళవారం మజ్జిగ పంపిణీ చేశారు సభ్యులు మాట్లాడుతూ దాతర సహకారంతో 50 రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు సంస్థ అధ్యక్షుడు నాగరాజు ఉన్నారు

7, మార్చి 2024, గురువారం

ఆవాసానికి విరాళం

 


భైంసా పట్టణంలోని వివేకానంద ఆవాసానికి మండల కేంద్రమైన కుంటాలకు చెందిన తాటి పద్మావతి సోమేశ్వర్ దంపతులు తమ పెళ్లిరోజు సందర్భంగా బుధవారం విరాళాన్ని అందజేశారు కుంటాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న సోమేశ్వర్ 5100 విరాళాన్ని ఆవాసం నిర్వాహకులకు అందించారు ఈ సందర్భంగా ఆవాసం పిల్లలతో కలిసి భోజనం చేశారు ఇందులో విద్యార్థులకు ఒకరోజు భోజనం ఖర్చు వ్యక్తిగత ఫైల్స్ ను అందించారు ఆవాస కమిటీ సభ్యులు వీరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు

5, మార్చి 2024, మంగళవారం

పేదలకు అండగా వరల్డ్ విజన్

 లక్ష్మణ చాందా మండలంలోని మునిపల్లి గ్రామానికి చెందిన ముండ్ల మమతా నిరుపేద కుటుంబానికి జీవనోపాధి రీత్యా కిరాణా దుకాణం ప్రారంభించేందుకు వరల్డ్ విజన్ సంస్థ తరఫున 20000 రూపాయలతో పాటు షాపులోని సరుకులను స్టేషనరీని విరాళంగా అందజేశారు కష్టాలలో ఉన్న తమను గుర్తించి ఉపాధి కల్పించిన వరల్డ్ విజన్ వారికి మమతతో పాటు తమ కుటుంబ సభ్యులు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ హనుమన్న నాయకులు శేఖర్ రెడ్డి రమేష్ క్రమ కమిటీ ప్రెసిడెంట్ అశోక్ వరల్డ్ విజన్ సిబ్బంది ఉన్నారు



3, మార్చి 2024, ఆదివారం

రూపాయి పెళ్లి అదిరింది

 రూపాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యంగా జంట ఆదర్శ వివాహం ఘనంగా జరిగింది సంగారెడ్డి చెందిన దివ్యాంగురాలు ప్రవళిక మేడ్చల్ కు చెందిన మట్టా రమేష్ గౌడ్ ఆదర్శ వివాహానికి పలువురు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు ఆదివారం సైదాబాద్ మెయిన్ రోడ్డుపై ఉన్న ఎస్బిఐ బిల్డింగ్ ఆర్య ఈవెంట్స్ ఈ వేడుకకు వేదికైనది హిందూ సంప్రదాయ పద్ధతిలో రూపాయి ఫౌండేషన్ చైర్మన్ నాగమల్లా అనిల్ కుమార్ అరుణ ఈ వివాహాన్ని జరిపించారు ఆదివారం నమస్తే తెలంగాణలో రూపాయికే పెళ్లి శీర్షికతో ప్రచురితమైన కథనానికి స్పందించిన వందలాదిమంది గూగుల్ పే ద్వారా రూపాయి చెల్లించారని ఫౌండేషన్ తెలిపారు ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ సర్వీస్ ఫండ్ ఇన్చార్జి లక్ష్మీనారాయణ పెండ్లి కూతురు తల్లికి 25వేల రూపాయల చెక్కు అందజేశారు వివాహానికి హాజరైన వారంతా కట్న కానుకలు చదివించారు నిలోఫర్ కేఫ్ అధినేత ఏ బాబురావు అతిథులకు ఆహుతులకు స్నాక్స్ అందజేశారు కార్యక్రమంలో గడ్డి అన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు



రూపాయి కే పెండ్లి

 ఒక్క రూపాయితో రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు దివ్యాంగులకు వివాహం చేస్తామంటున్నది రూపాయి ఫౌండేషన్ ఆదివారం ఒక జంటను ఒకటి చేయనున్నది కూడా సామాజిక సేవలో భాగంగా 15 ఏళ్లుగా దాదాపు 100కు పైగా అనాధలు దివ్యాంగ జంటలకు వివాహాలు జరిపించిన అమ్మ ఫౌండేషన్ నిర్వాహకులు నాగమళ్ళ అనిల్ కుమార్ అరుణ ఇటీవల రూపాయి ఫౌండేషన్ పేరుతో మరో సేవా సంస్థను స్థాపించారు రూపాయితో తమ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకుంటే దివ్యాంగ జంటకు ఉచితంగా పెళ్లి చేస్తామని చెప్తున్నారు సంగారెడ్డికి చెందిన ప్రవళికకు మేడ్చల్కు చెందిన మట్టా రమేష్ తో సైదాబాద్ మెయిన్ రోడ్డు పై ఉన్న ఎస్బిఐ బిల్డింగ్ ఆర్య ఈవెంట్స్ లో ఆదివారం ఉదయం 11 గంటలకు వివాహం జరిపించేందుకు ఏర్పాటు చేశారు దాచిన రూపాయి నిన్ను ధనవంతుడిని చేస్తుంది దానం చేస్తే అదే రూపాయి నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది అన్న నినాదంతో వివాహాలకు అవసరమైన విరాళాలను సేకరిస్తున్నది రూపాయి ఫౌండేషన్ ఇలాంటి వివాహాలకు ఆర్థిక చేయుట నిచ్చేందుకు తమ వంతుగా ఒక్క రూపాయి విరాళంగా ఇవ్వాలని నాగమల్ల అని అరుణ విజ్ఞప్తి చేశారు 9246576070 గూగుల్ పే.

2, మార్చి 2024, శనివారం

ఇందూర్ బ్లడ్ బ్యాంక్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ధన్పాల్

 ద్వారకానగర్లో భువన సమీక ట్రస్ట్ వారు నూతనంగా ఏర్పాటు చేసిన ఇందూరు బ్లడ్ బ్యాంకు ను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మొదటగా ఇందూరు పేరుతో బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేసిన యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలుపుతూ మానవసేవే మాధవసేవ అనే విధంగా రక్తదానం అన్ని దానాలలో కన్నా మిన్నా అని రక్తదానంతో ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టవచ్చునని 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కుతో పాటు రక్తదానం బాధ్యతగా తీసుకొని ప్రతి మనిషి సంవత్సరానికి ఒకసారి రక్తదానం చేయాలని అత్యవసర సమయాలలో బ్లడ్ మరియు బ్లడ్ కాంపోనెంట్స్ సేవలు బ్లడ్ బ్యాంక్ ద్వారా ప్రజలకు ఉపయోగకరంగా అందుబాటులో ఉంటుందని అన్నారు కార్యక్రమంలో ఇండోర్ బ్లడ్ బ్యాంక్ యాజమాన్యం డాక్టర్ దామోదర్ రావు డాక్టర్ శ్రీశైలం డాక్టర్ శివప్రసాద్ డాక్టర్ రాజేష్ డాక్టర్ జీవన్ రావు డాక్టర్ వినయ్ శ్రీవాణి ధన్పాల్ కార్పొరేటర్స్ బైక్ అండ్ మధు ప్రభాకర్ బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నార



సబల సత్యభామ చింతల పోశవ్వ

 పర్యావరణ పరిరక్షణ సామాజిక సేవా కార్యక్రమాలలో భాగస్వాములు అవుతున్న కామారెడ్డికి చెందిన దివ్యహస్తం ట్రస్ట్ బాధ్యురాలు చింతల పోషవాకు సబల సత్యభామ పురస్కారం దక్కింది హైదరాబాదులో శుక్రవారం సామాజికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు సామాజిక సేవలకు గాను పురస్కారం దక్కడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు పర్యావరణ పరిరక్షణ సామాజిక సేవా కార్యక్రమాలలో భాగస్వాములు అవుతున్న కామారెడ్డికి చెందిన దివ్యహస్తం ట్రస్ట్ బాధ్యురాలు చింతల పోషవ్వకు సబల సత్యభామ పురస్కారం దక్కింది హైదరాబాదులో శుక్రవారం సామాజికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు సామాజిక సేవలకు గాను పురస్కారం దక్కడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. గోని వెంకటేశ్వర్ సేవా సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జరిగిన కార్యక్రమంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సబల సత్యభామ పురస్కారానికి చింతల పోషవ్వ గారు ఎంపికయ్యారు పోషవ్వ తన దివ్య హస్తం ట్రస్టు ద్వారా గత 20 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న సేవ్ ఎన్విరాన్మెంట్ వర్క్ లో భాగంగా కౌడంగ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళ నాయకురాలుగాను ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు గాను సభల సత్యభామ అవార్డును ప్రముఖ సామాజికవేత్త ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త డాక్టర్ అనంతలక్ష్మి చేతులమీదుగా తీసుకున్నారు ఆమె చేస్తున్న సేవలకు గాను పురస్కారం అందుకోవడం పట్ల పలువురు సామాజికవేత్తలు పర్యావరణవేత్తలు అభినందనలు తెలిపారు..





29, ఫిబ్రవరి 2024, గురువారం

అక్షయపాత్ర సేవలు అమోఘము

 అక్షయపాత్ర ఫౌండేషన్ మంచి లక్ష్యంతో సమాజానికి అందిస్తున్న సేవలు అమోఘమని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కొనియాడారు అందరి ఆకలి తీరుస్తూ అండగా నిలుస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్ భవిష్యత్తులో మరిన్ని విజయ శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని అక్షయపాత్ర ఫౌండేషన్ 15వ వార్షికోత్సవాన్ని బుధవారం నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ ఎన్వి రమణ మాట్లాడుతూ అక్షయపాత్ర ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు కావలసిన పోషకాహారాన్ని అందిస్తూ ఆ లోపాన్ని తొలగిస్తుందని అభినందించారు అక్షయపాత్ర ఫౌండేషన్ వంటి లాభావేక్షలని సంస్థలను ప్రోత్సహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు తనవంతుగా అక్షయపాత్రకు ఎన్ని రమణ 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు యంత్రాలను ప్రారంభించారు కార్యక్రమంలో అక్షయపాత్ర ఫౌండేషన్ చైర్మన్ మధు పండిత దాస హైదరాబాద్ ట్ర స్ట్ ప్రాంతీయ అధ్యక్షుడు సత్య గౌరవ చంద్ర పాల్గొన్నారు

27, ఫిబ్రవరి 2024, మంగళవారం

25 లక్షల మంది బాలలకు రాగి జావా

 


తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల మంది విద్యార్థులకు పౌష్టికాహారంగా రాగిజావ అందించనున్నట్లు బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న గ్లోబల్ హ్యుమానిటేరియన్ మిషన్ ఫౌండర్ సద్గురు మధుసూదన్ సాయి వెల్లడించారు మంగళవారం ప్రత్యేక హెలికాప్టర్లు వచ్చిన ఆయన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు ఆయనకు వైదిక పండితులు వేదా ఆశీర్వచనం అందించారు విలేకరులతో మాట్లాడారు ప్రపంచంలోని 33 దేశాలలో తమ సంస్థ విద్యా వైద్యం పోషకాహార రంగాలలో సేవలు అందిస్తున్నదని వివరించారు ప్రతి ఒక్కరు పరోపకారం అలవర్చుకోవాలని భగవంతుని చెబుతుండే వారిని దీనిని తమ పాటిస్తున్నామని తెలిపారు. భద్రాచలం రామాలయం అభివృద్ధికి సర్కారు సంస్థలు సమాజము కృషి చేయాలని ఇందులో తమ సంస్థ భాగస్వామిగా ఉంటుందని తెలిపారు శ్రీరామనారాయణ తరుణంలో పట్టాభిషేకం రోజున ఉపయోగించే స్వర్ణ రాజ కడగాన్ని బహుకరిస్తామని వెల్లడించారు కార్యక్రమంలో నందిని మాట్లాడుతూ స్వచ్ఛందంగా సేవ చేసే వారికి ప్రభుత్వం సహకరిస్తుందన్నారు వంగల శేషాద్రి వేణుమాధవ్ విష్ణు శశి పాల్గొన్నారు

26, ఫిబ్రవరి 2024, సోమవారం

3000 ఎకరాల్లో వంతారా

 జంతు సంరక్షణకు రిలయన్స్ కృత్రిమ అడవి గుజరాత్ లోని జాంనగర్ లో ఏర్పాటు

గాయపడిన ఇబ్బందుల్లో ఉన్న జంతువులను సంరక్షించే లక్ష్యంతో వంతారా కార్యక్రమాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రిలయన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ అనంత అంబానీ సోమవారం ప్రారంభించారు దేశ విదేశాలలో గాయపడిన ప్రమాదంలో చెక్కుకున్న జంతువులను కాపాడి చికిత్స చేసి సంరక్షించి పునరావాసం కల్పించడం వంటారా ముఖ్య లక్ష్యం వంతరా అనేది కృత్రిమ ఆడది గుజరాత్ లోని జాంనగర్ రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్లో 3000 ఎకరాల్లో ఇది ఉన్నది ఈ అడవిలో 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా దవాఖాన ఉంది ఇది ప్రపంచంలోనే అతి పెద్దది

దిగ్గజ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన రిలయన్స్ ఫౌండేషన్ వంతారా పేరిట సమగ్ర జంతు సంరక్షణ పునరావాస కేంద్రాన్ని ప్రారంభించింది గాయపడిన జంతువులను రక్షించడం చికిత్స అందించడం వాటి సంరక్షణ పునరావాసం కోసం ఏర్పాటు చేయడం దీని ముఖ్య ఉద్దేశం గుజరాత్ లోని జాంనగర్ రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్ గ్రీన్ బెల్టులో 3000 ఎకరాల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేశారు అనంతరం కృత్రిమ అడవిగా భావించొచ్చు. దానిలో జంతువులు నివసించేందుకు సహజ రీతిలో వసతులు కల్పించారు ఇందులో ఏనుగుల కోసం 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు శాస్త్ర చికిత్సల కోసం లేజర్ సాధనాలు అధునాతన సదుపాయాలు దాని సొంతం అంతారా కోసం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ వంటి సంస్థలతో జట్టు కట్టడంపై రిలయన్స్ ఫౌండేషన్ విష్ణు సారించింది కృత్రిమ అడవి ఏర్పాటు పై రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంతం బాని మాట్లాడుతూ తనకు చిన్నప్పటి నుంచే జంతువులను కాపాడడం అభిరుచిగా ఉండేదని పేర్కొన్నారు కోవిడ్ మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉన్నప్పుడే తాము వంతర నిర్మాణాన్ని ప్రారంభించామని అన్నారు దాని ఏర్పాటుతో తమ కృషికి భారత్లోనే కాకుండా అంతర్జాతీయంగా గుర్తింపు లభించినందుకు సంతోషిస్తున్నామని తెలిపారు


ఆహార పదార్థాలు మిగిలిపోతే

 కామారెడ్డి పట్టణ పరిధిలో నిర్వహించే శుభకార్యాలలో ఆహార పదార్థాలు మిగిలిపోతే బాంబే క్లాత్ హౌస్ లో అందజేయాలని నిర్వాహకులు కోరారు తాము వెంటనే పేదలకు పంపిణీ చేస్తామని తెలిపారు వివరాలకు 9441922678 9963530055 నెంబర్లను సంప్రదించాలని సూచించారు

24, ఫిబ్రవరి 2024, శనివారం

ట్రస్ట్ ఆధ్వర్యంలో కంటి అద్దాల పంపిణీ

 మాచారెడ్డి గ్రామంలో ఫిబ్రవరి 13వ తారీకున నిర్వహించిన హెల్త్ క్యాంపులో కంటి పరీక్షలు నిర్వహించి ఎవరికైతే కంటి అద్దాలు అవసర పడ్డాయి వారికి శ్రీ ముత్యాల లక్ష్మీనరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నరసింహ రెడ్డి కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఎవరికి ఆపరేషన్ అవసరమయ్యే వారికి కూడా అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేటలో పదిమందికి మొదటి విడుదల ఆపరేషన్ చేయించడం జరిగింది. ఈ రోజుల్లో పేదవారిని గుర్తించి ఆపరేషన్లు చేపిస్తూ అవసరమున్నవారికి కంటి అద్దాలు ఇస్తున్న ముత్యాల నరసింహారెడ్డి లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని గ్రామస్తులు వృద్ధులు ధన్యవాదాలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో మండల రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బంజారా నవీన్ రెడ్డి సంతోష్ రెడ్డి రామిరెడ్డి రాజిరెడ్డి కిషన్ గౌడ్ పాల్గొన్నారు

22, ఫిబ్రవరి 2024, గురువారం

స్కూల్ బ్యాగుల వితరణ

 నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలకు చెందిన 225 మంది విద్యార్థులకు బుధవారం శ్రీరామ సేవా సమితి శ్రీ సాయి సేవా సమితి ఆధ్వర్యంలో బ్యాగులు నీళ్ల సీసాలు పాఠశాలకు మూడు పంకాలు వితరణ చేశారు ట్రస్ట్ సభ్యులు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వీణ  సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు




19, ఫిబ్రవరి 2024, సోమవారం

ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి లో సభ్యత్వం తీసుకున్న సీఎం రేవంత్ షబ్బీర్ అలీ

 ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి అసోసియేషన్ మాచారెడ్డి మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల నుండి కొంతమంది సభ్యులు ఒక సంఘంగా ఏర్పడి మాకు తోచిన విధంగా చిన్న చిన్న సహాయం చేయడం జరుగుతుంది. మేము చేసే మంచి కార్యక్రమాలను చూసి ప్రేరణ పొంది మహమ్మద్ షబ్బీర్ అలీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ సలహాదారులు తాను సభ్యత్వం తీసుకోవడంతో పాటు కుటుంబ సభ్యులకు కూడా సభ్యత్వం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మేము చేసే మంచి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కూడా నెలసరి రుసుము 500 రూపాయలతో సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఇది ఒక మంచి శుభ పరిణామంగా ఫ్రెండ్స్ అసోసియేషన్ గర్వపడుతున్నాము స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసోసియేషన్ లో భాగమైనందుకు సంతోషిస్తున్నామని ఈ వెల్ఫేర్ ద్వారా మరింత మందికి పేదలకు అనాధ పిల్లలకు చదువుకునే పిల్లలకు మరింత సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు