Monday 25 March 2024

రేషన్ బియ్యం అమ్మ వద్దు

 గత ఏడాది నుంచి రేషన్ బియ్యం లో పోషకాలు కలుపుతున్నారు. ఇది తెలియక చాలామంది ప్లాస్టిక్ పీఎం అనుకొని రేషన్ బియ్యాన్ని వ్యాపారులకు విక్రయిస్తున్నారు ప్రజలకు పౌష్టికాహారం అందించాలని ఉద్దేశంతో ప్రభుత్వము అన్ని రైస్ మిల్లుల్లో బ్లెండింగ్ యూనిట్లు ఏర్పాటు చేయించింది సాధారణ బియ్యానికి పోషకాలు జతచేసి లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు క్రమం తప్పకుండా ఈ బియ్యం పాడితే మహిళల్లో రక్తహీనత తగ్గుతుందని ప్రభుత్వం పేర్కొంది జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల 53 వేల కార్డుదారులకు ప్రతినెల 5478 మెట్రిక్ టన్నుల బియ్యం అందజేస్తున్నారు



నీటిపై తేలుతున్నాయని పారేయవద్దు

సాధారణ బియ్యం తినడంతో శరీరానికి అంతగా పోషకాలు అందవు అందుకే ప్రభుత్వం సాధారణ బియ్యంలో పోషకాలు కలుపుతోంది 99 కిలోలకు బియ్యానికి ఒక కిలో పోషకాలు జత చేస్తున్నారు ఈ ప్రక్రియ అంతా రైస్ మిల్లులోనే పూర్తవుతుంది బియ్యం వన్డే ముందు కడిగేటప్పుడు నీటి మీద కొన్ని గింజలు తేలుతాయి వాటిని ప్లాస్టిక్ గా భావించి బయటపడేస్తున్నారు కానీ అలా తేలేవే పోషకాల బియ్యం ఇలా తేలినప్పుడు పక్కకు తీసి మిగిలిన బియ్యం కడగాలి ఆ తర్వాత పక్కన తీసిన వాటిని కలుపుకొని వండుకోవాలి వీటిని ప్రాధాన్యం తెలియక చాలామంది లబ్ధిదారులు కిలోకు 16 రూపాయల నుంచి 20 రూపాయల చొప్పున వ్యాపారులకు అమ్మేస్తున్నారు మరికొందరు టిఫిన్ సెంటర్ల వారికి విక్రయిస్తున్నారు రేషన్ పంపిణీ చేసే సమయంలో ప్రతినిలా ఒకటి నుంచి 15వ తేదీలలో ఈ దందా కొనసాగుతోంది

ప్రతి ఒక్కరూ వీటినే తినాలి అని మల్లికార్జున్ బాబు డిఎస్ఓ కామారెడ్డి గారు అన్నారు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతో ప్రభుత్వం రేషన్ బియ్యం లో పోషకాలు కలుపుతోంది పాఠశాలలో లబ్ధిదారులకు ఇవే సరఫరా చేస్తున్నాము ఇందులో బి12 ఐరన్ పోలిక్ యాసిడ్ లో ఉంటాయి ప్రతి ఒక్కరు పోషకాల బియ్యం తినడానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన అన్నారు

ఈ ఫోర్టీఫైడ్ రైస్ అంటే పోషకాలబియ్యం లో ఉండేది ఏమిటంటే బీట్ వెల్ ఐరన్ పోలిక్ యాసిడ్లు ఉంటాయి ఇవి నరాల పటిష్టతకు రక్తం వృద్ధి చెందడానికి మెదడు సక్రమంగా పనిచేయడానికి ఉపయోగపడతాయి వీటినే పాఠశాల విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి అంగన్వాడీలకు సరఫరా చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా ఇటీవల పాఠశాల విద్యార్థుల్లో రక్తపరీక్షలు చేయగా ఒక వెయ్యి 4037 మంది రక్తహీనతతో పాద బాధపడుతున్నట్లు తేలింది అలాగే 20,000 మంది మహిళలు ఈ సమస్య ఎదుర్కొంటున్నట్లు పేర్కొంటున్నారు వీటిని తల సేమియా వ్యాధిగ్రస్తులు మినహా అందరూ తినవచ్చు తల సేమియా వ్యాధిగ్రస్తులు రక్త కణాలు కొడవలి ఆకారంలో ఉండడంతో నరాల్లో ఆగిపోయే ప్రమాదం ఉంది అందుకే వారికి ఈ బియ్యం అందించవద్దు


No comments:

Post a Comment