Monday 18 March 2024

బీమా పాలసీల మోసపూరిత అమ్మకాలు ఆపండి

 బీమా పాలసీల మోసపూరిత అమ్మకాలను నిలువరించి ఖాతాదారుల ప్రయోజనాలు కాపాడాలని ప్రభుత్వరంగ బ్యాంకులకు ఆర్థిక శాఖ సూచించింది ఆర్థిక సర్వేసుల శాఖ కార్యదర్శి వివేక్ జోషి ఈ విషయం చెబుతూ బీమా పాలసీల విక్రయంలో మోసపూరిత అనైతిక విధానాలు అనుసరిస్తున్నారు అన్న ఫిర్యాదులు తమకు నిరంతరం అందుతూనే ఉన్న నేపథ్యంలో బ్యాంకులకు ఈ సూచన చేసినట్లు తెలిపారు బ్యాంకు కస్టమర్ల నుంచి పాలసీలు చేయించడం కోసం జీవిత బీమా కంపెనీలు బ్యాంకులు కూడా ఈ తరహా విధానాలు అనుసరిస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని ఆయన అన్నారు కస్టమర్లు ఏదైనా రుణం తీసుకునేందుకు టర్మ్ డిపాజిట్ చేసేందుకు బ్యాంకుకు వెళ్లిన సమయంలో వారికి పాలసీలు అంటగడుతూ ఉంటారు ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలలో 75 సంవత్సరాల వయసు పైబడిన కస్టమర్లకు కూడా జీవిత బీమా పాలసీలు అంటగట్టిన సందర్భాలు ఉన్నాయని తేలింది పాలసీ తీసుకునే విషయంలో కస్టమర్లు ప్రతిఘటించిన తమకు పైనుంచి ఒత్తిడిలు వస్తున్నట్లు బ్యాంకు అధికారులు చెబుతున్న విషయం కూడా వెలుగులోకి వచ్చింది ఇలాంటి ధోరణులపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ అభ్యంతరం ప్రకటించింది భీమా ఉత్పత్తులు విక్రయించినందుకు ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల బ్యాంకు సిబ్బందిపై ఒత్తిడి పెరగడంతో పాటు ప్రధాన వ్యాపార లక్ష్యం దెబ్బతింటుందని వ్యాఖ్యానించింది

No comments:

Post a Comment