రూపాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యంగా జంట ఆదర్శ వివాహం ఘనంగా జరిగింది సంగారెడ్డి చెందిన దివ్యాంగురాలు ప్రవళిక మేడ్చల్ కు చెందిన మట్టా రమేష్ గౌడ్ ఆదర్శ వివాహానికి పలువురు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు ఆదివారం సైదాబాద్ మెయిన్ రోడ్డుపై ఉన్న ఎస్బిఐ బిల్డింగ్ ఆర్య ఈవెంట్స్ ఈ వేడుకకు వేదికైనది హిందూ సంప్రదాయ పద్ధతిలో రూపాయి ఫౌండేషన్ చైర్మన్ నాగమల్లా అనిల్ కుమార్ అరుణ ఈ వివాహాన్ని జరిపించారు ఆదివారం నమస్తే తెలంగాణలో రూపాయికే పెళ్లి శీర్షికతో ప్రచురితమైన కథనానికి స్పందించిన వందలాదిమంది గూగుల్ పే ద్వారా రూపాయి చెల్లించారని ఫౌండేషన్ తెలిపారు ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ సర్వీస్ ఫండ్ ఇన్చార్జి లక్ష్మీనారాయణ పెండ్లి కూతురు తల్లికి 25వేల రూపాయల చెక్కు అందజేశారు వివాహానికి హాజరైన వారంతా కట్న కానుకలు చదివించారు నిలోఫర్ కేఫ్ అధినేత ఏ బాబురావు అతిథులకు ఆహుతులకు స్నాక్స్ అందజేశారు కార్యక్రమంలో గడ్డి అన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు
No comments:
Post a Comment