తెలంగాణ మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనారిటీ స్టడీ సర్కిల్ హైదరాబాదులోని శిక్షణ కేంద్రంలో యుపిఎస్సి సి షాట్ 2024 25 సంవత్సరానికి గాను ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి దయానంద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు 100 మంది డిగ్రీ పూర్తి చేసిన మైనారిటీ ముస్లిం క్రిస్టియన్ బుద్దిస్ట్ పార్శి అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు అభ్యర్థులు www.tmreistelangana.cgg.gov.in వెబ్సైట్లో ఏప్రిల్ 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు ఏప్రిల్ 28న ఆదివారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తెలంగాణ మైనారిటీ గురుకుల బాలుర పాఠశాల కామారెడ్డిలో హైదరాబాద్ వారిచే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారని తెలిపారు మరిన్ని వివరాలకు 04023236112 ఫోన్ నెంబర్ను సంప్రదించాలని సూచించారు
No comments:
Post a Comment