వైభవంగా ప్రాణ ప్రతిష్ట
పిట్ల మండల కేంద్రంలోని చెరువు కట్ట వద్ద వడ్ల కమ్మలు నూతనంగా నిర్మించిన కాళికాదేవి ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం వైభవంగా నిర్వహించారు ఉదయం నుంచి ఆలయ ప్రాంగణంలో నవగ్రహ పూజ గణపతి హోమం వాస్తు పూజ కలశ స్థాపన తదితర కార్యక్రమాలను వేద పండితుల మంత్రం చారణాల నడుమ చేపట్టారు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు ఉత్సవాలలో ఆలయ కమిటీ సభ్యులు రామకృష్ణ వడ్ల లక్ష్మణ్ కమ్మరి ముత్యం వడ్ల సంతోష్ వడ్ల భూమయ్య గణపతి నరసింహులు చారి తదితరులు పాల్గొన్నారు
ఘనంగా పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణోత్సవం
బీబీ పేట్ మండలంలోని మాందాపూర్ గ్రామంలో వన దుర్గ పెద్దమ్మ ఆలయ ఐదో వార్షికోత్సవం సందర్భంగా బుధవారం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు గ్రామస్తులకు అన్నదానం చేశారు సాయంత్రం అమ్మవారికి బోనాలు సమర్పించారు కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం ప్రతినిధులు సభ్యులు భక్తులు గ్రామస్తులు నాయకులు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment