Monday 25 March 2024

నియమ నిష్ఠలతో కొనసాగుతున్న రంజాన్ ఉపవాస దీక్షలు

 


ముస్లింల పవిత్ర మాసం రంజాన్ మాసంలో చేపట్టే ఉపవాస దీక్షలు నియమా నిష్టల మధ్య కొనసాగుతున్నాయి ఈనెల 12 నుంచి ప్రారంభమైన ఈ ఉపవాస దీక్షలు ఏప్రిల్ 10 రాత్రికి ముగుస్తాయి శవ్వాళ మాసం చంద్ర దర్శనంతో ఏప్రిల్ 11న ముస్లింలు రంజాన్ ఈద్-ఉల్-ఫితర్ పర్వదినాన్ని జరుపుకోవాలని సన్నద్ధమవుతున్నారు. ఈ మాసంలోనే దివ్య ఖురాన్ ముస్లింల పవిత్ర గ్రంథం దివి నుంచి భూమికి పంపబడిందిగా విశ్వసిస్తూ అత్యంత పవిత్ర రాత్రిగా కొలిచే షబ్బీ ఖద్రి జాగరణ రాత్రిని అత్యంత భక్తిశ్రద్ధలతో దైవారాధనలో గడుపుతారు రంజాన్ ప్రారంభంలో మొదలుపెట్టిన తరావీ నమాజులు దివ్య ఖురాన్ పట్టణం రాత్రి నమాజ్తో ముగిసింది రంజాన్ మాసంలో అన్ని రాత్రుల కన్నా ఈ రాత్రిని శుభాల రాత్రిగా పరిగణిస్తారు రంజాన్ మాసం ఆరంభం నుండి చిన్న పెద్దల నమాజులతో మసీదులు ముస్లింల ఇల్లు దైవారాధనలతో కలకలలాడుతాయి రంజాన్ మాసంలో ముస్లింలు పరస్పర ఇఫ్తార్ విందులలో పాల్గొంటున్నారు. కాగా ఎన్నికల కూడా అమలు ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఇఫ్తార్ విందు ఈసారి లేనట్టుగానే కనిపిస్తుంది. ఈ దఫా ఎండలు దంచి కొట్టడంతో కొంతమేర ఇబ్బందులు తప్పడం లేదు అయినా దీక్షపరులు దైవారాధనలు ఉత్సాహంగా ఈ ఉపవాస దీక్షలో పాల్గొనడం గమనార్హం


No comments:

Post a Comment